Telangana: ఏం మనుషులు రా మీరు.. నోరులేని కుక్కలపై ప్రతికారమా..? 40 శునకాలను కట్టేసి..
బ్రిడ్జీ కింద పడి ఉన్న కుక్కలను చూసిన వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసారు..ఇక బ్రిడ్జి కింద తీవ్రంగా గాయపడిన కుక్కలను ఆ ప్రాంతంలోని వంతెన పై నుంచి విసిరివేసి ఉండవచ్చని ప్రాథమికంగా నిర్దారించారు. మరణించిన కుక్కల అవశేషాలను పోస్ట్‌మార్టం పరీక్ష కోసం పంపించారు..మరణించిన కుక్కల అవశేషాలను పోస్ట్‌మార్టం పరీక్ష కోసం పంపించారు.. జంతు సంరక్షణ సంస్థ అయిన సిటిజన్స్ ఫర్ యానిమల్స్ అనే సంస్థ ద్వారా జనవరి 4న ఈ ఘటన వెలుగులోకి వచ్చింది..
రాను,రాను మనుషుల్లో మానవత్వం అనేది పూర్తిగా నశిస్తుంది..కొంతమంది వ్యక్తులు అయితే పాశవికంగా ప్రవర్తిస్తున్నారు..ఇలాంటి వారిని చూస్తుంటే అడవిలో జంతువులే బెటర్ అని అనిపిస్తుంది.. ఒక మూగ జీవి చనిపోతే.. తోటి జంతువులు ఎంతో చలించిపోయి, వాటిని కాపాడే ప్రయత్నం చేస్తాయి.. కానీ కొంతమంది మనుషులు మాత్రం, ముగాజీవాలు అనే ఆలోచన మరిచి..అత్యంత దారుణంగా వాటిని చంపేస్తున్నారు. ఇలాంటి దారుణ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది..వివరాల్లోకి వెళితే..
కంది మండలం ఎద్దు మైలారం గ్రామ శివారులో ఉన్న ఓ బ్రిడ్జి కింద 21 కుక్కలను అత్యంత కిరాతకంగా చంపేశారు.. కుక్కల మూతికి,కాళ్ళకు తాడు కట్టి 40 అడుగుల పై నుండి కిందకు వేసారు.. ఇందులో 21 కుక్కలు చనిపోగా..మరో 11 కుక్కల పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన కుక్కలకు సికింద్రాబాద్ తార్నాక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు..ఈ ఘటన జనవరి 4వ తేదీన చోటుచేసుకుంది..అయితే కొంతమంది ఈ విషయాన్నిసిటిజన్స్ ఫర్ యానిమల్స్ వారికి సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
బ్రిడ్జీ కింద పడి ఉన్న కుక్కలను చూసిన వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసారు..ఇక బ్రిడ్జి కింద తీవ్రంగా గాయపడిన కుక్కలను ఆ ప్రాంతంలోని వంతెన పై నుంచి విసిరివేసి ఉండవచ్చని ప్రాథమికంగా నిర్దారించారు. మరణించిన కుక్కల అవశేషాలను పోస్ట్‌మార్టం పరీక్ష కోసం పంపించారు..
జంతు సంరక్షణ సంస్థ అయిన సిటిజన్స్ ఫర్ యానిమల్స్ అనే సంస్థ ద్వారా జనవరి 4న ఈ ఘటన వెలుగులోకి వచ్చింది..సిటిజన్స్ ఫర్ యానిమల్స్ అనే సంస్థతో పాటు,యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ (AWCS) మరియు పీపుల్ ఫర్ అని 1 అనే సంస్థ సహాయంతో గాయపడిన 11 కుక్కలను రక్షించి..నాగోల్‌లోని PFA షెల్టర్‌కు తరలించారు..జంతు సంరక్షణ సంస్థలు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు..బాధ్యుల పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు..మరో వైపు పోలిసులు కూడా ఈ కేస్ ను సీరియస్ గా తీసుకొని, నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు, జంతు ప్రేమికులు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి