Telangana Formation Day: తెలంగాణ అధికారిక గీతాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్‌ రెడ్డి.. అట్టహాసంగా దశాబ్ది ఉత్సవాలు..

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు.. అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని.. సీఎం రేవంత్ రెడ్డి అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. అనంతరం పరేడ్‌గ్రౌండ్స్‌లో జరిగే వేడుకలకు హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు.

|

Updated on: Jun 02, 2024 | 12:21 PM

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు.. అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని.. సీఎం రేవంత్ రెడ్డి అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. అనంతరం పరేడ్‌గ్రౌండ్స్‌లో జరిగే వేడుకలకు హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర అధికారిక గీతాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పదేళ్లలో తెలంగాణ వందేళ్ల విధ్వంసానికి గురైందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తమ ప్రభుత్వం వచ్చాక పాలనను గాడిలో పెట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. రాష్ట్రం 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉందన్న సీఎం.. తెలంగాణ అభివృద్ధి కోసం గ్రీన్ తెలంగాణ 2050 మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామన్నారు. బిడ్డ ఇంట్లో శుభకార్యానికి రావడానికి సోనియాకు హోదా అవసరమా అని ప్రశ్నించారు సీఎం. డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతామన్న రేవంత్ రెడ్డి.. మూసీ సుందరీకరణ పథకం ద్వారా పరివాహక ప్రాంతాన్ని ఉపాధి కల్పన జోన్‌గా తీర్చిదిద్దబోతున్నామన్నారు. తెలంగాణ అవిర్భావ దినోత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జాతీయ జెండా ఎగురవేసిన సీఎం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

వీడియో చూడండి..

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు.. రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. సరిగ్గా 8 గంటలకు శాసనమండలి ఆవరణలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.. జాతీయ జెండా ఎగరవేశారు. 8గంటల 45 నిమిషాలకు అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ జెండా ఆవిష్కరించారు. అంతకన్నా ముందు గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మండలి చైర్మన్ గుత్తాసుఖేందర్‌రెడ్డితో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు.

రాజ్‌భవన్‌లోనూ దశాబ్ది వేడుకలు అట్టహాసంగా సాగాయి. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం గవర్నర్ రాధాకృష్ణన్.. జాతీయ జెండా ఆవిష్కరించారు. ఇక గాంధీభవన్‌లో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్‌గౌడ్ జెండా ఎగరవేశారు. పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, సేవాదల్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Follow us
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!