AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JEE Main Paper 2 Toppers 2024: జేఈఈ మెయిన్‌ పేపర్‌-2 ఫలితాల్లో టాప్‌ ర్యాంకర్లు వీరే.. సత్తా చాటిన ఏపీ కుర్రాడు!

దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో బీఆర్క్‌, బీప్లానింగ్‌ కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించిన జేఈఈ మెయిన్‌ 2024 పేపర్‌ 2 పరీక్ష ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. పరీక్షకు హాజరైన విద్యార్థులు అప్లికేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో నమోదుచేసి..

JEE Main Paper 2 Toppers 2024: జేఈఈ మెయిన్‌ పేపర్‌-2 ఫలితాల్లో టాప్‌ ర్యాంకర్లు వీరే.. సత్తా చాటిన ఏపీ కుర్రాడు!
JEE Main Paper 2 Toppers
Srilakshmi C
|

Updated on: May 20, 2024 | 6:50 AM

Share

న్యూఢిల్లీ, మే 20: దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో బీఆర్క్‌, బీప్లానింగ్‌ కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించిన జేఈఈ మెయిన్‌ 2024 పేపర్‌ 2 పరీక్ష ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. పరీక్షకు హాజరైన విద్యార్థులు అప్లికేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో నమోదుచేసి ఫలితాలు డౌన్‌లోడ్‌ చూసుకోవచ్చు. జేఈఈ మెయిన్‌ పేపర్‌-2 పరీక్షలను దేశ వ్యాప్తంగా 291 పరీక్ష కేంద్రాల్లో ఈ ఏడాది ఏప్రిల్‌ 12న నిర్వహించిన సంగతి తెలిసిందే. 73,362 మంది విద్యార్థులు బీఆర్క్‌కు, 38,105 మంది బీప్లానింగ్‌ పరీక్షకు రిజిస్టర్‌ చేసుకోగా.. వీరిలో బీఆర్క్‌ పరీక్షకు 36,707 మంది, బీప్లానింగ్‌ పరీక్షకు 16,228 మంది విద్యార్థులు హాజరయ్యారు.

తాజా ఫలితాల్లో రెండు విభాగాల్లో ఇద్దరు చొప్పున వంద శాతం పర్సంటైల్‌ సాధించారు. వీరిలో ఒకరు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్ధి ఉండటం విశేషం. బీఆర్క్‌ పరీక్ష ఫలితాల్లో జార్ఖండ్‌కు చెందిన బసాక్‌, తమిళనాడు విద్యార్థి ముత్తు అనే ఇద్దరు విద్యార్ధులు 100 శాతం పర్సంటైల్‌ సాధించి టాప్‌ ర్యాంకర్లుగా నిలిచారు. ఇక బీప్లాన్‌లో కర్ణాటకకు చెందిన అరుణ్‌ రాధాక్రిష్ణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కలసాని సాకేత్‌ ప్రణవ్‌ 100 పర్సంటైల్‌ సాధించి ఆల్‌ ఇండియ్‌ టాపర్లుగా నిలిచారు.

ఆ తర్వాత ఆల్‌ ఇండియా బీఆర్క్‌ సెకండ్‌ ర్యాంకర్లుగా నిలిచిన ఏపీకి చెందిన యాయవరం శ్రవణ్‌ రామ్‌, తెలంగాణ విద్యార్థులు వివేక్‌జిత్‌ దాస్‌, బోడ ప్రభంజన్‌ జాదవ్‌, బానోత్‌ రిత్వక్‌ 99 శాతం పర్సంటైల్‌ స్కోర్‌ చేశారు. బీప్లాన్‌లోలో ఏపీ విద్యార్థి కాలిగాట్ల దేవీప్రసాద్‌ 99.99 పర్సంటైల్‌ సాధించి సెకండ్‌ ర్యాంక్‌ సాధించారు.

ఇవి కూడా చదవండి

జేఈఈ మెయిన్‌ పేపర్ 2 స్కోర్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.