Telangana: డల్లాస్‎లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.. పాల్గొన్న మాజీ మంత్రి..

Telangana: డల్లాస్‎లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.. పాల్గొన్న మాజీ మంత్రి..

Srikar T

|

Updated on: Jun 02, 2024 | 3:28 PM

అమెరికాలోని డల్లాస్‎లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో మాజీ మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ ఆవిర్భావానికి కారణం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. డల్లాస్ లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి మల్లారెడ్డి తెలంగాణ అభివృద్దిని ప్రశంసించారు. కేసీఆర్ తన ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చేందుకు కృషి చేశారని కొనియాడారు. రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుంచి పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగి తెలంగాణను దేశంలోనే నంబర్ 1 స్థానంలోకి తీసుకొచ్చారన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ ఇప్పుడు ఆదర్శంగా నిలిచిందన్నారు.

అమెరికాలోని డల్లాస్‎లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో మాజీ మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ ఆవిర్భావానికి కారణం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. డల్లాస్ లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి మల్లారెడ్డి తెలంగాణ అభివృద్దిని ప్రశంసించారు. కేసీఆర్ తన ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చేందుకు కృషి చేశారని కొనియాడారు. రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుంచి పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగి తెలంగాణను దేశంలోనే నంబర్ 1 స్థానంలోకి తీసుకొచ్చారన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ ఇప్పుడు ఆదర్శంగా నిలిచిందన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తాగు, సాగు నీటికి ఢోకాలేకుండా అనేక ప్రాజెక్టులను నిర్మించారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి గ్రామంలో క్రీడా మైదానం, డంపింగ్ యార్డ్, డ్రైనేజీ సిస్టం మెరుగు పరిచారన్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిర్మించిన ఘనత కేసీఆర్‎దే అన్నారు. ఇలా విదేశాల్లో కూడా తెలంగాణ యువతీ, యువకులతో కలిసి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకోవడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..