Telangana: ‘మోదీ చేస్తున్న అభివృద్దికి మద్దతు ఇవ్వండి’.. బీజేపీ ఎన్నికల ప్రచారంలో మలయాళ నటుడు..

తెలంగాణలో మలయాళ హీరో, బీజేపీ నేత సురేష్ గోపి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలంగాణ ప్రజలు కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ ను గెలిపించాలని కోరారు. తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ గెలుపుకోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ అధ్యక్షులతో పాటు సినిమా రంగానికి చెందిన పలువురిని కూడా రంగంలోకి దించింది. తెలుగులో అంతిమ తీర్పు , ఆ ఒక్కడు సినిమాల్లో నటించిన మలయాళ హీరో సురేష్ గోపి సికింద్రాబాద్, మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గాల్లో కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ కు ప్రచారం నిర్వహించారు.

Telangana: 'మోదీ చేస్తున్న అభివృద్దికి మద్దతు ఇవ్వండి'.. బీజేపీ ఎన్నికల ప్రచారంలో మలయాళ నటుడు..
Bjp Election Campaign
Follow us
Srikar T

|

Updated on: May 04, 2024 | 3:39 PM

హైదరాబాద్, మే 4: తెలంగాణలో మలయాళ హీరో, బీజేపీ నేత సురేష్ గోపి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలంగాణ ప్రజలు కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ ను గెలిపించాలని కోరారు. తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ గెలుపుకోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ అధ్యక్షులతో పాటు సినిమా రంగానికి చెందిన పలువురిని కూడా రంగంలోకి దించింది. తెలుగులో అంతిమ తీర్పు , ఆ ఒక్కడు సినిమాల్లో నటించిన మలయాళ హీరో సురేష్ గోపి సికింద్రాబాద్, మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గాల్లో కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ కు ప్రచారం నిర్వహించారు. కేంద్రంలో అవసరాన్ని బట్టి ఇద్దరికీ కేంద్రమంత్రి పదవులు కూడా వచ్చేలా చేస్తామన్నారు. దీనిపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని, అయితే తాను మాత్రం ఇద్దరూ గెలిచి కేంద్ర మంత్రులు కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎంపీ అభ్యర్థిగా నిలిచిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని, మాజీ మంత్రి ఈటల రాజేందర్‎ను భారీ మెజారిటీతో గెలిపించాలని తెలంగాణ ప్రజలను చేతులు జోడిచి కోరుతున్నానన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన స్థానాల్లో కూడా బిజెపిని బలపరచలన్నారు. మరోసారి కిషన్ రెడ్డిని గెలిపిస్తే.. కేంద్రమంత్రిగా ఎన్నో పనులు చేస్తారని హామీ ఇచ్చారు. దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో అభివృద్ది కార్యక్రమాలను దక్షిణ భారతదేశంలో చేపట్టిందన్నారు. తాను పోటీ చేస్తున్న త్రిస్సుర్‎ నియోజకవర్గ ప్రజల తీర్పు ఈవీఎం బాక్స్‎లో ఉందన్నారు. తప్పకుండా గెలిచి సంబరాలు చేసుకునే అవకాశం ప్రజలు తనకు ఇచ్చి ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ లోక్ సభ ఎన్నికల్లో కేరళ, తెలంగాణలో బిజెపికి మంచి ఫలితాలు రాబోతున్నాయని జోస్యం చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం కోసం ఇక్కడ క్లిక్ చేయండి..