రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాలు.. అమరవీరుల స్థూపానికి సీఎం రేవంత్, కేసీఆర్ నివాళి..
తెలంగాణ ఆవిర్భవించి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ఆవిర్బావ వేడుకలను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించింది. సీఎం రేవంత్‌రెడ్డి ముందుగా గన్‌పార్క్ అమరవీరుల స్థూపం దగ్గర నివాళుర్పించారు. తదనంతరం పరేడ్ గ్రౌండ్‌కు వెళ్లారు. తెలంగాణభవన్‌లో జరిగిన వేడుకల్లో పార్టీ అధినేత కేసీఆర్ పాల్గొన్నారు. అమరవీరుల స్తూపానికి నమస్కరించి నివాళి అర్పి్ంచారు కేసీఆర్. తదనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ సాధించుకున్న లక్ష్యంపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్ తో పాటు, కేటీఆర్, పొన్నాల లక్ష్మయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డి, వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
