AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్‎ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలి.. మాజీమంత్రి డిమాండ్..

ఆంధ్రప్రదేశ్‌తో తెలంగాణకు ఉన్న ఉమ్మడి రాజధాని బంధం నేటితో ముగియునున్న సందర్భంలో మాజీ పీసీసీ చీఫ్ డా సాకే శైలజానాథ్ విచారం వ్యక్తం చేస్తూ హైదరాబాద్‎ను ఉమ్మడి రాజధానిగా మరో 10 సంవత్సరాలు పొడిగించాలని డిమాండ్ చేశారు. జూన్‌ 2న తెలంగాణ స్వరాష్ట్రంగా ఆవిర్భవించిన విషయం తెలిసిందే. రాష్ట్రం విభజన సమయంలో ఇచ్చిన హామీలు పరిష్కరింపబడకుండానే శాశ్వత ముగింపు పడిందని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో హైదరాబాద్‌ను తెలంగాణకు శాశ్వత రాజధానిగా, ఏపీ రాష్ర్టానికి పదేండ్ల పాటు తాత్కాలిక, ఉమ్మడి రాజధానిగా కేంద్రం ప్రకటించిందని ఆయన తెలియజేశారు.

హైదరాబాద్‎ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలి.. మాజీమంత్రి డిమాండ్..
Hyderabad
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Jun 02, 2024 | 4:42 PM

Share

ఆంధ్రప్రదేశ్‌తో తెలంగాణకు ఉన్న ఉమ్మడి రాజధాని బంధం నేటితో ముగియునున్న సందర్భంలో మాజీ పీసీసీ చీఫ్ డా సాకే శైలజానాథ్ విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్‎ను ఉమ్మడి రాజధానిగా మరో 10 సంవత్సరాలు పొడిగించాలని డిమాండ్ చేశారు. జూన్‌ 2న తెలంగాణ స్వరాష్ట్రంగా ఆవిర్భవించిన విషయం తెలిసిందే. రాష్ట్రం విభజన సమయంలో ఇచ్చిన హామీలు పరిష్కరింపబడకుండానే శాశ్వత ముగింపు పడిందని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో హైదరాబాద్‌ను తెలంగాణకు శాశ్వత రాజధానిగా, ఏపీ రాష్ట్రానికి పదేండ్ల పాటు తాత్కాలిక, ఉమ్మడి రాజధానిగా కేంద్రం ప్రకటించిందని ఆయన తెలియజేశారు.

విభజన చట్టం సెక్షన్‌-8 ప్రకారం హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని ప్రాంతంలో పౌరుల రక్షణ బాధ్యతను గవర్నర్‌కు అప్పగించారన్నారు. ఉమ్మడి రాజధానిలో నివసించే ప్రజల ప్రాణ, ఆస్తి, రక్షణ భద్రతలను కాపాడే బాధ్యతలను గవర్నర్‌ చేతిలో ఉంటాయన్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుండి చాలా మంది ప్రజలు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తాత్కాలిక నివాసం ఏర్పరుచుకున్నాట్లు వివరించారు. మరి రేపటినుండి ఈ ప్రజల, ఆస్తులు రక్షణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం ఏమేరకు బాధ్యత తీసుకుంటుందని శైలజానాథ్ ప్రశ్నించారు. సెక్షన్‌-95 ప్రకారం విద్యార్థులకు పదేండ్ల పాటు ఉన్నత విద్యలో అవకాశాలు కల్పించాలన్నారు. ఆర్టికల్‌ -317 డీ ప్రకారం అడ్మిషన్ల కోటా పదేండ్ల వరకు కొనసాగించాలని, ఎమ్సెట్‌ సహా 7 రకాల ప్రవేశ పరీక్షల కూడా ఉమ్మడిగా నిర్వహించేవారని ఆయన గుర్తుచేశారు. ఇప్పటి వరకు ఆ పరీక్షల నోటిఫికేషన్లు జూన్‌ 2కు ముందే విడుదల అయిందని తెలిపారు. దీంతో ఉమ్మడి విద్యార్థి, విద్యార్థినిలకు అవకాశం కలిగిందని శైలజానాథ్ తెలిపారు. ఈ ఒక్క విద్యా సంవత్సరం మాత్రమే ఏపీ విద్యార్థులకు తెలంగాణలో సీట్లు కేటాయిస్తారని, వచ్చే ఏడాది నుండి విద్యార్థుల భవిష్యత్తు అయోమయంలో పడిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

10 ఏళ్లలో అనేక సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయన్నారు. ముఖ్యంగా కృష్ణా, గోదావరి జలాల పంపిణీ గుదిబండగా మారిందని, అపెక్స్‌ కమిటీలు, నదీ యాజమాన్య బోర్డుల మధ్యే నలుగుతున్నదని చెప్పారు. దీనిపై కేంద్రం ఎటూ తేల్చకపోవటంపై శైలజానాథ్ ఆగ్రహం వ్యక్త పరిచారు. రాష్ట్ర విభజన చట్టం తొమ్మిదో షెడ్యూల్‌లోని ప్రభుత్వ సంస్థలు, పదో షెడ్యూల్‌లోని సంస్థల విభజన తేలలేదన్నారు.  68 సంస్థల విభజనకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలంగాణ తెలిపినప్పటికీ ఏపీ ప్రభుత్వం ముందుకురాకపోవటంతో వీటి విభజన పూర్తికాలేదని తెలిపారు. ఆస్తుల పంపిణీ వివాదాలు, ప్రభుత్వ కార్యాలయాల స్వాధీనం ఇంకా జరగలేకపోవటం సిగ్గుచేటని చింతించారు. స్థానికత ఆధారంగా ఉద్యోగులను కేటాయించాలని ఉద్యోగసంఘాలు కోరినా ఇప్పటి వరకు ఇరు ప్రభుత్వాలు దానిపై దృష్టి పెట్టకపోవటం దురదృష్టకరమని స్పందించారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీలను గాలికొదిలేశారని దుయ్యబట్టారు. ఇన్ని సమస్యలు పరిష్కారం కాకుండానే హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కోల్పోవడంతో ఆంధ్రప్రదేశ్‎కు భవిష్యత్తులో అనే కష్టాలు అలుముకుంటాయన్నారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కుంటారని ఆయన తెలిపారు. ఏపీ రాజధానిని నిర్మించుకునే వరకూ హైదరాబాద్‎ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. అందుకోసం 2014 పునర్విభజన చట్టాన్ని సవరించాలని శైలజానాథ్ పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..