AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: దశాబ్ధకాలంలో తెలంగాణ పోలీసు శాఖలో వచ్చిన మార్పులు..

తెలంగాణ రాష్ట్ర పదేళ్ల పాలనలో పోలీస్ శాఖ పటిష్టమైంది. వేలాదిమంది నూతన సిబ్బంది నియామకంతో పాటు సరికొత్త టెక్నాలజీ వినియోగంలోకి తీసుకొచ్చింది. రాష్ట్ర పోలీసులు మహిళా భద్రతకు ప్రాధాన్యమిస్తూ ముందుకెళ్తున్నారు. మహిళా భద్రతా విభాగం షీ టీమ్స్ ఏర్పాటు సహా అనేక మార్కులు వచ్చాయి. అదేవిధంగా ప్రస్తుతం పెరుగుతున్న నేరాల్లో ఒకటైన సైబర్ క్రైమ్, డ్రగ్స్ పట్టుబడటానికి ప్రత్యేక విభాగాలు ఏర్పాటయ్యాయి. హైదరాబాదుకు మణిహారంగా ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్ తెలంగాణ పోలీస్ ప్రతిష్టను మరింత పెంచింది.

Telangana: దశాబ్ధకాలంలో తెలంగాణ పోలీసు శాఖలో వచ్చిన మార్పులు..
Telangana Police
Peddaprolu Jyothi
| Edited By: |

Updated on: Jun 02, 2024 | 5:08 PM

Share

తెలంగాణ రాష్ట్ర పదేళ్ల పాలనలో పోలీస్ శాఖ పటిష్టమైంది. వేలాదిమంది నూతన సిబ్బంది నియామకంతో పాటు సరికొత్త టెక్నాలజీ వినియోగంలోకి తీసుకొచ్చింది. రాష్ట్ర పోలీసులు మహిళా భద్రతకు ప్రాధాన్యమిస్తూ ముందుకెళ్తున్నారు. మహిళా భద్రతా విభాగం షీ టీమ్స్ ఏర్పాటు సహా అనేక మార్కులు వచ్చాయి. అదేవిధంగా ప్రస్తుతం పెరుగుతున్న నేరాల్లో ఒకటైన సైబర్ క్రైమ్, డ్రగ్స్ పట్టుబడటానికి ప్రత్యేక విభాగాలు ఏర్పాటయ్యాయి. హైదరాబాదుకు మణిహారంగా ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్ తెలంగాణ పోలీస్ ప్రతిష్టను మరింత పెంచింది.

పోలీస్ శాఖను బలోపేతం చేసేలా ఇప్పటికే 27,000 మంది నూతన సిబ్బంది నియామకం పూర్తి చేసింది. ఇటీవల నోటిఫికేషన్‎లో భర్తీ అయిన 414 సివిల్ ఎస్సైలు, మరో 16,450 ఆరు పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తయి శిక్షణ కొనసాగుతోంది. ఈ నియామకాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేస్తుండడంతో మహిళా పోలీసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. పోలీసు సంక్షేమంలో భాగంగా ట్రాఫిక్ పోలీసులకు 30శాతం రిస్క్ అలవెన్సన్ కూడా వస్తున్నాయి. తెలంగాణ ఏర్పడకముందు నెలకు రూ.12,000 ఉన్న హోంగార్డులకు జీతాలు ఇప్పుడు రూ.20 వేలకు పెరిగాయి. ఇంక్రిమెంట్ ప్రకటనతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 18,491 మంది హోంగార్డుల కుటుంబాలకు లబ్ధి చేకురుతోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఏర్పాటు చేసినటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్‎ను రూ.600 కోట్లతో నిర్మించారు. ఇది మొత్తం 19 అంతస్తుల్లో ఏర్పాటు చేశారు. 2022 నుంచి ఈ భవనం అందుబాటులోకి వచ్చింది. పోలీసులు రోజువారీ విధుల్లో ఎక్కువగా టెక్నాలజీని ఉపయోగిస్తూనే ఉన్నారు. 56 రకాల సర్వీసులతో రాష్ట్రస్థాయిలో టీఎస్ కాప్ యాప్‎ను తీసుకొచ్చింది. మరోవైపు మహిళా భద్రత కోసం తొలుత 2014 అక్టోబర్ 24న షీ టీమ్స్ ఏర్పాటు చేశారు. తర్వాత మహిళా భద్రత కోసం రాష్ట్రస్థాయిలో ఉమెన్ సేఫ్టీ ఏర్పాటు చేశారు. డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలను అరికట్టడానికి తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో, సైబర్ నేరాల నియంత్రణకు సైబర్ సెక్యూరిటీ బ్యూరోలను కూడా ఏర్పాటు చేశారు. ఇలా దశాబ్దకాలంలో పోలీస్ శాఖ ఎంతో పటిష్టంగా మారింది.