TS EAPCET 2024 Counselling: వారంలో ఈఏపీసెట్ 2024 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. మేనేజ్‌మెంట్ సీట్లపై స్పెషల్ ఫోకస్
తెలంగాణ ఎప్‌సెట్ ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించిన ఈఏపీసెట్ 2024 ఫలితాలు శనివారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ వారం రోజుల్లో విడుదల చేస్తామని విద్యాశాఖ చీఫ్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంజినీరింగ్ కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఇచ్చే ప్రక్రియ నడుస్తోంది. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఇచ్చిన..
హైదరాబాద్, మే 20: తెలంగాణ ఎప్‌సెట్ ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించిన ఈఏపీసెట్ 2024 ఫలితాలు శనివారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ వారం రోజుల్లో విడుదల చేస్తామని విద్యాశాఖ చీఫ్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంజినీరింగ్ కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఇచ్చే ప్రక్రియ నడుస్తోంది. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఇచ్చిన గడువులోపు ప్రవేశాలు పూర్తి చేస్తాం. యాజమాన్య కోటా (బీ కేటగిరీ) సీట్లను ఇష్టారాజ్యంగా అమ్ముకోకుండా తగిన చర్యలు తీసుకుంటాం. అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఎంబీబీఎస్ సీట్ల మాదిరిగా ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించి ఫీజులు నిర్ణయించడం, లేదంటే ఇందుకు సంబంధించి ఇతర ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చిస్తామని ఆయన తెలిపారు.
ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో డిప్లొమా చదివిన వారు లేటరల్ ఎంట్రీ ద్వారా నేరుగా బీటెక్ లేదా బీఫార్మసీ రెండో ఏడాదిలో ప్రవేశాలు పొందే విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ అందేలా చూస్తామని ఆయన వెల్లడించారు. ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు కొత్తగా దరఖాస్తులు కోరడం లేదనీ, అయినప్పటికీ కొందరు దరఖాస్తులు ఇస్తున్నారని అన్నారు. నిబంధనల ప్రకారంగా మాత్రమే అనుమతులు ఇస్తామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి తెలిపారు.
ప్రైవేట్ పాఠశాల ఫీజు నియంత్రణకు చట్టం
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ కాలేజీల్లో ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసకువస్తామని బుర్ర వెంకటేశం తెలిపారు. వేసవి సెలవులు ముగింపుకు వస్తున్నందున్న ఈ విద్యా సంవత్సరానికి అది వీలుకాకపోవచ్చని అన్నారు. అయిఏత 2025-26 విద్యా సంవత్సరంలో దీనిని అమల్లోకి తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేసినా అది కూడా చట్ట రూపం దాల్చలేదని, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లులు అసెంబ్లీలో ప్రవేశ పెడతామని అయన అన్నారు. అలాగే ఉపకులపతుల నియామకం కూడా కొంత ఆలస్యం కానున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది మే 21వ తేదీతో యూనివర్సిటీ వీసీల పదవీకాలం ముగుస్తుందని అన్నారు. కొత్త వీసీల నియామకాలు ఎన్నికలకోడ్ తదితర కారణాల వల్ల ఆలస్యమైనట్లు ఆయన తెలిపారు. కొత్త వీసీల నియామకాలు జరిపేంతవరకూ తాల్కాలిక వీసీలుగా ఐఏఎస్‌లను నియమించాలా లేదా ఆయా యూనివర్సిటీల్లో సీనియర్ ప్రొఫెసర్లను నియమించాలా అనే విషయంపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టం చేస్తామని ఆయన తెలిపారు.