AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana University: తెలంగాణ యూనివర్సిటీలో ప్రక్షాళన షురూ.. కీలక అధికారులపై వేటు..

Telangana University News: తెలంగాణ యూనివర్సిటీ కొన్నాళ్లుగా వివాదాలకు కేరాఫ్‌గా మారింది. వీసీ రవీందర్‌ గుప్తా నిర్ణయాలతో ప్రతిసారి వర్సిటీలో వివాదం రాజుకుంది. ఈ క్రమంలోనే.. పాలకమండలి సభ్యులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో వరుసగా ఈసీ సమావేశాలు జరిగాయి.

Telangana University: తెలంగాణ యూనివర్సిటీలో ప్రక్షాళన షురూ.. కీలక అధికారులపై వేటు..
Telangana University
Shaik Madar Saheb
|

Updated on: Jun 19, 2023 | 7:09 AM

Share

Telangana University News: తెలంగాణ యూనివర్సిటీ కొన్నాళ్లుగా వివాదాలకు కేరాఫ్‌గా మారింది. వీసీ రవీందర్‌ గుప్తా నిర్ణయాలతో ప్రతిసారి వర్సిటీలో వివాదం రాజుకుంది. ఈ క్రమంలోనే.. పాలకమండలి సభ్యులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో వరుసగా ఈసీ సమావేశాలు జరిగాయి. దాంతో.. వీసీ అధికారాలకు కత్తెర వేస్తూ తీర్మానాలు చేస్తూ వచ్చింది పాలకమండలి. మొదట రిజిస్ట్రార్‌ను తొలగించి.. ఆ తర్వాత ఆర్థిక అంశాలకు వీసీని దూరం చేసింది. వర్సిటీని చక్కదిద్దే బాధ్యతను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగిస్తూ తీర్మానించింది. అంతేకాదు.. ఈసీ లేఖతో ఇటీవల విజిలెన్స్‌ అధికారులు వర్సిటీలో తనిఖీలు చేపట్టారు. అన్నింటిపైనా పూర్తి నివేదిక సిద్ధం చేసి ఉన్నతాధికారులకు ఇచ్చారు. ఈ క్రమంలోనే.. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ఏసీబీ వలలో చిక్కారు వీసీ రవీందర్‌గుప్తా.

వీసీ రవీందర్‌గుప్తా ఏసీబీ పట్టుబడ్డ తర్వాత టీయూలోని అక్రమాలపై విచారణ వేగవంతమవుతోంది. ఇన్‌చార్జ్‌ రిజిస్ట్రార్లుగా నియమించబడ్డ ప్రొఫెసర్ విద్యావర్ధిని, కనకయ్యలను సస్పెండ్‌ చేయాలని వర్సిటీ పాలకమండలి తీర్మానం చేసింది. హైదరాబాద్‌లో ఈసీ సమావేశం జరగ్గా.. వీసీ రవీందర్‌గుప్తాను ఏసీబీ అరెస్ట్‌ చేయడంతో.. విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ చైర్మన్‌గా వ్యవహరించారు. వర్సిటీలో జరుగుతున్న పరిణామాలపై చర్చించి పలు తీర్మానాలు చేశారు. ఇన్‌చార్జ్‌ రిజిస్ట్రార్లు ప్రొఫెసర్ కనకయ్య, శివశంకర్, విద్యావర్ధినిపై కేసులు నమోదు.. ఏరియర్స్ పేరిట అక్రమంగా 10 లక్షలు తీసుకున్న కాంట్రాక్టు అధ్యాపకుడు శ్రీనివాస్‌ను, రాజేందర్ తీసుకున్న అడ్వాన్సుల మొత్తం వెంటనే రికవరీ.. ఇటీవల నిర్వహించిన అధ్యాపకుల క్యాస్ పదోన్నతులకు ఆమోదం.. వారికి రావాల్సిన ఏరియర్స్ చెల్లించడం.. అర్హత గల అధ్యాపకులకు రొటీన్‌గా క్యాస్ పదోన్నతులు కల్పించడం.. లాంటి కీలకాంశాలకు గ్రీన్‌ ఇచ్చింది పాలకమండలి. దాంతోపాటు.. 2021 నుంచి 2023 వరకు నిర్వహించిన పీహెచ్‌డీ అడ్మిషన్లపై ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపకుల చేత ఎంక్వైరీ చేయించాలని డిమాండ్‌ చేస్తోంది.

వాస్తవానికి.. వీసీగా నియామకమైన నాటి నుంచే రవీందర్‌గుప్తా వ్యవహారం వివాదాస్పదమవుతోంది. 100కి పైగా అక్రమ ఉద్యోగాలు సృష్టించి భారీగా వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. అటు.. తెలంగాణ ప్రభుత్వంతోపాటు.. ఉన్నత విద్యాశాఖ అధికారి నవీన్‌మిట్టల్‌పైనా విమర్శలు చేశారు రవీందర్‌గుప్తా. కొన్నాళ్లుగా ఆయన తీరును వ్యతిరేకిస్తూ.. సిబ్బందితోపాటు విద్యార్థి, ప్రజా సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. వీసీపై పెద్దయెత్తున అవినీతి ఆరోపణలు వ్యక్తమైనా ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు. కానీ.. సడెన్‌గా.. లంచం తీసుకుంటూ వీసీ రవీందర్‌గుప్తా ఏసీబీకి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుపడటంతో వర్శిటీలో ప్రక్షాళన స్టార్ట్‌ అయింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..