పంటను కాపాడుకోవడం కోసం మానవ ప్రయత్నాలు.. కొత్త అవతారమెత్తిన రైతు..!
వానరసేనల ఆకలి దాడులు అన్నదాతలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. కోతుల బెడద నుండి విముక్తికోసం పడరాని పాట్లు పడుతున్న రైతులు చివరకు పగటి వేషాలు వేయాల్సి వస్తుంది. మహబూబాబాద్ జిల్లాలో ఓ రైతు ఏకంగా ఎలుగుబంటి వేషం వేసుకొని తన పంటను కోతుల బెడదనుండే కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు.

వానరసేనల ఆకలి దాడులు అన్నదాతలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. కోతుల బెడద నుండి విముక్తికోసం పడరాని పాట్లు పడుతున్న రైతులు చివరకు పగటి వేషాలు వేయాల్సి వస్తుంది. మహబూబాబాద్ జిల్లాలో ఓ రైతు ఏకంగా ఎలుగుబంటి వేషం వేసుకొని తన పంటను కోతుల బెడదనుండే కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎలుగుబంటి వేషధారణ అప్పుడప్పుడు ఆయనకు ఊహించని చిక్కులు తెచ్చిపెడుతుంది. నిజమైన ఎలుగుబంటి అనుకొని అతనిపైన అప్పుడప్పుడు దాడులు కూడా జరుగుతున్నాయి.
కోతుల భారీ నుండి తన పంటను కాపాడుకోవడం కోసం వినూత్న మార్గం ఎంచుకున్నాడు ఓ రైతు. ఎన్ని చేసినా కోతుల నుండి విముక్తి లభించడం లేదు. దీంతో ఎలుగుబంటి అవతారమే మార్గమని భావించి తానే ఎలుగుబంటి వేషం వేసుకొని కోతులను తరిమేస్తూ కాస్త విముక్తి పొందుతున్నాడు.
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం మడిపల్లి గ్రామానికి చెందిన ఈ రైతు పేరు చిర్రబోయిన శ్రీను.. ఇతను మొత్తం పది ఎకరాల భూమిలో వ్యవసాయం సాగు చేస్తున్నాడు. వాటిలో 8 ఎకరాలలో పత్తి, 2 ఎకరాల వరి సాగు చేస్తున్నాడు. ఆ పంటను కోతుల బారి నుండి కాపాడుకునేందుకు గులేరు, మైకులు, కర్రలతో తరిమిసి అలసి పోయాడు. ఎన్నిపాట్లు పడుతున్నా కోతుల నుండి విముక్తి లభించడం లేదు. పంటలు పూర్తిగా ధ్వంసం అవుతున్నాయి. దీంతో విసిగి వేసారిన రైతు శ్రీను కొత్తగా ఆలోచించి ఎలుగుబంటి మాస్కును ఖరీదు చేశాడు. తానే ఎలుగుబంటి వేషం ధరించి కోతులను బెదిరించి తరిమి వేయడంతో కాస్త విముక్తి లభించింది.
ఎలుగుబంటి వేషం ధరించి పత్తి చేను పరిసరాలలో తిరుగుతూ కోతులను బెదిరించి తరిమివేస్తున్నాడు. ఎలుగుబంటి వేషంతో తన పంటకు కోతుల బెడద నుండి రక్షణ లభించిందని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. అయితే ఎలుగుబంటి వేషాధారణతో తిరుగుతున్న ఈ రైతుపై అప్పుడప్పుడు దాడులు కూడా తప్పడం లేదు. నిజమైన ఎలుగుబంటి అనుకుని పరిసర ప్రాంత రైతులు కొన్ని సమయాలలో దాడి చేసిన సందర్బాలు కూడా ఉన్నాయి.
వీడియో చూడండి..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




