AP Elections: ఏపీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు -Watch Video

AP Elections: ఏపీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు -Watch Video

Janardhan Veluru

|

Updated on: Jun 01, 2024 | 4:37 PM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన.. ఏపీలో ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొందని చెప్పారు. ఆంధ్రా ఫలితాలపై అంతా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన.. ఏపీలో ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొందని చెప్పారు. ఆంధ్రా ఫలితాలపై అంతా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారని అన్నారు. మొదటిసారి ఆంధ్రా ప్రజల నాడి దొరకలేదన్నారు. కాగా కేంద్రంలో ఈసారి బీజేపీ అధికారంలోకి రావడం ఈజీ కాదని అభిప్రాయపడ్డారు.  తెలంగాణలో కాంగ్రెస్‌, బీజేపీ మధ్య హోరాహోరీ ఫైట్‌ జరిగిందన్న కోమటిరెడ్డి..  కాంగ్రెస్‌ కచ్చితంగా 10 ఎంపీ స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తంచేశారు.

ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం..

కాగా ఏపీలో ఏపీలో కౌంటింగ్‌కి సర్వం సిద్ధమైంది. మే 13వ తేదీన ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను ఈనెల 4వ తేదీన లెక్కిస్తారు. ఇందుకోసం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు ఆయా జిల్లాల కలెక్టర్లు. ఒక్కో జిల్లాలో 4500 నుంచి 6000 వరకూ పోలీసు బలగాలను రంగంలోకి దించారు. స్ట్రాంగ్‌ రూముల దగ్గర మూడు అంచెల్ల భద్రతను ఏర్పాటు చేశారు. అనుమతి ఉంటేనే ఎవరినైనా కౌంటింగ్‌ హాల్‌లోకి అనుమతిస్తామని కలెక్టర్లు చెప్పారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో కౌంటింగ్‌ ప్రక్రియ జరుగుతుందన్నారు. ఉదయం 8 గంటలకు పోస్టల్‌ బ్యాలెట్లు, 8.30 గంటలకు ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని వెల్లడించారు.

ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 25 అసెంబ్లీ స్థానాలకు మే 13న ఒకే విడతలో పోలింగ్ నిర్వహించడం తెలిసిందే.