Watch Video: కన్యాకుమారిలో ముగిసిన మోదీ ధ్యానం.. ఢిల్లీ బయలుదేరనున్న ప్రధాని..
కన్యాకుమారిలో ప్రధాని మోదీ ధ్యానం ముగిసింది. మరికాసేపట్లో ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. వెళ్లే ముందు అక్కడి వివేకానందుని విగ్రహానికి పూలమాలవేసి నమస్కరించారు. దాదాపు 45 గంటల పాటు రాక్ మొమోరియల్ లో గడిపారు ప్రధాని మోదీ. తమిళకవి తిరువళ్లూవార్కు నివాళులు అర్పించారు. ధాన్య సమయంలో కేవలం ద్రాక్ష రసం, టెంకాయ నీళ్లు మాత్రమే సేవించారు. లోక్‌సభ తుది దశ పోలింగ్ వేళ ప్రధాని మోదీ చేపట్టిన 45 గంటల దీక్ష ముగిసింది. దీక్ష పూర్తి చేసుకున్న మోదీ రాక్ మొమోరియల్ నుంచి బయటకు వచ్చారు.
కన్యాకుమారిలో ప్రధాని మోదీ ధ్యానం ముగిసింది. మరికాసేపట్లో ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. వెళ్లే ముందు అక్కడి వివేకానందుని విగ్రహానికి పూలమాలవేసి నమస్కరించారు. దాదాపు 45 గంటల పాటు రాక్ మొమోరియల్ లో గడిపారు ప్రధాని మోదీ. తమిళకవి తిరువళ్లూవార్కు నివాళులు అర్పించారు. ధాన్య సమయంలో కేవలం ద్రాక్ష రసం, టెంకాయ నీళ్లు మాత్రమే సేవించారు. లోక్‌సభ తుది దశ పోలింగ్ వేళ ప్రధాని మోదీ చేపట్టిన 45 గంటల దీక్ష ముగిసింది. దీక్ష పూర్తి చేసుకున్న మోదీ రాక్ మొమోరియల్ నుంచి బయటకు వచ్చారు. తమిళనాడులోని కన్యాకుమారి దగ్గర మోదీ మూడు రోజులు పాటు ధ్యానం చేశారు. వివేకానంద ధ్యానమందిరం ఈ కార్యక్రమానికి వేదికయ్యింది. ధ్యానం సమయంలో కేవలం ద్రవ రూపంలోని ఆహారాన్ని మాత్రమే తీసుకున్నారు. గురువారం సాయంత్రం ఆరుగంటల సమయంలో ఆయన ధ్యానం ప్రారంభమయ్యింది. కన్యాకుమారి భగవతీ అమ్మన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి దీక్షను ప్రారంభించారు మోదీ. ధ్యానం ముగింపు సందర్భంగా తిరువళ్లవార్ విగ్రహాం పాదాలను నమస్కరించి పూలదండ వేశారు ప్రధాని. గతంలో కూడా కేదార్ నాథ్ ఆలయంలో ప్రధాని మోదీ ధ్యానం చేశారు. అయితే అప్పటితో పోలిస్తే ఇప్పడు చేపట్టిన ధ్యానం సమయం ఎక్కువగా ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

