AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పూజలు లేకుండానే నేరుగా గంగమ్మ ఒడికి గణేశుడు.. పండుగ వేళ ఇదేం తంతు..

రంగారెడ్డి జిల్లా జిల్లేడు చౌదరిగుడా మండలం పీర్జాపూర్‌లో వినాయక చవితి వేళ వర్గ విభేదాలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఆంజనేయస్వామి ఆలయంలో గణేశుడిని ప్రతిష్ఠించి నవరాత్రులు నిర్వహించాలన్న విషయంలో రెండు వర్గాల మధ్య వివాదం తలెత్తింది. ఘర్షణలకు అవకాశం లేకుండా పోలీసులు ఆలయంలో ఏ వర్గం విగ్రహాన్ని పెట్టకూడదని సూచించారు. దీంతో అసంతృప్తికి గురైన ఓ వర్గం గణేశుడిని గ్రామ చెరువులో నిమజ్జనం చేసింది. పూజలు, నవరాత్రులు నిర్వహించకుండానే విగ్రహం నిమజ్జనం కావడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

పూజలు లేకుండానే నేరుగా గంగమ్మ ఒడికి గణేశుడు.. పండుగ వేళ ఇదేం తంతు..
Ganesh Chaturthi
Boorugu Shiva Kumar
| Edited By: |

Updated on: Sep 14, 2026 | 5:07 PM

Share

గణేష్ నవరాత్రులు కలిసికట్టుగా ఐకమత్యంతో జరుపుకునే వేడుక.. అలాంటి పండుగలను గ్రామాల్లో అంగరంగ వైభవంగా నిర్వహించాల్సిన గ్రామ పెద్దలు, మరి కొందరు గ్రూపులుగా విడిపోయారు. గ్రామానికి తెచ్చిన గణేశుడిని ప్రతిష్టించకుండా, పూజలు నిర్వహించకుండా వివాదాల మధ్య గంగమ్మ ఒడికి చేరుకుంది. ఈ సంఘటన భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది. రంగారెడ్డి జిల్లా జిల్లేడు చౌదరిగుడా మండలం పీర్జాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక ఆంజనేయస్వామి దేవాలయంలో గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి నవరాత్రులు చేయాలని కొందరు గ్రామస్తులు భావించారు. అయితే మరో వర్గం వారు ఇది ఒప్పుకోకుండా తాము ఏర్పాటు చేసిన గణేశుడే ఉండాలని పట్టుబట్టారు. పట్టుదలతో ఇరువర్గాల మధ్య వివాదం రేగింది. గ్రామంలో జరుగుతున్న ఈ వివాదం ఘర్షణలకు తావివ్వకుండా చౌదరిగుడా పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఆలయంలో ఎవరు గణేష్ విగ్రహాన్ని పెట్టకుండా వేరేచోట పెట్టుకోవాలని ఆదేశించారు. దీంతో మరో వర్గం చేసేది లేక తీవ్ర అసంతృప్తితో గణేశుడిని గ్రామ చెరువులో నిమజ్జనం చేశారు.

పీర్జాపూర్ గ్రామానికి చెందిన శ్రీరాములు, తిరుపతి, సంగమేష్, కురువ మల్లయ్య కురువ రాముడు, రమేష్ తదితరులు గ్రామ ఆంజనేయ స్వామి దేవాలయంలో వినాయక ఉత్సవాలను నిర్వహించాలని భావించారు. వినాయక చవితి రోజున గణేశ్ విగ్రహాన్ని గ్రామ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రతిష్టించేందుకు నవరాత్రులు జరిపేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.

అయితే గ్రామ సర్పంచ్ ఎర్రగుమ్ము నర్సింలు, ఇంకొంతమంది ఆంజనేయస్వామి దేవాలయంలో తాము విగ్రహాన్ని పెడతామని ముందుకు వచ్చారు. దీంతో ఇరువర్గాల మధ్య వివాదం రాజుకుంది. ఇక రెండు వర్గాలు వివాదానికి దిగుతున్నాయన్న సమాచారంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.

వీడియో చూడండి..

గ్రామంలో పండుగ వేళ ఎలాంటి వివాదాలు ఘర్షణలు చేయకుండా ఆలయంలో ఏ వర్గం విగ్రహాన్ని పెట్టకుండా ఇతర ప్రాంతాల్లో పెట్టుకోవాలని ఆదేశించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఓ వర్గం వినాయక విగ్రహాన్ని నేరుగా గంగమ్మ చెంతకు తీసుకువెళ్లారు.

వినాయకుడికి ఎలాంటి పూజలు నిర్వహించకుండా నవరాత్రులు జరపకుండా గ్రామ చెరువులో నిమజ్జనం చేయడం గమనార్హం. వర్గ విభేదాల కారణంగా వినాయక చవితి నాడే గణనాథుడి విగ్రహ నిమజ్జనం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
విరిగిన పుర్రె ఎముక .. ఫ్లైదుబాయ్ హీరోకు ఎమర్జెన్సీ ఆపరేషన్
విరిగిన పుర్రె ఎముక .. ఫ్లైదుబాయ్ హీరోకు ఎమర్జెన్సీ ఆపరేషన్
భారతదేశ రూపురేఖలు మార్చిన.. ప్రధాని మోదీ 25 విప్లవాత్మక ఆలోచనలు
భారతదేశ రూపురేఖలు మార్చిన.. ప్రధాని మోదీ 25 విప్లవాత్మక ఆలోచనలు
వలపు వల.. నేవీ ఉద్యోగులను మాయ చేసిన పాక్ మహిళా ఏజెంట్లు వీరేనట!
వలపు వల.. నేవీ ఉద్యోగులను మాయ చేసిన పాక్ మహిళా ఏజెంట్లు వీరేనట!
ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్.. ముహూర్తం ఖారారు.. అప్పటినుంచే..
ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్.. ముహూర్తం ఖారారు.. అప్పటినుంచే..
32 ఫోర్లు, 17 సిక్సర్లు.. ఎకానా గడ్డ.. సర్పంచ్ సాబ్ అడ్డా
32 ఫోర్లు, 17 సిక్సర్లు.. ఎకానా గడ్డ.. సర్పంచ్ సాబ్ అడ్డా
రోజూ నీరసంగా ఉంటున్నారా? ఈ సహజ ఆహారాలు మీ డైట్‌లో చేర్చుకోండి
రోజూ నీరసంగా ఉంటున్నారా? ఈ సహజ ఆహారాలు మీ డైట్‌లో చేర్చుకోండి
'జీవిత భాగస్వామిగా భావించా.. నీకు ఎయిడ్స్ ఉందా? అన్నాడు'
'జీవిత భాగస్వామిగా భావించా.. నీకు ఎయిడ్స్ ఉందా? అన్నాడు'
అరసవల్లి సూర్యనారాయణ స్వామికి అపురూప ఆభరణాల సమర్పణ.. విలువెంతంటే
అరసవల్లి సూర్యనారాయణ స్వామికి అపురూప ఆభరణాల సమర్పణ.. విలువెంతంటే
దసరా, దీపావళికి ఇంటికెళ్తున్నారా..? ఈ రైళ్లల్లో సీట్లు ఖాళీ
దసరా, దీపావళికి ఇంటికెళ్తున్నారా..? ఈ రైళ్లల్లో సీట్లు ఖాళీ
టీ20I డెబ్యూలోనే దుమ్ములేపిన నమన్ ధీర్
టీ20I డెబ్యూలోనే దుమ్ములేపిన నమన్ ధీర్