Telangana: గ్రేటర్‌లో బీఆర్‌ఎస్ జోరు.. కారు గుర్తుకే తమ ఓటు అన్న సీమాంధ్రులు

తెలంగాణ దంగల్‌లో సీమాంధ్ర ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపారు. మరీ ముఖ్యంగా గ్రేటర్‌ ప్రాంతంలో సీమాంధ్రులు ఎక్కువగా ఉన్నచోట ఎవరికి పట్టం కట్టారు. గతంలో లాగే బీఆర్‌ఎస్‌ను బలపర్చారా లేక ఈసారి చెయ్యెత్తి జై కొట్టారా? డీటేల్స్ చూద్దాం పదండి....

Telangana: గ్రేటర్‌లో బీఆర్‌ఎస్ జోరు.. కారు గుర్తుకే తమ ఓటు అన్న సీమాంధ్రులు
BRS
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 03, 2023 | 10:10 PM

తెలంగాణలోని పలు నియోజవర్గాల్లో సీమాంధ్రకు చెందిన ఓటర్లు బలమైన ప్రభావం చూపిస్తారు. ఖమ్మం, నిజామాబాద్‌ జిల్లాల్లోనే కాకుండా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని పలు నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను సీమాంధ్ర ఓటర్లు శాసిస్తారు. గ్రేటర్‌ పరిధిలోని శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌, ఎల్బీ నగర్‌, రాజేంద్ర నగర్‌, జూబ్లీహిల్స్‌, ఖైరతాబాద్‌, సికింద్రాబాద్‌, మల్కాజ్‌గిరి, ఉప్పల్‌ అసెంబ్లీ నియోజకవర్గాల్లో సీమాంధ్రులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు పెద్దఎత్తున మద్దతు ఇచ్చారు సీమాంధ్ర ఓటర్లు.

ఈసారి తెలంగాణ దంగల్‌లో సీమాంధ్ర ఓటర్లు…గులాబీ పార్టీకి మద్దతు ఇచ్చారా లేక చెయ్యెత్తి కాంగ్రెస్‌కు జై కొట్టారా అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే తాజా ఫలితాలతో ఆ ఉత్కంఠ వీడింది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో అత్యధిక స్థానాలు బీఆర్‌ఎస్‌ సాధించడంతో సీమాంధ్ర ఓటర్లు కారు గుర్తుకే తమ ఓటు వేశారంటున్నారు విశ్లేషకులు. శేరిలింగంపల్లిలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి అరికెపూడి గాంధీ భారీ విజయం సాధించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి జగదీశ్వర్‌ గౌడ్‌పై ఆయన గెలుపొందారు. ఇక కూకట్‌పల్లి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాధవరం కృష్ణారావు…కాంగ్రెస్‌ అభ్యర్థి బండి రమేష్‌పై గెలుపొందారు. ఇక కుత్బుల్లాపూర్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వివేకానంద… బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ మీద గెలిచారు.

ఎల్బీ నగర్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుధీర్‌రెడ్డి విజయం సాధించారు. రాజేంద్ర నగర్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ప్రకాష్‌ గౌడ్‌…బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డిపై విజయం సాధించారు. ఖైరతాబాద్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి దానం నాగేందర్‌ విజయం సాధించారు. సికింద్రాబాద్‌ అసెంబ్లీ స్థానంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పద్మారావు విజయం సాధించారు. మల్కాజ్‌గిరిలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌ రెడ్డి భారీ విజయం సాధించారు. ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థిపై భారీ తేడాతో విజయం సాధించారు. ఇక గ్రేటర్‌ పరిధిలోని సనత్‌నగర్‌లో కూడా బీఆర్‌ఎస్‌ అభ్యర్థి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ విజయం సాధించారు. సీమాంధ్రకు చెందిన ఓటర్లు…తమకు బీఆర్‌ఎస్‌పై నమ్మకం చెక్కుచెదరలేదని మరోసారి నిరూపించారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్ :

తెలంగాణ పోలింగ్ ఫలితాల లైవ్ కౌంటింగ్ అప్‌డేట్స్ :

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పార్టీల ఫలితాలు లైవ్ :