Telangana: చేపల కోసం వల వేసిన జాలరి.. చిక్కింది చూసి స్టన్!
నదిలో చేపల వేటకు వెళ్లిన జాలరులకు వింత అనుభవం ఎదురైంది. చేపల కోసం నదిలో వల విసరిన కాసేపటికి.. వల బరువెక్కింది. దీంతో జాలరులు వలను బయటకు లాగారు. కానీ వల లోపల చేపలకు బదులు దొరికింది చూసి ఒక్కసారిగా పరేషానయ్యారు. ఈ విచిత్ర ఘటన తెలంగాణలోని వనపర్తి జిల్లాల్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..
కొత్తకోట, జనవరి 7: నదిలో చేపల వేటకు వెళ్లారు కొందరు జాలరులు. నది మధ్యలోకి వెళ్లి వల విసిరారు. వల బరువెక్కడంతో ఆశగా జాలర్లు దానిని బయటకు లాగారు. తీరా వలను ఓపెన్ చేసి చూడగా.. లోపల ఉన్న దానిని చూసి అవాక్కయ్యారు. చేపల వలలో ఏకంగా 11 కేజీల బరువున్న భారీ ఆకారం వారికి కనిపించింది. ఏంటాని చూడగా.. దెబ్బకు భయంతో బిక్కసచ్చిపోయారు. ఈ విచిత్ర ఘటన కొత్తకోట మండలం కానాయాపల్లి గ్రామ శివారులో ఉన్న పంప్ హౌస్ పక్కన ఉన్న కెనాల్‌లో సోమవారం (జనవరి 6) చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..
తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయాపల్లి గ్రామ శివారులో ఉన్న పంప్ హౌస్ పక్కన ఉన్న నదిలో కొందరు వ్యక్తులు చేపల కోసం వేసిరారు. ఆ వలలో చేపలకు బదులు ఏకంగా భారీ కొండచిలువ చిక్కింది. దాని బరువు 11 కేజీలకు పైగా ఉంది. ఈ విషయం పంప్ హౌస్‌లో ఉన్న సిబ్బంది గమనించి స్నేక్ సొసైటీ వ్యవస్థాపనకులు చీర్ల కృష్ణ సాగర్‌కు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న చీర్ల కృష్ణ సాగర్ వలలో చిక్కిన కొండచిలువను సురక్షితంగా బయటికి తీశారు.
ఈ సందర్భంగా స్నేక్ సొసైటీ వ్యవస్థాపకులు కృష్ణ సాగర్ మాట్లాడుతూ.. కొందరు వ్యక్తులు అడవి పందులు, అడవి జంతువుల కోసం వలలు, కరెంట్ తీగలు పెట్టడం వలన ఎన్నో రకాల అడవి జంతువులు మృత్యువాత పడుతున్నాయి. వీటితోపాటు మనుషులు కూడా కరెంట్ షాక్‌కు గురై తగిలి మృతి చెందుతున్నారు. కాబట్టి రైతులు తమ పొలాలను అడవి జంతువుల నుంచి కాపాడుకునేందుకు ఇతర ఇలాంటి ప్రమాదకర ఉచ్చులను వేయడానికి బదులు సాంకేతికతను ఉపయోగించుకొని రసాయన మందులు పిచికారి చేయాలని కృష్ణ సాగర్ అన్నారు. అనంతరం వలలో నుంచి బయటకు తీసిని కొండచిలువను ఫారెస్ట్ అధికారులకు అప్పగించినట్లు ఆయన తెలిపారు.