ఇదేం పని మేడమ్..! గురుకుల హాస్టల్‌లో గుట్టుగా బీర్లు తాగుతున్న మహిళా ప్రిన్సిపాల్

విద్యాలయం దేవాలయంతో సమానంగా భావిస్తుంటాం. అలాంటి దేవాలయంలో మద్యానికి తావే ఉండదు. ముఖ్యంగా విద్యాబుద్ధులు చెప్పే ఉపాధ్యాయులు పిల్లలకు ఆదర్శంగా ఉండాలి. కానీ ఓ మహిళా ప్రిన్సిపాల్ తన రూమ్ లో పుస్తకాలకు బదులు మద్యం సీసాలు పెట్టుకుంది.

ఇదేం పని మేడమ్..! గురుకుల హాస్టల్‌లో గుట్టుగా బీర్లు తాగుతున్న మహిళా ప్రిన్సిపాల్
Beers In Prinicipal Room
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Jul 06, 2024 | 7:00 PM

విద్యాలయం దేవాలయంతో సమానంగా భావిస్తుంటాం. అలాంటి దేవాలయంలో మద్యానికి తావే ఉండదు. ముఖ్యంగా విద్యాబుద్ధులు చెప్పే ఉపాధ్యాయులు పిల్లలకు ఆదర్శంగా ఉండాలి. కానీ ఓ మహిళా ప్రిన్సిపాల్ తన రూమ్ లో పుస్తకాలకు బదులు మద్యం సీసాలు పెట్టుకుంది. అక్కడ చదివే విద్యార్థినులు మాత్రం ఆ మహిళా ప్రిన్సిపల్ మద్యం సీసాల బాగోతాన్ని ఎలా బట్ట బయలు చేశారో.. తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలోని బాలెంల సాంఘీక సంక్షేమ బాలికల గురుకుల డిగ్రీ కళాశాల ఉంది. ఈ కాలేజీలో 300 మందికిపైగా బాలికలు చదువుతున్నారు. బాలికల డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ గా శైలజ పనిచేస్తున్నారు. ప్రిన్సిపల్ విధుల పట్ల నిర్లక్ష్యం చూపుతూ తన రూమ్ లో మద్యం సేవిస్తూ ఉండేది. కళాశాలలో సమస్యలపై ప్రిన్సిపల్ ను ప్రశ్నిస్తే సిబ్బందితో బాలికలను ఇబ్బందులు పెడుతున్నారు. ప్రిన్సిపల్ తన రూమ్ లో ఫైళ్లు పుస్తకాలతో పాటు మద్యం సీసాలను విద్యార్థినిల కంటపడ్డాయి.

ప్రిన్సిపాల్ కార్యాలయంలో మద్యం సీసాల విషయం తెలుసుకున్న విద్యార్థినులు ప్రిన్సిపల్ రూమ్ కి తాళం వేశారు. అక్కడే ఉన్న సహాయ కేర్ టెకర్ ని ప్రశ్నించి నిలదీశారు. తక్షణమే ఉన్నతాధికారులు వచ్చి విచారణ జరపాలంటూ, దీంతో కళాశాల విద్యార్థినులు ఆందోళనకు దిగారు. ప్రిన్సిపల్ కు సహకరిస్తున్న సిబ్బందిని విధుల నుండి తొలగించి చర్యలు తీసుకోవాలని భీష్మించారు. విద్యార్థినీల అందోళన చూసిన కేర్ టేకర్ విషయాన్ని దారి మళ్లించేందుకు యత్నించారని విద్యార్థులు ఆరోపించారు. విద్యార్థినీలు ఆందోళన చేస్తున్న సమయంలోనే కేర్ టేకర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో వెంటనే ఇతర సిబ్బంది, విద్యార్థినులు అడ్డుకున్నారు.

కాలేజీ విద్యార్థినీల ఆందోళన విషయం తెలుసుకున్న ఆర్డీవో వేణు మాధవ్ రావు, కళాశాలల ఆర్సీవో అరుణ కుమారి, జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారిణి జ్యోతి సహా పోలీసులు కళాశాలకు వచ్చారు. వాస్తవాలను విచారించి ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయినా విద్యార్థినులు శాంతించలేదు. తరచూ ఇలాంటి వేధింపులు జరుగుతున్నాయని ముందు కాలేజీ ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేసి విచారణ చేయాలని విద్యార్థినీలు డిమాండ్ చేశారు. కాలేజీలో ప్రిన్సిపల్ మద్యం సేవిస్తూ ఇస్టారాజ్యంగా వ్యవహరించేదని బాలికలు ఆరోపిస్తున్నారు. సహాయ కేర్ టేకర్ సౌమిత్రితో కలిసి అర్ధరాత్రి వేళ మద్యం సేవిస్తూ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. తరచూ మద్యం సేవిస్తూ ప్రిన్సిపాల్ శైలజ తమను వేధింపులకు గురి చేస్తుందని వాపోయారు. కళాశాలలో మద్యం సీసాల కలకలం నేపథ్యంలో విద్యార్థినుల భద్రతపై తల్లితండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..