AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EL Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. జాడలేని వరుణదేవుడు .. దుక్కిదున్ని ఎదురుచూస్తున్న రైతన్న..

మృగశిర ముగిసిన నైరుతి జాడలేదు?. వర్షాకాలం ప్రారంభమై రెండు వారాలు దాటినా.. తొలకరి పలకరింపు లేదు? జూన్ మాసం ముగుస్తుండడంతో.. రైతుల్లో కళ్లలో ఆనందం లేదు. ఎల్‌నినో ఎఫెక్ట్‌తో ఈఏడాది కరువు తప్పదంటుంది స్కైమేట్ . అసలు ఎల్‌నినో ఏంటీ? స్కైమేట్ వార్నింగ్ ఏంటో తెలుసుకుందాం.. 

EL Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. జాడలేని వరుణదేవుడు .. దుక్కిదున్ని ఎదురుచూస్తున్న రైతన్న..
El Nino Effect
Surya Kala
|

Updated on: Jun 19, 2023 | 6:36 AM

Share

ప్రతి ఏడాది మృగశిర ప్రారంభం నుంచి వర్షాలు ప్రారంభమవుతాయి. జూన్‌లో వర్షాలు ప్రారంభమై జూలై, ఆగస్టు మాసాల్లో అత్యధికంగా కురుస్తాయి. అలాంటిది ఈసారి మృగశిర ముగిసినా.. వర్షాలు కురవకపోగా.. 40 నుంచి 45 డిగ్రిల ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో జనం విలవిల లాడుతున్నారు. మరోవైపు దుక్కిదున్ని మేఘాల వైపు చినుకు జాడకోసం ఆశగా ఎదురుచూస్తున్నాడు రైతన్న. వర్షాలు ఆలస్యంగా కురిస్తే పంట దిగుబడులు తగ్గుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఈసారి కేరళను ఆలస్యంగా తాకాయి. ఇక పసిఫిక్ సముద్రంలో ఎల్ నీనో ఏర్పడం.. దీనికి తోడు అరేబియా సముద్రంలో తుఫాన్ ఏర్పడటంతో వర్షాలు కురిసే పరిస్థితి లేకుండా పోయిందంటున్నారు వాతావరణశాఖ అధికారులు. స్కై మెట్ అంచనా ప్రకారం జూలై మొదటి వారం తరవాతే దేశంలో వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. ఒకవేళ వర్షాలు కురిసినప్పటికీ మధ్య, పశ్చిమ భారతదేశంలో వర్షాభావ పరిస్థితులు ఎదురు కావచ్చని స్కైమెట్ అంచనా వేస్తోంది. ఈ ఏడాది అంతగా వర్షాలు కురవవని గతంలోనే ప్రభుత్వ వాతావరణ శాఖ వెల్లడించింది.

ఎల్ నినో అనేది ప్రతి 3 నుంచి 7 సంవత్సరాలకు ఒకసారి సంభవిస్తుంది. ఎల్ నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలో ఒక రకమైన కాలానుగుణ మార్పు. ఎల్ నినో చోటుచేసుకుంటే.. జూన్- అక్టోబర్ నెలల మధ్య మన దేశంలో రుతుపవనాలు ప్రభావితమై వీక్ అవుతాయి. తద్వారా వర్షాలు లేట్ అవుతాయి. ఎల్ నినో ఎఫెక్ట్ తో మనకు చలికాలం కూడా వెచ్చగా అనిపిస్తుంది. వేసవి కాలం మరింత వేడిగా మారుతుంది. గత 20 ఏళ్లలో సంభవించిన కరువులన్నీ ఎల్‌నినో సంవత్సరాల్లోనే చోటుచేసుకున్నాయి. ఇది కూడా ఎల్ నినో ఏడాది కావడంతో ఈసారి కూడా దాని ఎఫెక్ట్‌తో వ్యవసాయోత్పత్తులు తగ్గిపోయే ఛాన్స్ ఉంది. గత 65 ఏళ్లలో 14 సార్లు పసిఫిక్ మహాసముద్రంలో ఎల్ నినో ఏర్పడింది. అయితే 9 సార్లు భారతదేశంలో పెద్ద ఎత్తున కరువు వచ్చింది. 5 సార్లు మనదేశంలో కరువు వచ్చినా.. ఎల్ నినో ప్రభావం స్వల్పంగానే పడింది.

నిపుణుల అంచాన ప్రకారం తెలంగాణలో ఈ వేడి ప్రభావాన్ని కంట్రోల్ చేయాలంటే దాదాపు 5 కోట్ల మొక్కలు నాటాలని పర్యావరణ వేత్తలు అంచనా వేశారు. దీని బట్టి చూస్తే ఎంత మేర వాతావరణం మారింది అర్థం చేసుకోవచ్చు. మారుతున్న జీవన విధానానికి తోడు.. మనం యూజ్ చేస్తున్న వస్తువుల వల్ల వాతవరణం ద‌శాబ్ధ కాలంలో స‌గ‌టున భూతాపం 0.2 డిగ్రీల సెల్సియ‌స్‌తో వేడెక్కుతున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. 50 మంది ప్రఖ్యాత సైంటిస్టులు ఈ హెచ్చరిక చేశారు. 2013 నుంచి 2022 వ‌ర‌కు మాన‌వుల వ‌ల్ల క‌లుగుతున్న ప‌ర్యావ‌ర‌ణ మార్పులతో ఉష్ణోగ్రత‌లు పెరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..