AP Exit Polls: ఏపీలో ఓడిపోయే మంత్రులు వీరే.. ఆరా మస్తాన్ సర్వేలో సంచలన విషయాలు

ఏపీలో మళ్లీ జై జగన్‌ అంటున్నాయి చాలా ఎగ్జిట్‌ పోల్స్‌. ఫ్యాన్‌ గాలి వీస్తుందంటున్నాయి. మళ్లీ జగనే సీఎం అంటున్నాయి ఎక్కువ సర్వేలు. వైసీపీ రెండోసారి అధికారంలోకి వస్తుందని చాలా ఎగ్జిట్‌ పోల్స్‌ చెబుతున్నాయి. అయితే కొన్ని సర్వేలు కూటమికి కూడా చాన్స్‌ ఉందంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఏయే సంస్థలు ఎలాంటి ఎగ్జిట్‌ పోల్స్‌ ఇచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం...

AP Exit Polls: ఏపీలో ఓడిపోయే మంత్రులు వీరే.. ఆరా మస్తాన్ సర్వేలో సంచలన విషయాలు
AARA Mastan Survey
Follow us

|

Updated on: Jun 01, 2024 | 9:53 PM

ఏపీలో వైసీపీ వర్సెస్‌ టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి మధ్య హోరాహోరీగా ఎన్నికల యుద్ధం జరిగింది. అయితే మళ్లీ జగన్‌ సీఎం అవుతున్నారంటున్నాయి ఎక్కువ శాతం ఎగ్జిట్‌ పోల్స్‌. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎక్కువ శాతం ఎగ్జిట్ పోల్స్‌…వైసీపీకే పట్టం కట్టాయి.

పార్థా దాస్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం వైసీపీకి 110-120, టీడీపీ కూటమికి 55-65 అసెంబ్లీ సీట్లు వస్తాయి. ఇక సీపీఎస్‌ అంచనాల ప్రకారం వైసీకి 97 నుంచి 108 అసెంబ్లీ సీట్లు వస్తాయి. కాంగ్రెస్‌కు 0 నుంచి ఒక్క అసెంబ్లీ సీటు వచ్చే అవకాశం ఉంది. ఇక పొలిటికల్‌ లాబొరేటరీ ఎగ్జిట్ పోల్ ప్రకారం వైసీపీకి 108 సీట్లు వస్తాయి. కూటమికి 67 అసెంబ్లీ సీట్లు వస్తాయి. ఆత్మసాక్షి ఎగ్జిట్‌ పోల్స్‌లో వైసీపీ 98 నుంచి 116 అసెంబ్లీ సీట్లు సాధిస్తుంది. ఇక కూటమికి 59 నుంచి 77 దాకా సీట్లు వచ్చే అవకాశం ఉంది. రాప్‌ స్ట్రాటజీస్‌ ఎగ్జిట్‌పోల్స్‌ ప్రకారం వైసీపీకి 158 అసెంబ్లీ సీట్లు వస్తాయి. టీడీపీ కూటమికి వాళ్లు కేవలం 4 సీట్లు ఇచ్చారు. ఇక 13 సీట్లలో కీన్‌ కంటెస్ట్‌ ఉందంటున్నారు. జన్‌మత్‌ అంచనాల ప్రకారం వైసీపీ 95-103 సీట్లు, టీడీపీ 67-75 సీట్లు సాధిస్తాయి. ఇక స్మార్ట్‌ పోల్ అంచనాల ప్రకారం వైసీపీకి 80 అసెంబ్లీ సీట్లు వస్తాయి. ప్లస్‌ ఆర్‌ మైనస్‌ 8 అని చెబుతున్నారు. ఇక కూటమికి 93 సీట్లు వస్తాయంటోంది ఆ సర్వే సంస్థ. అది కూడా ప్లస్‌ ఆర్‌ మైనస్‌ 8 అంటోంది. ఇక చాణక్య స్ట్రాటజీస్‌ ప్రకారం వైసీపీ 39-49 సీట్లు సాధిస్తే.. టీడీపీ 114-125 సీట్లు సాధిస్తుంది.

ఇక అందరు ఉత్కంఠగా ఎదురుచూసిన ఆరా మస్తాన్‌ సర్వే…వైసీపీకి పట్టం కట్టింది. ఆరా ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం వైసీపీకి 94 నుంచి 104 అసెంబ్లీ సీట్లు వస్తాయి. టీడీపీ కూటమికి 71 నుంచి 81 సీట్లు వస్తాయి. వైసీపీకి 49.41శాతం, కూటమికి 47.55 శాతం ఓటు శాతం వస్తుందని ఆరా పేర్కొంది. జగన్‌కు మహిళలు జై కొట్టారని, 56 శాతం మహిళలు ఫ్యాను గుర్తుకు ఓటేశారని ఆరా పేర్కొంది. కూటమికి 43 శాతం మహిళలు మద్దతిచ్చారని తెలిపింది. ఇక పురుషుల్లో వైసీపీ కంటే కూటమికి 6 శాతం ఎక్కువగా ఓట్లు వచ్చాయని తెలిపింది.

వాలంటీర్ల సేవలు, గ్రామ సచివాలయాలకు ప్రజలు డిస్టింక్షన్‌ మార్కులు వేశారని ఆరా సంస్థ పేర్కొంది. ఇంటి దగ్గరకే అన్ని సేవలు రావడం ప్రజలపై మంచి ప్రభావం చూపించింది. ఇక పెన్షన్ల పెంపు కూడా వైసీపీకి కలిసొచ్చిందని ఆ సంస్థ విశ్లేషించింది. ఏపీ సీఎం జగన్‌…పులివెందులలో భారీ మెజారిటీతో గెలుస్తారన్న ఆరా మస్తాన్‌….కొందరు మంత్రులు ఓడిపోతారన్నారు. మంత్రులు సీదిరి అప్పలరాజు, గుడివాడ అమర్నాథ్‌, కారుమూరి, చెల్లుబోయిన, కొట్టు సత్యనారాయణ, విడదల రజనీ, ఆదిమూలం సురేష్‌, ఉషశ్రీ చరణ్‌, ఆర్కే రోజా, స్పీకర్ తమ్మినేని ఓడిపోతారన్నారు. ఇక మంత్రులు ధర్మాన, జోగి రమేష్‌, అంబటి రాంబాబు గట్టి పోటీని ఎదుర్కొంటున్నారన్నారు. ఇక మంత్రులు అప్పన్న దొర, బొత్స, పినిపె విశ్వరూప్‌, దాడిశెట్టి రాజా, తానేటి వనిత, మేరుగ నాగార్జున, కాకాణి, ఆంజాద్‌ బాషా, పెద్దిరెడ్డి గెలుస్తారని సర్వే సంస్థ పేర్కొంది. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌, బాలకృష్ణ, లోకేష్‌ గెలుస్తారన్నారు ఆరా మస్తాన్‌.

ఇక ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు టెక్కలి నుంచి స్వల్ప మెజారిటీతో గెలుపొందుతారని సర్వే పేర్కొంది. గన్నవరం నుంచి వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ, ఉండి నుంచి టీడీపీ అభ్యర్థి రఘురామ కృష్ణరాజు గెలుపొందుతారని పేర్కొంది. అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన మంత్రి బూడి ముత్యాల నాయుడు ఓడిపోతారని పేర్కొంది.

మరిన్ని ఎన్నికల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.  

జాతి వైరం మరిచి స్నేహంగా ఉంటున్న మూగజీవులు !!
జాతి వైరం మరిచి స్నేహంగా ఉంటున్న మూగజీవులు !!
హైదరాబాద్- విజయవాడ ప్రయాణికులకు గుడ్ న్యూస్
హైదరాబాద్- విజయవాడ ప్రయాణికులకు గుడ్ న్యూస్
బీరుకు రూ.20-లిక్కర్‌కు రూ.70 వరకు.. మందు బాబులకు బ్యాడ్ న్యూస్ ?
బీరుకు రూ.20-లిక్కర్‌కు రూ.70 వరకు.. మందు బాబులకు బ్యాడ్ న్యూస్ ?
యాల‌కుల నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా ??
యాల‌కుల నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా ??
ప్రజా సంఘాలు, బీసీ నేతలతో రాహుల్‌ గాంధీ భేటీ.. లైవ్ వీడియో
ప్రజా సంఘాలు, బీసీ నేతలతో రాహుల్‌ గాంధీ భేటీ.. లైవ్ వీడియో
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..