Andhra Pradesh: మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబూ.. ఈ సీన్ చూస్తే స్టన్ అవ్వాల్సిందే.. సాయం చేస్తారనుకుంటే..

కోడి గుడ్ల లోడుతో ఓ మీని లారీ వెళ్తోంది.. ఈ క్రమంలో అదుపుతప్పి రోడ్డు పక్కన కిందపడింది.. కోడి గుడ్ల ట్రైలన్నీ చెల్లాచెదురుగా పడ్డాయి.. డ్రైవర్, క్లీనర్ ప్రాణాలతో బయటపడ్డారు.. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు.. పరుగున అక్కడికి చేరుకున్నారు.. వారేదో సాయం చేస్తారని అనుకున్నారు..

Andhra Pradesh: మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబూ.. ఈ సీన్ చూస్తే స్టన్ అవ్వాల్సిందే.. సాయం చేస్తారనుకుంటే..
Looting Eggs
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 02, 2024 | 11:39 AM

కోడి గుడ్ల లోడుతో ఓ మీని లారీ వెళ్తోంది.. ఈ క్రమంలో అదుపుతప్పి రోడ్డు పక్కన కిందపడింది.. కోడి గుడ్ల ట్రైలన్నీ చెల్లాచెదురుగా పడ్డాయి.. డ్రైవర్, క్లీనర్ ప్రాణాలతో బయటపడ్డారు.. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు.. పరుగున అక్కడికి చేరుకున్నారు.. వారేదో సాయం చేస్తారని అనుకున్నారు.. కట్ చేస్తే.. ఒక్కసారిగా ఊహించని పరిణామం చోటుచేసుకుంది. వారంతా సాయం చేయడానికి వచ్చారనుకున్న లోపే.. కవర్లు.. బకెట్లు.. బస్తాలు దర్శనమిచ్చాయి.. వచ్చిన వారంతా కోడిగుడ్లను ఎత్తుకెళ్లేందుకు ఎగబడ్డారు. ఏకంగా బకెట్లు, పెద్ద, పెద్ద సంచుల్లో వేసుకుని పగలని గుడ్లు ఏరుకున్నారు.. లారీ లోపలికి వెళ్లి మరి పగలని కోడిగుడ్లను ఏరుకున్నారు.

Egss

ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది. తాడిపత్రి – నంద్యాల్ హైవేవై.. గోస్పాడు మండలం కానాల పల్లె వద్ద ప్రమాదవశాత్తు అదుపుతప్పి కోడిగుడ్లతో లోడుతో వెళ్తున్న మినీ లారీ ఆదివారం బోల్తా పడింది. దీంతో గ్రామస్థులు అక్కడికి చేరుకుని కోడిగుడ్ల కోసం ఎగబడ్డారు.. బకెట్లు, సంచులు, కవర్లు తెచ్చుకుని.. పగలని గుడ్లను వెతికి మరి ఎత్తుకెళ్లారు. గ్రామస్థులు తీరుతో విసుగు చెందిన లారీ డ్రైవర్, క్లినర్.. ఏం చేయలేక చేతులెత్తేశారు..

వీడియో చూడండి..

సాయం చేస్తారనుకున్న జనం.. కోడి గుడ్ల కోసం ఇలా చేయడం బాలేదంటూ మొత్తుకున్నా ఫలితం లేకుండా పోయిందని లారీ డ్రైవర్, క్లీనర్ పేర్కొన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..