‘కేసీఆర్ కంటే ధార్మికుడు మరొకరున్నారా?’.. కాంగ్రెస్,‎ బీజేపీపై మాజీమంత్రి హరీష్‌ రావు కీలక వ్యాఖ్యలు..

8 సీట్లలో బీజేపీ గెలిచేలా కాంగ్రెస్, 8 సీట్లలో కాంగ్రెస్ గెలిచేలా బీజేపీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆరోపించారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. హైదరాబాద్‌లో జరిగిన మీట్ ద ప్రెస్‌లో పాల్గొన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని సమైక్యవాదులు అంటున్నారన్నారు. రేవంత్ రెడ్డికి ఆంధ్రా మూలాలున్నాయని.. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకోడానికి బీఆర్ఎస్ గెలవాలని ప్రజలు కోరుకుంటున్నాట్లు తెలిపారు.

'కేసీఆర్ కంటే ధార్మికుడు మరొకరున్నారా?'.. కాంగ్రెస్,‎ బీజేపీపై మాజీమంత్రి హరీష్‌ రావు కీలక వ్యాఖ్యలు..
Harish Rao
Follow us
Srikar T

|

Updated on: May 04, 2024 | 5:29 PM

8 సీట్లలో బీజేపీ గెలిచేలా కాంగ్రెస్, 8 సీట్లలో కాంగ్రెస్ గెలిచేలా బీజేపీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆరోపించారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. హైదరాబాద్‌లో జరిగిన మీట్ ద ప్రెస్‌లో పాల్గొన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని సమైక్యవాదులు అంటున్నారన్నారు. రేవంత్ రెడ్డికి ఆంధ్రా మూలాలున్నాయని.. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకోడానికి బీఆర్ఎస్ గెలవాలని ప్రజలు కోరుకుంటున్నాట్లు తెలిపారు. రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం వస్తుందని.. రివర్స్ గేర్లో పోతున్న కాంగ్రెస్ నుంచి ప్రజలు మార్పు కోరుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రం దివాలా తీసిందని ముఖ్యమంత్రి చెబితే పెట్టుబులు వస్తాయా? అని ప్రశ్నించారు. రేవంత్ మాటల వల్ల రియిల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గిందని.. పరిశ్రమలు నడుపుతున్న వారు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సీఎం రేవంత్ బీజేపీలో చేరతారని అర్వింద్, మహేశ్వర్ రెడ్డి అంటున్నారు. దీన్ని ఆయన ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందని.. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం బీఆర్ఎస్‎తోనే సాధ్యమన్నారు.

6 గ్యారంటీలను అమలు చేశాకే కాంగ్రెస్ ఎంపీ ఎన్నికల్లో ఓట్లు అడగాలని విమర్శించారు. కాంగ్రెస్ బాండు పేపర్ బౌన్స్ అయ్యాయని.. ప్రజలు దీనికి శిక్ష వేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, ఆయన సీనియారిటీని గౌరవించకుండా సీఎం రేవంత్ దుర్భాషలాడుతున్నారన్నారు. పరిపాలన వికేంద్రీకణ కోసం ఏర్పాటు చేసిన జిల్లాలను సీఎం రేవంత్ రద్దు చేస్తాననడం అభివృద్దిలో ముందుకు పోవడమా, వెనక్కి పోవడమా? అని అడిగారు. ప్రజాపాలనలో 3 లక్షల యాభైవేల దరఖాస్తులు వచ్చాయని.. అందులో ఎన్ని పరిష్కరించారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడమే పనిగా పెట్టుకుని బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలను వేధిస్తున్నారని ఆరోపించారు. పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకమని మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ వాటినే ప్రోత్సహిస్తోందని విమర్శించారు.

బీజేపీ తెలంగాణకు చేసిందేమీ లేదని.. దేశవ్యాప్తంగా 157 మెడికల్, నర్సింగ్ కాలేజీలు ఇస్తే ఈ రాష్ట్రానికి ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు, నవోదయ స్కూళ్లు కూడా మంజూరు చేయలేదన్నారు. కేసీఆర్ తెలంగాణను దక్షిణ భారత ధాన్యాగారంగా మార్చితే వడ్లు కొనకుండా వివక్ష చూపారని తెలిపారు. తెలంగాణకు ఏమీ ఇవ్వని బీజేపీ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతుంది? అని నిలదీశారు. రైతుబంధు, రైతుబీమా, రైతులకు ఉచిత కరెంటు, మెడికల్ కాలేజీలు, కొత్త జిల్లాలు, కేసీఆర్ కింట్, మంచినీళ్లు, తాగు నీళ్లు ఇవన్నీ కేసీఆర్ ఇచ్చారని గుర్తు చేశారు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచి ప్రజలను బీజేపీ ఇబ్బంది పెట్టిందన్నారు. భక్తి, ధార్మికం గురించి మాట్లాడుతున్నారు.. కేసీఆర్ కంటే ధార్మికుడు మరొకరున్నారా? అని ప్రజలను అడిగారు. యాదాద్రిని అద్భుతంగా కట్టింది కేసీఆర్.. ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలకు కొరత రాకుండా చూశారన్నారు. కేసీఆర్ బస్సుయాత్రకు ప్రజల్లో ఆదరణ లభిస్తోంది. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ కంటే బీఆర్ఎస్‌కే ఎక్కువ సీట్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు హరీష్ రావు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం కోసం ఇక్కడ క్లిక్ చేయండి..