AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సరికొత్త ఒరవడితో పాలన.. భారతదేశ రూపురేఖలు మార్చిన మోదీ 25 విప్లవాత్మక ఆలోచనలు

Narendra Modi 25 Years: ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల పరిపాలనా ప్రయాణంలో గుజరాత్‌ నుంచి జాతీయ స్థాయి వరకు అనేక విధానాలు, కార్యక్రమాలు తెరపైకి వచ్చాయి. వైబ్రంట్‌ గుజరాత్‌, యూపీఐ, మన్‌ కీ బాత్‌, యోగా దినోత్సవం, మేక్‌ ఇన్‌ ఇండియా, ఆత్మనిర్భర్‌ భారత్‌, వందే భారత్‌, మిషన్‌ LiFE, నారీ శక్తి వందన్‌ వంటి 25 ఆలోచనలు, కార్యక్రమాలను ఈ కథనంలో తెలుసుకుందాం..

సరికొత్త ఒరవడితో పాలన.. భారతదేశ రూపురేఖలు మార్చిన మోదీ 25 విప్లవాత్మక ఆలోచనలు
PM Modi Governance Journey
Shaik Madar Saheb
|

Updated on: Oct 07, 2026 | 8:10 AM

Share

ఒక దేశం అభివృద్ధి చెందాలన్నా, ప్రపంచ వేదికపై తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలన్నా కేవలం ప్రభుత్వాలు మారితే సరిపోదు… ఆలోచనలు మారాలి. దశాబ్దాలుగా కొనసాగుతున్న పాత పద్ధతులకు స్వస్తి పలికి, సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన 25 ఏళ్ల పరిపాలనలో కొన్ని అద్భుతమైన ఆలోచనలు ఇవి. కేవలం గుజరాత్ నుంచే కాకుండా, భారతదేశాన్ని ప్రపంచంలోనే నంబర్‌ వన్ స్థానం వైపు నడిపిస్తున్న ఆ 25 విప్లవాత్మక ఆలోచనలేంటో చూద్దాం..

1. వైబ్రెంట్ గుజరాత్ – 2003: పెట్టుబడుల కోసం సరికొత్త పోటీ!

2003 వరకు మన దేశంలో ఏ రాష్ట్రమైనా పెట్టుబడుల కోసం ఢిల్లీ వైపు ఎదురుచూడటం ఆనవాయితీ. కానీ, ఒక ముఖ్యమంత్రి స్వయంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులను గాంధీనగర్‌కు ఆహ్వానించడంతో ఈ ధోరణి మారింది. ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఈ వేదికలో ఒకే చోట అన్ని అనుమతులు, మౌలిక వసతుల పరిశీలనకు అవకాశం కల్పించారు. దీంతో ఇతర రాష్ట్రాలు కూడా పెట్టుబడుల కోసం ఒకదానితో ఒకటి పోటీ పడే ఆరోగ్యకరమైన సమాఖ్య విధానం (Competitive Federalism) దేశంలో బలపడింది.

రణ్ ఉత్సవ్: ఉప్పు ఎడారిలో అద్భుత పర్యాటకం!

2001 భూకంపం తర్వాత నిర్మానుష్యంగా మారిన కచ్ ఉప్పు ఎడారి ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మార్చడమే “రణ్ ఉత్సవ్”. 2005లో టెంట్ నగరాలను ఏర్పాటు చేసి జానపద కళాకారులు, హస్తకళాకారులను ఇక్కడకు ఆహ్వానించారు. నేడు లక్షలాది మంది పర్యాటకులను ఆకర్షిస్తూ, తెల్లని ఉప్పు ఎడారి గ్రామీణ సాంస్కృతిక పర్యాటకానికి అంతర్జాతీయ నమూనాగా నిలిచింది.

3. వ్యవసాయ మహోత్సవం: రైతు ముఖంలో చిరునవ్వు!

గతంలో వ్యవసాయ సలహాలు ఏకపక్షంగా ఉండేవి. ఏ ప్రాంతానికీ సరిపడని ఆ సాధారణ సలహాలకు స్వస్తి పలకడమే ‘వ్యవసాయ మహోత్సవం’. శాస్త్రవేత్తలు, అధికారులు నేరుగా రైతులతో మమేకమై, మట్టి ఆరోగ్య కార్డుల ఆధారంగా నిర్దిష్టమైన సలహాలు అందించారు. ఫలితంగా రైతుల దిగుబడి, ఆదాయంలో భారీ పెరుగుదల నమోదైంది.

4. వంచే గుజరాత్ – రాష్ట్రవ్యాప్త పఠన ఉద్యమం

కేవలం ఒక గంట పాటు రాష్ట్రమంతా పుస్తకాలు చదివేలా ప్రోత్సహించిన అపూర్వ జ్ఞాన ఉద్యమం ఇది. గ్రంథాలయాలను బలోపేతం చేస్తూ, చదవడం అనేది ఒంటరి పని కాకుండా ఒక సామూహిక ప్రజా సంస్కృతిగా మార్చిన గొప్ప కార్యక్రమం ఇది.

5. జన భాగస్వామ్యం: ప్రభుత్వ పథకాల్లో ప్రజలే భాగస్వాములు!

ప్రజలను కేవలం లబ్ధిదారులుగా కాకుండా, విధాన రూపకల్పనలో భాగస్వాములుగా మార్చిన విధానమే జన భాగస్వామ్యం. డిజిటల్ ప్లాట్‌ఫారాలు, సంప్రదింపుల ద్వారా దేశాభివృద్ధిలో పౌరుల స్వామ్యభావాన్ని ఇది పెంచింది.

6. మన్ కీ బాత్: ప్రజలతో నేరుగా ప్రధాని సంభాషణ!

ఒక ప్రధాని దేశ ప్రజలతో ప్రతీ నెలా నిరంతరం మాట్లాడటం చరిత్రలో ఇదే మొదటిసారి. ప్రెస్ కాన్ఫరెన్స్‌లకు అతీతంగా, సాధారణ పౌరుల విజయాలను గుర్తిస్తూ, పరిశుభ్రత, నీటి సంరక్షణ వంటి అంశాలపై ప్రజల సహకారాన్ని కోరుతూ సాగుతున్న అద్భుతమైన ప్రజా సంభాషణ కార్యక్రమం ఇది.

7. వలసవాదం నుంచి విముక్తి: ఆత్మగౌరవ ప్రతీక!

బ్రిటిష్ పాలన తాలూకు గుర్తులను తొలగించి, దేశంలోని నగరాలు, రహదారులు, భవనాలకు భారతీయ పేర్లను క్రమబద్ధంగా ప్రవేశపెట్టారు. ఇది మన సాంస్కృతిక ఆత్మవిశ్వాసాన్ని, జాతీయ గుర్తింపును బలోపేతం చేసిన జాతీయ ప్రాజెక్ట్.

8. “గివ్ ఇట్ అప్” ఉద్యమం: సామూహిక త్యాగానికి నిదర్శనం!

ధనిక, పేద తేడా లేకుండా ఉన్న ఎల్పీజీ సబ్సిడీని… గ్యాస్ ఖర్చు భరించగలిగినవారు స్వచ్ఛందంగా వదులుకోవాలని కోరిన అద్భుత పిలుపు ఇది. కోట్లకు పైగా కుటుంబాలు సబ్సిడీని వదులుకుని, ఉజ్జ్వల పథకం ద్వారా గ్రామీణ పేద మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందేలా తోడ్పడ్డాయి.

9. అంతర్జాతీయ యోగా దినోత్సవం: ప్రపంచానికి భారతీయ కానుక!

భారతీయ సాంస్కృతిక సంప్రదాయమైన యోగాను ఐక్యరాజ్యసమితి గుర్తింపుతో అంతర్జాతీయ వేదికపైకి తీసుకువచ్చారు. నేడు 190కి పైగా దేశాల్లో ప్రతి సంవత్సరం జూన్ 21న యోగా దినోత్సవం జరుపుకుంటూ ప్రపంచ ప్రజారోగ్యానికి భారత్ గొప్ప మార్గాన్ని చూపింది.

10. బేటీ బచావో, బేటీ పడావో: బాలికల రక్షణే జాతీయ లక్ష్యం!

లింగ నిష్పత్తి అసమతుల్యతను రూపుమాపేందుకు, బాలికల జీవన రక్షణ, విద్యను ప్రధాన లక్ష్యంగా చేసుకుని ప్రారంభించిన ఉద్యమం ఇది. బాలికలను కేవలం లబ్ధిదారులుగా కాకుండా భవిష్యత్ నాయకులుగా తీర్చిదిద్దుతోంది.

11. ప్రజల పద్మ పురస్కారాలు: అట్టడుగు ప్రతిభకు గుర్తింపు!

పెద్ద పెద్ద ప్రముఖులకే పరిమితమైన పద్మ పురస్కారాలను, సమాజానికి నిస్వార్థంగా సేవలందిస్తున్న సాధారణ అట్టడుగు స్థాయి వ్యక్తులకు అందజేసేలా ఈ ప్రక్రియను పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధం చేశారు.

12. ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్: భిన్నత్వంలో ఏకత్వానికి ప్రత్యక్ష అనుభవం!

ప్రతి రాష్ట్రం మరో రాష్ట్రంతో అనుసంధానమై విద్య, భాషలు, పండుగలు, ఆహార సంస్కృతులను పరస్పరం పంచుకునేలా చేసిన అద్భుతమైన కార్యక్రమం. ఐక్యతను కేవలం రాజ్యాంగ సూత్రంగా కాకుండా ప్రత్యక్ష అనుభవంగా మార్చింది.

13. యూపీఐ (UPI) – విప్లవాత్మక డిజిటల్ చెల్లింపు వ్యవస్థ!

2016లో కోట్లలో ఉన్న లావాదేవీలు, 2025-26 నాటికి కోట్లాది మందికి చేరి రోజువారీ జీవితంలో భాగమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న రియల్‌టైమ్ డిజిటల్ చెల్లింపుల్లో సగం మన యూపీఐ ద్వారానే జరుగుతుండటం విశేషం.

14. ఖేలో ఇండియా: గ్రామస్థాయి నుంచి జాతీయ క్రీడాకారులు!

పట్టణాలకే పరిమితమైన క్రీడలను గ్రామీణ స్థాయికి తీసుకువచ్చి, చిన్న ప్రాంతాల ప్రతిభావంతులకు సరైన శిక్షణ, వేదికను అందిస్తున్న అద్భుతమైన క్రీడా విప్లవం ఇది.

15. ఒక జిల్లా – ఒక ఉత్పత్తి (ODOP): స్థానిక బ్రాండ్లకు అంతర్జాతీయ మార్కెట్!

ప్రతి జిల్లాలో ఉన్న ప్రత్యేక స్థానిక ఉత్పత్తులకు బ్రాండింగ్, జీఐ ట్యాగ్, ఈ-కామర్స్ సహాయం అందిస్తూ కళాకారులు, రైతులను గ్లోబల్ మార్కెట్‌‌కు పరిచయం చేస్తున్న కార్యక్రమం.

16. ఆకాంక్షిత జిల్లాలు – వైబ్రెంట్ విలేజెస్: వెనుకబడిన ప్రాంతాలకు అభివృద్ధి వెలుగులు!

అభివృద్ధికి దూరంగా ఉన్న వెనుకబడిన జిల్లాలను రియల్‌టైమ్ డేటా, ఆరోగ్య, విద్య సూచికల ద్వారా పోటీ తత్వంతో ముందుకు తెచ్చి ప్రధాన ప్రవాహంలో కలిపిన విధానం.

17. పరీక్షా పే చర్చా: విద్యార్థుల్లో ఒత్తిడిని దూరం చేసే వేదిక!

బోర్డు పరీక్షల భయాన్ని పోగొట్టి, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో నేరుగా మాట్లాడి మానసిక ఆరోగ్యాన్ని జాతీయ చర్చలోకి తెచ్చిన సమున్నత వేదిక.

18. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ: ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రం!

నిర్లక్ష్యానికి గురైన ఆదివాసీ ప్రాంతంలో నిర్మించిన.. 182 మీటర్ల ఎత్తైన ప్రపంచ అత్యున్నత విగ్రహం. ఇది నేడు కోట్ల మంది పర్యాటకులను ఆకర్షిస్తూ స్థానిక ప్రజలకు భారీ ఉపాధిని అందిస్తోంది.

19. వందే భారత్ రైలు: మేడ్ ఇన్ ఇండియా హైస్పీడ్ విప్లవం!

భారతదేశపు తొలి స్వదేశీ, అధిక వేగంతో ప్రయాణించే రైలు. ప్రపంచ స్థాయి సౌకర్యాలు, భద్రతతో పాటు క్లిష్టమైన ఇంజినీరింగ్ రంగంలో భారత్ తన స్వశక్తిని నిరూపించుకున్న అద్భుతమైన ప్రయాణం.

20. ఆత్మనిర్భర్ భారత్: స్వావలంబన దిశగా అడుగులు!

రక్షణ, ఫార్మా, సెమీకండక్టర్లు వంటి కీలక రంగాలలో దిగుమతులను తగ్గించి, భారతదేశాన్ని స్వయం సమృద్ధి గల దేశంగా మార్చడానికి అమలు చేస్తున్న ప్రత్యేక వ్యూహాత్మక విధానం.

21. వోకల్ ఫర్ లోకల్: స్థానిక చేనేత, హస్తకళలకు జీవం!

మన దేశంలో తయారయ్యే స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయాలని పిలుపునివ్వడం ద్వారా సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు, విశ్వకర్మ సంప్రదాయాలకు ప్రాణం పోస్తున్న ఉద్యమం.

22. మిషన్ LiFE – పర్యావరణానికి అనుకూల జీవనశైలి!

వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి ప్రభుత్వ చట్టాలే కాకుండా, ప్రతి ఒక్కరి రోజువారీ జీవనశైలిలో పర్యావరణ పరిరక్షణ భాగం కావాలని COP26 వేదికగా భారత్ ప్రపంచానికి అందించిన సందేశం.

23. శ్రీ అన్న (చిరుధాన్యాలు): పేదల పోషకాహారానికి మళ్ళీ వైభవం!

తక్కువ నీటితో పండే, అధిక పోషకాలు గల చిరుధాన్యాలకు (Millets) మళ్లీ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చి, 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా జరుపుకునేలా చొరవ చూపించారు.

24. నారీ శక్తి వందన్ అధినియమం: చట్టసభల్లో మహిళలకు సముచిత స్థానం!

లోక్‌సభ, రాష్ట్ర శాసనసభల్లో మూడో వంతు స్థానాలను మహిళలకు కేటాయించే చారిత్రాత్మక చట్టం. రాజకీయ రంగంలో లింగ ప్రాతినిధ్యానికి ఇది సరికొత్త ప్రమాణాన్ని ఏర్పాటుచేసింది.

25. శాంతి ద్వారా భారతదేశ అణు రంగ పునరుద్ధరణ :

ప్రభుత్వ ఏకాధిపత్యంలో ఉన్న పౌర అణుశక్తి రంగాన్ని, ఆధునిక జవాబుదారీతనంతో ప్రైవేట్, విదేశీ పెట్టుబడులకు తెరుస్తూ దీర్ఘకాలిక ఇంధన భద్రతను బలోపేతం చేస్తున్న కొత్త నమూనా ఇది.

ఇవన్నీ.. భారతదేశ రూపురేఖలు మార్చిన 25 విప్లవాత్మక ఆలోచనలు ఇవి అని గర్వంగా చెప్పవచ్చు.

Follow Us
భారతదేశ రూపురేఖలు మార్చిన.. ప్రధాని మోదీ 25 విప్లవాత్మక ఆలోచనలు
భారతదేశ రూపురేఖలు మార్చిన.. ప్రధాని మోదీ 25 విప్లవాత్మక ఆలోచనలు
వలపు వల.. నేవీ ఉద్యోగులను మాయ చేసిన పాక్ మహిళా ఏజెంట్లు వీరేనట!
వలపు వల.. నేవీ ఉద్యోగులను మాయ చేసిన పాక్ మహిళా ఏజెంట్లు వీరేనట!
ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్.. ముహూర్తం ఖారారు.. అప్పటినుంచే..
ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్.. ముహూర్తం ఖారారు.. అప్పటినుంచే..
32 ఫోర్లు, 17 సిక్సర్లు.. ఎకానా గడ్డ.. సర్పంచ్ సాబ్ అడ్డా
32 ఫోర్లు, 17 సిక్సర్లు.. ఎకానా గడ్డ.. సర్పంచ్ సాబ్ అడ్డా
రోజూ నీరసంగా ఉంటున్నారా? ఈ సహజ ఆహారాలు మీ డైట్‌లో చేర్చుకోండి
రోజూ నీరసంగా ఉంటున్నారా? ఈ సహజ ఆహారాలు మీ డైట్‌లో చేర్చుకోండి
'జీవిత భాగస్వామిగా భావించా.. నీకు ఎయిడ్స్ ఉందా? అన్నాడు'
'జీవిత భాగస్వామిగా భావించా.. నీకు ఎయిడ్స్ ఉందా? అన్నాడు'
అరసవల్లి సూర్యనారాయణ స్వామికి అపురూప ఆభరణాల సమర్పణ.. విలువెంతంటే
అరసవల్లి సూర్యనారాయణ స్వామికి అపురూప ఆభరణాల సమర్పణ.. విలువెంతంటే
దసరా, దీపావళికి ఇంటికెళ్తున్నారా..? ఈ రైళ్లల్లో సీట్లు ఖాళీ
దసరా, దీపావళికి ఇంటికెళ్తున్నారా..? ఈ రైళ్లల్లో సీట్లు ఖాళీ
టీ20I డెబ్యూలోనే దుమ్ములేపిన నమన్ ధీర్
టీ20I డెబ్యూలోనే దుమ్ములేపిన నమన్ ధీర్
5 ఏళ్ల ప్రజాసేవ.. 75 గంటల ‘మోదీ జాతర’.. తిరుపతిలో భారీ కార్యక్రమం
5 ఏళ్ల ప్రజాసేవ.. 75 గంటల ‘మోదీ జాతర’.. తిరుపతిలో భారీ కార్యక్రమం