Kishan Reddy: బీజేపీ కార్యాలయంపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

బీజేపీ వర్సెస్ కాంగ్రెస్.. మంగళవారం ఉదయం నుంచి హైదరాబాద్ నాంపల్లిలో హింసాత్మక ఘటనలు చెలరేగుతూనే ఉన్నాయి. ప్రియాంకగాంధీపై బీజేపీ నేత రమేష్ బిధూరి వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేస్తూ.. బీజేపీ ఆఫీసును ఇవాళ ఉదయం కాంగ్రెస్ కార్యకర్తలు ముట్టడించారు. కాగా.. బీజేపీ కార్యాలయంపై దాడిని.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు.

Kishan Reddy: బీజేపీ కార్యాలయంపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
Kishan Reddy
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 07, 2025 | 5:18 PM

బీజేపీ వర్సెస్ కాంగ్రెస్.. మంగళవారం ఉదయం నుంచి హైదరాబాద్ నాంపల్లిలో హింసాత్మక ఘటనలు చెలరేగుతూనే ఉన్నాయి. ప్రియాంకగాంధీపై బీజేపీ నేత రమేష్ బిధూరి వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేస్తూ.. బీజేపీ ఆఫీసును ఇవాళ ఉదయం కాంగ్రెస్ కార్యకర్తలు ముట్టడించారు. కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేశారు. బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల ఘర్షణతో బీజేపీ ఆఫీస్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆ ఘటనలో పలువురికి గాయాలు కూడా అయ్యాయి. అనంతరం గాంధీభవన్ దగ్గర సేమ్ టూ సేమ్ అదే సీన్ రిపీట్ అయింది. కాంగ్రెస్ కార్యకర్తల దాడిని నిరసిస్తూ గాంధీభవన్‌ను బీజేపీ ముట్టడించింది. బారీకేడ్లు తోసుకుని వెళ్లి గాంధీభవన్‌వైపు వెళ్లారు బీజేపీ యువ మోర్చా కార్యకర్తలు.. అక్కడ ఫ్లెక్సీలను చించి వేశారు. రేవంత్ సర్కార్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. పరిస్థితిని అదుపుచేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

కాగా.. బీజేపీ కార్యాలయంపై దాడిని.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు.. కాంగ్రెస్ నేతలు.. గూండాలతో కలిసివచ్చి రాష్ట్ర బీజేపీ కార్యాలయంపై, బీజేపీ నేతలపై దాడులు చేశారని కిషన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు రాళ్లు, కర్రలతో బీజేపీ నేతల తలలు పగలకొడుతుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము తలుచుకుంటే కాంగ్రెస్ నేతలు ఎవరూ రోడ్ల మీద తిరగలేరని వార్నింగ్ ఇచ్చారు. తమ సహనాన్ని అసమర్థతగా భావించొద్దన్నారు. తాము కఠిన నిర్ణయాలు తీసుకోక ముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలని కిషన్ రెడ్డి సూచించారు.

వీడియో చూడండి..

మహేష్ గౌడ్ సీరియస్..

యూత్‌ కాంగ్రెస్‌ నాయకులపై టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ గౌడ్ సీరియస్ అయ్యారు. నిరసనలు ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండాలని సూచించారు. బీజేపీ నేతల వ్యాఖ్యలు ఖండించాల్సినవే అని చెప్పారు. కానీ పార్టీ కార్యాలయంపై దాడికి దిగడం సరికాదన్నారు. బీజేపీ నేతల దాడి కూడా సరైంది కాదన్నారు. శాంతిభద్రతల విషయంలో బీజేపీ నేతలు సహకరించాలని సూచించారు.

అసలేం జరిగిందంటే..

ఢిల్లీలో తాము అధికారంలోకి వస్తే ఢిల్లీ రోడ్లను ప్రియాంకాగాంధీ బుగ్గల్లా మారుస్తామంటూ రమేష్‌ బిధూరి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.. ఢిల్లీలోని కల్కాజీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం రమేష్‌ బిధూరి బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. ఇదే అసెంబ్లీ సెగ్మెంట్‌ నుంచి ఆమ్‌ఆద్మీ అభ్యర్థిగా ఢిల్లీ సీఎం ఆతిశీ బరిలోకి దిగారు. కాంగ్రెస్‌ నుంచి ఆల్కా లాంబా ఈ సెగ్మెంట్‌లో పోటీచేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రియాంకాగాంధీని ఉద్దేశించి రమేష్‌ బిధూరి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నా, దుమారం మాత్రం తగ్గలేదు. ఈనేపథ్యంలోనే బీజేపీ ఆఫీసును ముట్టడించడానికి కాంగ్రెస్‌ కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ నిరసన కార్యక్రమం హింసాత్మకంగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..