నీట మునిగిన పంటతో రైతు కంట కన్నీరు.. సాయం కోసం ఎదురు చూపులు..
కష్టాలకు ఎదురీది పంటలు సాగు చేసిన రైతులను.. దంచి కొడుతున్న వానలు నట్టేట ముంచాయి. నోటి కాడి బుక్క నీటిపాలడంతో దిగులుతో తలలు పట్టుకున్నారు. మరోవైపు తడిసిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. అకాల వర్ష బీభత్సంతో వరి పంటకు ఊహించని విధంగా నష్టం వాటిల్లింది. వరంగల్, ములుగు, మహబూబాబాద్, భూపాలపల్లి, జనగామ జిల్లాల్లో వరి పంట మొత్తం వర్షార్పణమైంది.

కష్టాలకు ఎదురీది పంటలు సాగు చేసిన రైతులను.. దంచి కొడుతున్న వానలు నట్టేట ముంచాయి. నోటి కాడి బుక్క నీటిపాలడంతో దిగులుతో తలలు పట్టుకున్నారు. మరోవైపు తడిసిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. అకాల వర్ష బీభత్సంతో వరి పంటకు ఊహించని విధంగా నష్టం వాటిల్లింది. వరంగల్, ములుగు, మహబూబాబాద్, భూపాలపల్లి, జనగామ జిల్లాల్లో వరి పంట మొత్తం వర్షార్పణమైంది. ఇప్పటికే కోతలు పూర్తయి అమ్మకం కోసం చాలా ప్రాంతాల్లో ధాన్యం ఆరబోసుకొని అమ్ముకోవడానికి ఎదురుచూస్తున్నారు. వానల నుంచి పంటను కాపాడుకోవడం కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి ఉంది. అయితే ఆరబోసిన ధాన్యం తడవడంతో ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం క్షేత్రస్థాయి పరిశీలన చేసి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
మరోవైపు సిరిసిల్ల జిల్లా వరి ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని వేములవాడ అర్బన్ మండలం అనుపురం ప్రధాన రహదారిపై రైతుల ఆందోళనకు దిగారు. వర్షానికి ధాన్యం తడిసి ముద్దయిందని.. 15 రోజులు గడుస్తున్నా లారీలు రావట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత అధికారులు లారీలను పంపించాలని రైతులు డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే రైతులు ఇబ్బంది పడుతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. గత వారం ఒక రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపు కూడా ఇచ్చాయి. ఈ నేపథ్యంలో రైతుల పంటనష్టంపై అంచనా వేసే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కేవలం ఒక ప్రాంతంలోనే కాకుండా చాల జిల్లాల్లో తడిసిన ధాన్యంతో రైతులు తీవ్ర ఆందోళన ఎదుర్కొంటున్నారు. తమ సమస్యను సత్వరమే పరిష్కరించాలని తమ గోడు విలపించుకుంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








