Great Bombay Circus: 30 ఏళ్ల తర్వాత హైద్రాబాద్‌కు గ్రేట్ బాంబే సర్కస్.. ఎక్కడో తెలుసా?
గ్రేట్ బాంబే సర్కస్ 104 సంవత్సరాల చరిత్రలో ఇప్పటివరకు భారతదేశంలోని అనేక నగరాల్లో విజయవంతంగా ప్రదర్శన ఇచ్చింది. మూడు దశాబ్దాల తర్వాత ప్రస్తుతం హైదరాబాద్ నగరానికి తిరిగి వచ్చింది. ఆసియాలోనే అతిపెద్ద సర్కస్‌గా పేరుగాంచిన గ్రేట్ బాంబే సర్కస్ 30 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్ హెచ్‌ఎంటీ గ్రౌండ్స్‌లో ప్రదర్శిస్తోంది.

గ్రేట్ బాంబే సర్కస్ 104 సంవత్సరాల చరిత్రలో ఇప్పటివరకు భారతదేశంలోని అనేక నగరాల్లో విజయవంతంగా ప్రదర్శన ఇచ్చింది. మూడు దశాబ్దాల తర్వాత ప్రస్తుతం హైదరాబాద్ నగరానికి తిరిగి వచ్చింది. ఆసియాలోనే అతిపెద్ద సర్కస్‌గా పేరుగాంచిన గ్రేట్ బాంబే సర్కస్ 30 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్ హెచ్‌ఎంటీ గ్రౌండ్స్‌లో ప్రదర్శిస్తోంది. ఈ బాంబే సర్కస్‌లో ప్రతిరోజూ మూడు ఆటలు ఉంటాయి. మధ్యాహ్నం 1గంటకు, సాయంత్రం 4 గంటలకు, 7 గంటలకు ప్రత్యేక ప్రదర్శనలు అందుబాటులో ఉంటాయి.
వీటి ధరలు రూ. 100 , రూ. 200, రూ.300, రూ.400 వరకు ఉన్నాయి. గ్రేట్ బాంబే సర్కస్‌లో 60 అడుగుల ఎగిరే ట్రాపెజ్ కళాకారులు స్కైవాక్, అమెరికన్ ట్రాంపోలిన్, ఇథియోపియన్ ఐకారియన్ యాక్ట్, రష్యన్ రింగ్ డ్యాన్స్, అరేబియన్ వంటి ప్రపంచవ్యాప్తంగా డేర్ డెవిల్ విన్యాసాలు ప్రదర్శించే కళాకారులు ఇక్కడ మనల్ని అలరిస్తారు. మంగోలియన్ ఐరన్ బాల్ (స్ట్రాంగ్ మ్యాన్), చైనీస్ స్వోర్డ్ బ్యాలెన్స్ పిల్లలలో ఇష్టమైన జోకర్స్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. 80 మందికి పైగా స్వదేశీ, విదేశీ కళాకారులు అద్భుతమైన విన్యాసాలు, వినూత్న కార్యక్రమాలను ప్రదర్శినతో పాటు విదేశీ కుక్కలతో నంబర్ కౌంటింగ్ షో ఉంటుంది. సంపూర్ణమైన కుటుంబ వినోదం కోసం మరెన్నో కార్యక్రమాలు ఇందులో వుంటాయి.
మరన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..