PM Modi: నుదుటన విభూది, చేతిలో జపమాల.. కన్యాకుమారిలో 3వ రోజు ప్రధాని మోదీ ధ్యానం..!
కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్యానం కొనసాగుతోంది. ఇవాళ ఉదయాన్నే నిద్రలేచాక సముద్రతీరం నుంచి సూర్యోదయాన్ని వీక్షించి.. సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించారు. పూజాధి కార్యక్రమాలు పూర్తి చేసుకున్నారు. కాసేపు ప్రాణాయామం చేసిన మోదీ ధ్యానముద్రకు ఉపక్రమించారు.
కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్యానం కొనసాగుతోంది. ఇవాళ ఉదయాన్నే నిద్రలేచాక సముద్రతీరం నుంచి సూర్యోదయాన్ని వీక్షించి.. సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించారు. పూజాధి కార్యక్రమాలు పూర్తి చేసుకున్నారు. కాసేపు ప్రాణాయామం చేసిన మోదీ ధ్యానముద్రకు ఉపక్రమించారు. తర్వాత మెడిటేషన్ హాల్‌కి చేరుకున్నారు. మధ్యాహ్నం వరకూ ఇక్కడే దీక్ష చేస్తారు. ఇవాళ దీక్ష ముగిశాక 133 అడుగుల తిరువళ్లువర్ విగ్రహం దగ్గరకు వెళ్లి అంజలి ఘటిస్తారు.
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీజీగా గడిపిన నరేంద్ర మోదీ, 45 గంటలపాటు ధ్యానంలో గడపాలని నిర్ణయించుకున్నారు. ఆఖరు విడత ఎన్నికల ప్రచారం తర్వాత గురువారమే కన్యాకుమారికి చేరుకున్నారు. ముందు భగవతి అమ్మన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత ఫెర్రీలో వివేకానందుడి విగ్రహం వద్దకు చేరుకుని ధ్యాన మండపంలో రామకృష్ణ పరమహంస, మాతా శారదాదేవి చిత్రపటాలకు పూలమాలలు వేశారు. తర్వాత వివేకానందుడి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ధ్యానముద్రలోకి వెళ్లారు.
గురువారం సాయంత్రం అలా గడిస్తే.. శుక్రవారం అంతా కూడా మోదీ ధ్యానం కొనసాగించారు. ఇవాళ శనివారం (జూన్ 1) మధ్యాహ్నంతో ప్రధాని నరేంద్ర మోదీ ధ్యానం ముగుస్తుంది. నుదుటిన విభూది నామాలతో, చేతిలో జపమాలతో, ప్రశాంత వదనంతో ప్రధాని మోదీ పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణంలో కనిపించారు. మోదీ ధ్యానం చేస్తున్న ప్రాంతంలో 3 అంచెల భద్రత కొనసాగుతోంది.
– మెడిటేషన్ కోసం వచ్చిన మోదీ మొదటి రోజు తెల్లటి దుస్తులు ధరించి కనిపించించారు. నిన్న కాషాయ వస్త్రాలతో జపం కొనసాగించారు. ఇవాళ గంధం రంగు బట్టల్లో పూర్తి యోగిలా కనిపించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…