Telangana Elections: మాజీ ప్రధాని రికార్డును అధిగమిస్తూ.. సరికొత్త చరిత్రకు నాంది పలికిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు
తెలంగాణలో మంథని నియోజకవర్గానికి ఒక ప్రాముఖ్యత ఉంది. ఇక్కడి నుంచి పీవీ నరసింహరావు అనేక పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి ఆ తరువాత కొన్నేళ్లకు దేశ ప్రధాని అయ్యారు. మనకు తెలుగు ప్రధానులు అరుదుగా ఉంటారు. ఈయన అంతటి అత్యున్నతమైన శిఖరాన్ని అధిరోహించారు కాబట్టే నేటికీ పీవీ నరసింహరావు పేరును గుర్తుపెట్టుకున్నాం. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇదే నియోజకవర్గంలో మాజీ పౌర సరఫరాల శాఖ మంత్రిగా చేసిన శ్రీధర్ బాబు మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు.

మంథని నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి పీవీ నరసింహరావు. ఈయన 1957, 1962, 1967, 1972 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత ఎన్టీఆర్ హయాంలో కాంగ్రెస్ తరఫున ఎంపీగా గెలిచి భారత దేశానికి తొలి తెలుగు ప్రధాని అయ్యారు. ఇక సీన్ కట్ చేస్తే అంతటి ప్రాభవం ఉన్న మంథని నియోజకవర్గంలో పీవీ నరసింహరావు రికార్డును మాజీ మంత్రి శ్రీధర్ బాబు అధిగమించారు. ఈ నియోజకవర్గంలో మాజీ ప్రధాని వరుసగా నాలుగు సార్లు గెలిస్తే.. శ్రీధర్ బాబు మాత్రం ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డును బ్రేక్ చేశారు. 1999 లో ప్రారంభమైన ఈయన ప్రస్థానం 2004, 2009, 2018, 2023లో పోటీ చేసి గెలుస్తూ వచ్చారు. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఈ నియోజకవర్గంలో శ్రీధర్ బాబు ఎమ్మెల్యేగా గెలిచి సరికొత్త చరిత్రకు నాంది పలికారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..