AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alai Balai: చిరూ ఫొటో సెషన్‌ ఆపేయండి.. లేదంటే నాకు సెలవియ్యండి.. అలయ్‌ బలయ్‌లో గరికపాటి సీరియస్‌

గరికపాటి నరసింహరావుకి కోపం వచ్చింది. దీంతో అంతా గరికపాటి వైపు తిరిగారు. దీంతో గరికపాటి చెప్పిన తర్వాత చిరంజీవి ఆయన దగ్గరకు వచ్చి మరీ పలుకరించారు. చాలాసేపు ఆయన పక్కనే కూర్చుని మాట్లాడారు. 

Alai Balai: చిరూ ఫొటో సెషన్‌ ఆపేయండి.. లేదంటే నాకు సెలవియ్యండి.. అలయ్‌ బలయ్‌లో గరికపాటి సీరియస్‌
Garikipati Narasimha Rao and Chiranjeevi
Sanjay Kasula
| Edited By: Amarnadh Daneti|

Updated on: Oct 07, 2022 | 9:36 AM

Share

గరికపాటి నరసింహరావుకి కోపం వచ్చింది. అలయ్‌ బలయ్‌లో ఆయన మాట్లాడుతూ సీరియస్ అయ్యారు గరికపాటి. ఆయనకు ఎందుకు కోపం వచ్చింది..? ఎవరి మీద సీరియస్ అయ్యారు..? ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచన కర్త గరికపాటి నరసింహా రావు మాట్లాడటం మొదలుపెట్టే సమయంలో మెగాస్టార్ చిరంజీవి ఫోటోలు దిగేందుకు వెళ్లారు. అంతా చిరంజీవినే గమనించడం మొదలు పెట్టారు..దీంతో గరికపాటి స్పందించారు. చిరంజీవి గారూ.. మీ ఫోటో సెషన్ ఆపేయండి.. లేదంటే నాకు సెలవియ్యండని వ్యాఖ్యానించారు. దీంతో అంతా గరికపాటి వైపు తిరిగారు. దీంతో గరికపాటి చెప్పిన తర్వాత చిరంజీవి ఆయన దగ్గరకు వచ్చి మరీ పలుకరించారు. చాలాసేపు ఆయన పక్కనే కూర్చుని మాట్లాడారు.

ఇదే సభలో అంతకు ముందు గరికపాటిని ప్రశంసించారు చిరంజీవి. త్వరలో తన ఇంటికి పిలుపుస్తానని వేదికపైనే ప్రకటించి ఆయనపై తన గౌరవాభిమానాల్ని చాటుకున్నారు చిరంజీవి. అంతకుముందు.. గరికపాటికి చిరంజీవి, దత్తాత్రేయ కలిసి సన్మానం చేశారు.

చిరంజీవి మాట్లాడుతూ..

మతాలు, కులాలు, వర్గాలకు అతీతంగా నిర్వహిస్తున్న గొప్ప సమ్మేళనం  అలయ్ బలయ్ అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఇలాంటి గొప్ప కార్యక్రమం విశ్వవ్యాప్తం కావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు చిరంజీవి.  ప్రేమ, సోదరాభావం అనే గొప్ప సందేశాన్ని ఇస్తున్న ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమ సందేశాన్ని జనంలోకి తీసుకెళ్లాలని చిరు పిలుపునిచ్చారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాజకీయ ప్రముఖులతో పాటు హీరో చిరంజీవి హాజరయ్యారు.

ఇవి కూడా చదవండి

ఉత్సాహంగా అలయ్‌-బలయ్‌..

హైదరాబాద్‌ నాంపల్లిలో అలయ్‌-బలయ్‌ కార్యక్రమం ఉత్సాహంగా జరుగుతోంది. హర్యానా గవర్నర్‌గా ఉన్న బండారు దత్తాత్రేయ ఏటా దీన్ని నిర్వహిస్తున్నారు. పార్టీలకతీతంగా వేడుకకు హాజరయ్యారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా కళా ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. వివిధ పార్టీల నేతలతోపాటు కేరళ గవర్నర్ ఆరీఫ్ మహమ్మద్ ఖాన్, మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. అయితే అలయ్‌ బలయ్‌లో స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచారు మెగాస్టార్‌ చిరంజీవి. కళాకారులతో కలిసి డప్పు వాయించారు. పోతురాజులతో కలిసి డ్యాన్స్‌ చేశారు. ఆయనకు సాదర స్వాగతం పలికారు బండారు దత్తాత్రేయ. మరోవైపు అలయ్‌ బలయ్‌లో సందడి చేశారు మాజీ ఎంపీ వీహెచ్‌.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం