Throwback Photo : ఈ ఫోటోలో ఉన్న సెలబ్రెటీ ఎవరో గుర్తుపట్టారా.?ఇప్పుడు ఎక్కడ చూసిన ఆయన పేరే
తాజాగా ఓ సెలబ్రేటీకు సంబంధించిన ఓల్డ్ ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఇంతకు పై ఫొటోలో ఉన్న సెలబ్రెటీ ఎవరో గుర్తుపట్టారా.. ఇప్పుడు ఎక్కడ చూసిన ఆయన పేరే వినిపిస్తుంది. ఇంతకు ఆయన ఎవరో గుర్తుపట్టారా.. ? పెద్ద కష్టమేమి కాదు అనుకుంట ఆయన ఎవరో కనిపెట్టడం.. ఇంతకు పై ఫొటోలో ఉన్న సెలబ్రెటీ ఎవరో కాదు.

సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రెటీల ఓల్డ్ ఫోటోలు తెగ వైరల్ అవుతూ ఉంటాయి. ఒక్కసారి పాపులర్ అయితే చాలు సోషల్ మీడియాలో ఆ సెలబ్రెటీలకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు కూడా చక్కర్లు కొడుతూ ఉంటాయి. తాజాగా ఓ సెలబ్రేటీకు సంబంధించిన ఓల్డ్ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకు పై ఫొటోలో ఉన్న సెలబ్రెటీ ఎవరో గుర్తుపట్టారా..? ఇప్పుడు ఎక్కడ చూసిన ఆయన పేరే వినిపిస్తుంది. ఇంతకు ఆయన ఎవరో గుర్తుపట్టారా..?ఆయన ఎవరో కనిపెట్టడం..పెద్ద కష్టమేమి కాదు అనుకుంట. ఆయన సినిమాలకు సంబంధించిన సెలబ్రెటీ కాదు. ప్రముఖ రాజకీయనాయకుడు.ఇంతకు పై ఫొటోలో ఉన్న సెలబ్రెటీ ఎవరో కాదు..
పై ఫొటోలో ఉన్నది మరెవరో కాదు ఆయనే రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి.. అంతే కాదు కాబోయే సీఎం కూడా.. తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి మూడు దశాబ్దాల క్రితం జాగృతి అనే వార పత్రికలో పని చేస్తున్న సమయంలోనిది ఈ చిత్రం..
ఎనుముల రేవంత్ రెడ్డి నిన్నటి వరకు.. తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుండి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీచేసి విజయం సాధించారు. 2014లో ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచారు. రేవంత్‌రెడ్డి 2014–17 మధ్య టీడీఎల్పీ ఫ్లోర్ లీడర్‌గా కూడా పనిచేశారు. 2017 అక్టోబరులో టిడిపికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆతర్వాత 2018లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. 2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019 మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. రేవంత్ రెడ్డిని తెలంగాణ పీసీసీ అధ్యక్ష్యుడిగా 2021 జూన్ 26లో జాతీయ కాంగ్రెస్ పార్టీ నియమించింది. తాజాగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. అలాగే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కానున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలకు తోడు… ఏడో గ్యారెంటీగా ప్రజాస్వామ్యబద్దమైన పాలన అందిస్తామని హామీ ఇచ్చింది.
ఆ మాటకు కట్టుబడి ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో రాజీ పడబోమని ప్రజలకు మరోసారి మాట ఇస్తున్నాం.
ప్రతిపక్ష పార్టీలను కూడా సమన్వయం చేసుకుని అభివృద్ధిలో రాష్ట్రాన్ని… pic.twitter.com/dPal9EFbXM
— Revanth Reddy (@revanth_anumula) December 3, 2023
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




