AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డిగ్రీ మార్కులతో కెనరా బ్యాంకులో 3,500 ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక

కెనరా బ్యాంక్‌ 2026-27 సంవత్సరానికి 3,500 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత ఉన్న అభ్యర్థులు అక్టోబర్‌ 17, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో 247, తెలంగాణలో 134 పోస్టులు ఉన్నాయి. రాత పరీక్ష లేకుండానే మెరిట్‌, స్థానిక భాషా పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోండి..

డిగ్రీ మార్కులతో కెనరా బ్యాంకులో 3,500 ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
Canara Bank Apprentice Recruitment
Srilakshmi C
|

Updated on: Oct 07, 2026 | 6:39 AM

Share

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ రంగంలో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న గ్రాడ్యుయేట్లకు కెనరా బ్యాంక్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. 2026-27 సంవత్సరానికి 3,500 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో ఆంధ్రప్రదేశ్‌లో 247, తెలంగాణలో 134 పోస్టులు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్‌ 1 నుంచి 17, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు. అభ్యర్థుల ఎంపిక విద్యార్హత మార్కుల మెరిట్‌, స్థానిక భాషా పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా జరుగుతుంది. కెనరా బ్యాంక్‌ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్‌ కింద మొత్తం 3,500 ఖాళీలను ప్రకటించింది. రాష్ట్రాల వారీగా చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో 247, తెలంగాణలో 134, కర్ణాటకలో 581, తమిళనాడులో 391 పోస్టులు ఉన్నాయి.

కేటగిరీల వారీగా ఖాళీల వివరాలు ఇవే..

  • ఎస్సీ కేటగిరీలో పోస్టుల సంఖ్య : 553
  • ఎస్టీ కేటగిరీలో పోస్టుల సంఖ్య : 226
  • ఓబీసీ కేటగిరీలో పోస్టుల సంఖ్య : 845
  • ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలో పోస్టుల సంఖ్య : 335
  • యూఆర్‌ కేటగిరీలో పోస్టుల సంఖ్య : 1531

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు 2023 జనవరి 1 నుంచి 2026 సెప్టెంబర్‌ 1 మధ్య తమ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి 2026 సెప్టెంబర్‌ 1 నాటికి వయసు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ 5 సంవత్సరాలు, ఓబీసీ 3 సంవత్సరాలు, దివ్యాంగులు 10 సంవత్సరాలు చొప్పున సడలింపు ఉంటుంది. ఈ అప్రెంటిస్ పోస్టులకు ప్రత్యేకంగా రాత పరీక్ష నిర్వహించరు. అభ్యర్థుల ఎంపికలో 12వ తరగతి (10+2) లేదా డిప్లొమా మార్కుల మెరిట్‌, రిజర్వేషన్ నిబంధనలు, స్థానిక భాషా పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. దీంతో రాత పరీక్ష లేకుండా బ్యాంకింగ్‌ రంగంలో అనుభవం పొందాలనుకునే గ్రాడ్యుయేట్లకు ఇది మంచి అవకాశం. ఎంపికైన అభ్యర్థులకు ఒక సంవత్సరం పాటు అప్రెంటిస్‌షిప్‌ శిక్షణ అందిస్తారు. ఈ కాలంలో నెలకు రూ.16,650 స్టైపెండ్‌ చెల్లిస్తారు. అప్రెంటిస్‌షిప్‌ ద్వారా బ్యాంకింగ్‌ కార్యకలాపాలు, కార్యాలయ విధానాలు, కస్టమర్‌ సర్వీసులు తదితర అంశాలపై ప్రాక్టికల్‌ అనుభవం పొందే అవకాశం ఉంటుంది.

అభ్యర్థులు నేరుగా కెనరా బ్యాంక్‌ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేయడానికి ముందు National Apprenticeship Training Scheme (NATS) పోర్టల్‌లో తమ పేరును నమోదు చేసుకోవాలి. ముందుగా NATS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసిన తర్వాత కెనరా బ్యాంక్‌ అధికారిక వెబ్‌సైట్‌లో అప్రెంటిస్‌ పోస్టుకు ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ సమర్పించాలి. దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్థులు రూ.500 చొప్పున చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. అప్లికేషన్‌ సమర్పించే ముందు విద్యార్హతలు, వయసు, స్థానిక భాష, కేటగిరీ తదితర అర్హతలను అభ్యర్థులు తప్పనిసరిగా పరిశీలించాలి.

ఇవి కూడా చదవండి

ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: అక్టోబర్ 17, 2026.
  • మొత్తం పోస్టులు: 3,500
  • అప్రెంటిస్‌షిప్‌ కాలం: 1 సంవత్సరం
  • నెలవారీ స్టైపెండ్‌: రూ.16,650

కెనరా బ్యాంకులో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
డిగ్రీ మార్కులతో కెనరా బ్యాంకులో 3,500 ఉద్యోగాలు..రాత పరీక్ష లేదు
డిగ్రీ మార్కులతో కెనరా బ్యాంకులో 3,500 ఉద్యోగాలు..రాత పరీక్ష లేదు
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. బుధవారం తులం ఎంతంటే..?
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. బుధవారం తులం ఎంతంటే..?
25 ఏళ్ల మోదీ పాలన.. భారత్ తలరాతను మార్చిన సంస్కరణలు
25 ఏళ్ల మోదీ పాలన.. భారత్ తలరాతను మార్చిన సంస్కరణలు
AP ECET 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్.. అక్టోబర్ 7 నుంచి దరఖాస్తులు
AP ECET 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్.. అక్టోబర్ 7 నుంచి దరఖాస్తులు
4 ఏళ్ల తర్వాత టీమిండియాలోకి భువీ రీఎంట్రీ..!
4 ఏళ్ల తర్వాత టీమిండియాలోకి భువీ రీఎంట్రీ..!
బర్నింగ్‌ ఇష్యూపై కమర్షియల్‌ కోర్ట్‌రూమ్‌ డ్రామా 'డ్యూ డేట్‌'
బర్నింగ్‌ ఇష్యూపై కమర్షియల్‌ కోర్ట్‌రూమ్‌ డ్రామా 'డ్యూ డేట్‌'
బెంగళూరు నుంచి దుబాయ్ వరకు..ఓ అమ్మాయి జీవితాన్ని మార్చిన 3 నగరాలు
బెంగళూరు నుంచి దుబాయ్ వరకు..ఓ అమ్మాయి జీవితాన్ని మార్చిన 3 నగరాలు
దిన ఫలాలు: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో గుడ్‌న్యూస్
దిన ఫలాలు: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో గుడ్‌న్యూస్
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..