Telangana: శివలింగం చుట్టూ నాగసర్పం.. ఆశ్చర్యంలో భక్తజనం.. మీరూ చూసేయండి
ఈ ఆలయం పురాతనమైనది.. కాకతీయుల కాలం కంటే ముందే.. ఈ ఆలయం నిర్మించారు.. వేములవాడ రాజేశ్వరస్వామి ఆలయానికి ఉన్న చరిత్ర.. ఈ ఆలయానికి ఉంది.. అదే సైజులో శివలింగం.. కానీ.. ఇక్కడ మాత్రం ఓ అద్భుతం కనబడుతుంది. వందల యేళ్లుగా.. ఈ శివలింగానికి ప్రతి రోజూ..
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ శివారులో ఓ పురాతనమైన శివాలయం ఉంది. ఈ ఆలయానికి వందల సంవత్సరాల చరిత్ర ఉంది.. ఈ ఆలయం కూలిపోవడానికి సిద్ధంగా ఉంది.. అయితే ఇక్కడ ఉన్న శివలింగం ఎంతో మహిమ గలది. దేశంలో ఎక్కడ లేని వి ధంగా.. ఈ ఆలయంలో ఓ అద్భుతం జరుగుతుంది. శివలింగం వెనుక వైపు.. ఓ పుట్ట.. ఈ పుట్టలోనే నాగేంద్రుడు.. సూర్యోదయం కంటే ముందే.. ఈ నాగేంద్రుడు.. పుట్టలో నుంచి బయటకు వస్తాడు.. శివలింగం చుట్టూ.. నాలుగైదు ప్రదక్షిణలు చేస్తుంది. అంతేకాదు. పాలు తాగుతుంది.. అప్పుడప్పుడు… శివలింగం వద్దనే నిద్రిస్తుంది. ఇలా చాలా యేళ్లుగా నాగసర్పం.. ఈ ఆలయంలోనే ఉంటుంది… పెద్ద సైజులో ఉంటే. ఈ నాగరాజు… చాలా మంది భక్తులు చూశారు.
పూజారికి వారంలో రెండు సార్లు కనబడుతుంది. సూర్యోదయం కంటే ముందే పుట్టలో నుంచి బయటకు వచ్చి లింగం చుట్టూ తిరుగుతూ పూజలు చేస్తూ వెళ్లిపోతుంది. గతంలో చాలా మంది భక్తులు చూశారు. ఇప్పటి వరకు ఎవరికి కూడా హానీ తల పెట్టలేదు. దేవుడు మహిమతోనే ఈ నాగసర్పం ఇక్కడ ఉంటుందనే భక్తుల నమ్మకం… అయితే.. ఆలయంలో పూజలు చేస్తే.. కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం… దీంతో ప్రతి సోమ, శుక్రవారాల్లో ఈ ఆలయం వద్ద భక్తుల రద్దీ కనబడుతుంది. ఈ రోజు చాలా మందికి నాగసర్పం కనబడుతుంది.. ఆలయం శిథిలావస్థలోకి చేరుకున్న.. శివలింగం మాత్రం చెక్కు చెదురలేదు.. ఈ పురాతన ఆలయానికి చరిత్రతో పాటు.. ఈ నాగేంద్రుడు మహిమ కూడా ఉంది.. దీంతో భక్తులు.. ఈ నాగేంద్రుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ పుట్టలో ఒక్క పాము మాత్రమే కనబడుతుంది.. చాలా సంవత్సరాలు.. ఈ పామును చూస్తున్నారు స్థానిక భక్తులు.. స్వామి వారి మహిమతోనే.. ఇక్కడ నాగేంద్రుడు ఉన్నారని భక్తులు బలంగా నమ్ముతున్నారు.. ఈ ఆలయంలో చాలా సార్లు.. నాగసర్పాన్ని చూశామని భక్తులు అంటున్నారు.. పుట్టలో నుంచి బయటకు వచ్చి.. లింగం చుట్టు తిరిగి వెళ్లిపోతుందని తెలుపుతున్నారు. అంతేకాదు.. లింగం వద్ద ఉన్న పాలు కూడా తాగుతుందని చెబుతున్నారు.. ఇది శివుడి మహిమ అని అంటున్నారు. చాలా సార్లు.. నాగసర్పాన్ని చూశానని పూజలు అంటున్నారు. అప్పుడప్పడు భయం వేస్తుందని తెలుపుతున్నారు. పుట్టలో నుంచి బయటకు వచ్చి.. లింగం వద్ద.. తిరుగుతు ఉంటుందని చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి