Telangana Election Results 2023: ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థులను ఒంటిచేతితో ఓడగొట్టిన వెంకట రమణారెడ్డి
తెలంగాణ 119 నియోజకవర్గాల్లో అన్నీ దేనికదే హాట్. కానీ.. హాట్ అండ్ హాటెస్ట్ సెగ్మెంట్లు మాత్రం ఆ మూడే. గజ్వేల్, కామారెడ్డి, హుజూరాబాద్. ఈ మూడు సీట్ల మీదే ఇన్నాళ్లూ మేజర్ ఫోకస్ నడిచింది. కారణం.. ఆ మూడుచోట్లా ముఖ్యమంత్రి అభ్యర్థులు బరిలో నిలవడం. ఈ ట్రయాంగిల్ రెవెంజ్ స్టోరీలో ఎవరు విన్నర్లు.. ఎవరు లూజర్లు.. అనే ఉత్కంఠకు నాటకీయ ముగింపునిచ్చాడు ఓటరు మహాశయుడు.
తెలంగాణ 119 నియోజకవర్గాల్లో అన్నీ దేనికదే హాట్. కానీ.. హాట్ అండ్ హాటెస్ట్ సెగ్మెంట్లు మాత్రం ఆ మూడే. గజ్వేల్, కామారెడ్డి, హుజూరాబాద్. ఈ మూడు సీట్ల మీదే ఇన్నాళ్లూ మేజర్ ఫోకస్ నడిచింది. కారణం.. ఆ మూడుచోట్లా ముఖ్యమంత్రి అభ్యర్థులు బరిలో నిలవడం. ఈ ట్రయాంగిల్ రెవెంజ్ స్టోరీలో ఎవరు విన్నర్లు.. ఎవరు లూజర్లు.. అనే ఉత్కంఠకు నాటకీయ ముగింపునిచ్చాడు ఓటరు మహాశయుడు.
కామారెడ్డిలో BJP అభ్యర్థి వెంకట రమణారెడ్డి. తెలంగాణ దంగల్‌లో అసలైన జెయింట్ కిల్లర్ అంటే ఇతడే. రెండు ప్రధాన పార్టీలకు చెందిన ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థులను ఒంటిచేతితో ఓడగొట్టిన వెంకట రమణారెడ్డి. హీరో ఆఫ్ ది డే అని చెప్పుకోవచ్చు.
నా సెకండ్ స్టాప్ కామారెడ్డి అంటూ.. కేసీఆర్ బీఆర్ఎస్ తరుఫున రెండో నామినేషన్ వేయడం.. కేసీఆర్‌ని ఓడగొట్టి తీరతా అంటూ.. కొడంగల్ నుంచి వచ్చి కామారెడ్డిలో కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి రెండో నామినేషన్ వేయడం.. వీళ్లిద్దరినీ కాదని భారతీయ జనతా పార్టీ అభ్యర్థి వెంకట రమణారెడ్డికి కామారెడ్డి ఓటరు కిరీటం పెట్టడం.. ఇంత కంటే డ్రమటిక్ టర్న్ ఇంకేముంటుంది? కామారెడ్డిలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్‌పై ఆరు వేలకు పైగా ఓట్లతో గెలిచారు వెంకట రమణారెడ్డి. మూడో స్థానానికి పరిమితం అయ్యారు రేవంత్‌రెడ్డి. కామారెడ్డి మాస్టర్‌ప్లాన్ కోసం పోరాడాటం, ఓటర్లు స్థానికతను సీరియస్‌గా తీసుకోవడం, ఇవే వెంకట రమణారెడ్డికే కలిసొచ్చిన అంశాలు.
అటు, 2014, 2018లో రెండుసార్లు తనకు పట్టం కట్టిన గజ్వేల్‌లో మరోసారి నిలబడ్డారు గులాబీ దళపతి కేసీఆర్. సీఎంగా హ్యాట్రిక్ ఛాన్స్ మిస్సయినా ఎమ్మెల్యేగా మాత్రం హ్యాట్రిక్ ఇచ్చి కేసీఆర్‌కి జిందాబాద్ కొట్టారు గజ్వేల్ ఓటర్లు. కాకపోతే, గతంలో కంటే కేసీఆర్‌కి 13 వేల మెజారిటీ తగ్గింది. రెండుసార్లు కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన వంటేరు ప్రతాప్‌రెడ్డి, తర్వాత బీఆర్‌ఎస్ గూటికే చేరుకోవడంతో గజ్వేల్‌లో కేసీఆర్‌కి తిరుగు లేదనుకున్నారు. కానీ.. కేసీఆర్‌ని ఛాలెంజ్ చేస్తూ.. బీజేపీ అభ్యర్థిగా ఈటెల రాజేందర్ నామినేషన్ వేయడంతో గజ్వేల్ ఒక్కసారిగా హీటెక్కింది.
గజ్వేల్ ఓటరు మాత్రం కేసీఆర్ వైపే నిలబడ్డారు. ఈటెలపై 45 వేల 031 ఓట్ల తేడాతో నెగ్గారు కేసీఆర్. గజ్వేల్‌లో కేసీఆర్‌ని వేటాడిన ఈటల.. తన సొంత నియోజకవర్గం హుజూరాబాద్‌ని కూడా విడిచిపెట్టలేదు. రెండు పడవల మీదా కాళ్లు పెట్టి జోడు గుర్రాల సవారీ చెయ్యబోయిన ఈటెల.. రెండు చోట్లా ఓటమి పాలయ్యారు. ఉపఎన్నికలో హుజూరాబాద్ ఓటరును విజయవంతంగా ప్రసన్నం చేసుకున్న ఈటెల.. ఈసారి మాత్రం తిరస్కారానికి గురయ్యారు. గులాబీ పార్టీ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి చేతిలో 16 వేల 873 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు ఈటెల రాజేందర్. రెండుచోట్ల ఓడిపోయి ఈటెల డీలాపడ్డారు. ఇదొక నాటకీయ పరిణామం. ఇదీ… మూడు నియోజకవర్గాల్లో ఆసక్తికరంగా సాగిన ట్రయాంగిల్ రెవెంజ్ స్టోరీ.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్ :