AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఓరి నాయనో.. కోడి మాంసం ధర ఏంది ఇంత పెరిగింది…?

మాసం ప్రియులకు ఇది నిజంగా చేదువార్తే. ఎందుకంటే చికెన్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఉత్పత్తి తగ్గిపోవడం, కొను గోళ్లు పెరగడం ధరల పెరుగుదలకు కారణమైంది.. ఏకంగా 300 దాటింది. కడుపు నిండా చికెన్​ తినాలంటే జేబు కాస్త ఖాళీ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది.

Hyderabad: ఓరి నాయనో.. కోడి మాంసం ధర ఏంది ఇంత పెరిగింది...?
Chicken
Ram Naramaneni
|

Updated on: May 20, 2024 | 9:37 AM

Share

బ్యాగ్ పట్టుకొని.. మార్కెట్‌కు వెళ్తున్నారా.. వీకెండ్‌లో షాప్‌కు వెళ్లి.. చికెన్ తీసుకురావాలనుకుంటున్నారా.. అయితే మీరు షాక్‌కు గురి కావల్సిందే. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా చికెన్ ధర ఆల్ టైం హైకి వెళ్లింది.  చికెన్.. ముక్క లేనిది ముద్ద దిగదు కొందరికీ. మెనూలో చికెన్‌ వంటకం ఉండాల్సిందే. కానీ గత కొద్దిరోజులుగా కొండెక్కి కూర్చున్న చికెన్ ధరలు వినియోగదారులకు చుక్కలు చూపించాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. గత వారం వరకు కిలో చికెన్ రేటు 250-280 రూపాయల మధ్య ఉండగా.. ఇప్పుడు మరింత పెరిగి కిలో ఏకంగా 300 రూపాయలు పలుకుతుంది. మరో 15 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వ్యాపారులు అంటున్నారు. మండుతున్న ఎండలు, వాతావరణంలో మార్పు కారణంగా కోళ్ల ఉత్పత్తి బాగా తగ్గి పోయిందని, జూన్ వరకు ఇదే పరిస్థితి ఉంటుందని అంటున్నారు.

గ్రేటర్ హైదరాబాద్లో గత ఆదివారం స్కిన్‌ లెస్‌ కిలో రూ.270 వరకూ ఉండగా ఇప్పు డు రూ.40 పెరిగింది. కోళ్ల దాణా, రవాణా ఖర్చులు కూడా భారీగా పెరిగాయని.. ఇవి కూడా రేట్లు పెరగడానికి కారణమంటున్నారు వ్యాపారులు. ఇప్పటికే పెరిగిన కూరగాయలు, పప్పుల ధరలకు తోడు.. కోడికూడా సామాన్యుడికి అందనంటోంది. మొన్నటి వరకు వారం రోజులకు ఒకసారి తినాలనుకునేవాళ్లు.. ఇప్పుడు ఆలోచించి మరీ తీసుకుంటున్నారు. నెలకు నాలుగుసార్లు తినేవాళ్లు రెండుసార్లు తింటున్నారు. బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకుని అనవసరపు ఖర్చులను తగ్గించుకుంటున్నారు. ఎవరైనా బంధువులు వచ్చినా.. నాన్‌వెజ్‌ పెట్టలేకపోతున్నామన్న బాధ పేద, మధ్యతరగతి కుటుంబాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. బిర్యానీ, కర్రీపాయింట్లలోనూ గిరాకీ తగ్గిందని చెబుతున్నారు వ్యాపారులు. ఒకప్పుడు రోజూ 20 కిలోల వరకు అమ్మే వ్యాపారులు.. ఇప్పుడు 10 కిలోలతో సరిపెట్టాల్సి వస్తోందని చెబుతున్నారు.

చికెన్‌ రేట్ల పెరుగుదలతో… రిటైల్‌ వ్యాపారులు కూడా డీలా పడిపోయారు. ఒకప్పుడున్నంత గిరాకీ ఇప్పుడు లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్