Telangana: తెలంగాణ ఎన్నికల్లో భారీ మెజార్టీ ఈయనదే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సరికొత్త రికార్డు..

తెలంగాణలోనే అత్యధిక మెజార్టీ సాధించిన అభ్యర్థిగా నిలిచారు కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి కె.పి.వివేకానంద. సమీప అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్‌పై 85 వేల 576 ఓట్ల మెజార్టీ సాధించారు. మొత్తంగా లక్షా 87 వేల 999 ఓట్లు సాధించారు వివేక. తర్వాతి స్థానంలో నిలిచిన కూన శ్రీశైలం గౌడ్‌కు లక్షా 2 వేల 423 ఓట్లు పోలవ్వగా..

Telangana: తెలంగాణ ఎన్నికల్లో భారీ మెజార్టీ ఈయనదే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సరికొత్త రికార్డు..
Kp Vivekanand
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 04, 2023 | 7:16 AM

తెలంగాణలోనే అత్యధిక మెజార్టీ సాధించిన అభ్యర్థిగా నిలిచారు కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి కె.పి.వివేకానంద. సమీప అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్‌పై 85 వేల 576 ఓట్ల మెజార్టీ సాధించారు. మొత్తంగా లక్షా 87 వేల 999 ఓట్లు సాధించారు వివేక. తర్వాతి స్థానంలో నిలిచిన కూన శ్రీశైలం గౌడ్‌కు లక్షా 2 వేల 423 ఓట్లు పోలవ్వగా.. లక్షా 15 వందల 54 ఓట్లు సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి కొలను హన్మంత రెడ్డి మూడో స్థానానికి పరిమితమయ్యారు. నియోజకవర్గంలో మొత్తం 6,99,783 ఓట్లు ఉండగా 4,01,667 ఓట్లు పోలయ్యాయి.

వాస్తవానికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అసలు బీఆర్ఎస్ విజయం కష్టమనే భావన కొన్ని నెలల కిందట ప్రజల్లో ఉండేది. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద మధ్య కొద్దికాలం ఆగదాం ఏర్పడడంతో పార్టీ గెలుపు నియోజకవర్గంలో కష్టమనే భావన ఏర్పడింది. అయితే అధిష్టానం ఆదేశాలతో ఎమ్మెల్సీ, కార్పొరేటర్‌లు ఏకతాటిపైకి వచ్చి బీఆర్ఎస్ విజయానికి కృషి చేశారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కలయికతో గులాబీ క్యాడర్ మరింత జోష్ గా పని చేసి కేపీ వివేకానందకు భారీ విజయం అందించేందుకు శ్రమించారు.

ఇంతటీ మెజార్టీ వివేక ఎలా సాధించారు? దీని వెనుకున్న సక్సెస్ ఫార్మూలా ఏంటి? అంటే ఆయన చేసిన మంచి పనులే అంటున్నారు నియోజకవర్గ ప్రజలు. నిత్యం ప్రజలందరికి అందుబాటులో ఉంటూ, ఏ పార్టీ కార్యకర్త పని మీద తన దగ్గరకు వచ్చినా కాదనకుండా పనులు చేశారనే నమ్మకం ఇక్కడి ప్రజలలో నెలకొంది. సౌమ్యుడిగా ఉంటూ అన్ని వర్గాలు, మతాల ప్రజలకు బేదాభిప్రాయాలు లేకుండా ఎమ్మెల్యేగా తన పనితనాన్ని ప్రదర్శించడం వివేకానందగౌడ్‌ కలిసి వచ్చిందని చెప్పవచ్చు. బీజేపీ, కాంగ్రెస్‌కు చెందిన కొందరు నేతలు తమ తమ అభ్యర్థుల పట్ల ఉన్న వ్యతిరేకతతో బీఆర్ఎస్ అభ్యర్థి వివేకానంద గెలుపు కోసం అంతర్గతంగా సహకరించారన్న చర్చ సాగుతోంది.

వాస్తవానికి మెజార్టీకి మారుపేరు హరీష్ రావు. కాని ఈసారి ఆయన 82 వేల మెజార్టీ సాధిస్తే.. 85 వేల మెజార్టీ వివేకా సొంతమైంది. మరోవైపు కుత్బుల్లాపూర్ మొట్ట మొదటి స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలిచి చరిత్ర సృష్టించిన కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్‌ను వీడి బీజేపీ నుంచి పోటీ చేయడం కలిసి రాలేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.