AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fertility Fraud: సృష్టి ఫైల్స్.. తవ్వేకొద్దీ వెలుగులోకి సృష్టి అరాచకాలు.

ఆమె డాక్టరా లేక అక్రమార్జన రుచి మరిగిన మోసగత్తెనా? సృష్టి టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌ అరాచకం.. రెండు రాష్ట్రాలకే పరమితం అనుకున్నాం ఇప్పటిదాకా. కాదు.. డాక్టర్‌ నమ్రత మోసాలు దేశవ్యాప్తం. రాజస్తాన్‌ దంపతులకు సంతాన సాఫల్యం చేయిస్తానని చెప్పి అస్సాం దంపతులను పట్టుకొచ్చింది. పశ్చిమ బెంగాల్‌లో గతంలో ఓ కేసు నమోదైంది. దందా అంతా విశాఖ కేంద్రంగా జోరుగా సాగుతోంది కదా.. వ్యాపారాన్ని ఒరిస్సాకి కూడా విస్తరించింది. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి.. అసలు డాక్టర్ నమ్రత అడుగుపెట్టని జిల్లానే లేదేమో. అండం బయటకు తీసి, దానికి శుక్ర కణాలు కలిపి, మళ్లీ దాన్ని గర్భంలో ప్రవేశపెట్టి... ఇంత ప్రయాస ఎందుకనుకుందో ఏమో గానీ.. ఏకంగా బిడ్డనే చేతిలో పెడతాం అంటూ ట్రాప్‌ చేయడం మొదలుపెట్టింది. ఇలా ఎంత మంది పసిపిల్లల అమ్మకాలు జరిపిందో. అసలు... దంపతుల నుంచి అండం, వీర్యం సేకరించి.. పుట్టేది మీ బిడ్డే అని ఆ దంపతులను నమ్మించి.. వేరే ఎవరికో పుట్టిన బిడ్డను తీసుకొచ్చి చేతిలో పెట్టేది. ఇలా చెప్పుకుంటూ పోతే.. అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. బయటపడింది కాబట్టి సృష్టి టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌ పేరు వినబడుతోంది. అసలు ఎక్కడెక్కడ ఎంతెంత దందా జరుగుతోందో ఎవరికి తెలుసు? పుట్టింది తమ రక్తం పంచుకుపుట్టిన బిడ్డ అనే గ్యారెంటీ లేకుండా చేశాక.. ఫెర్టిలిటీ, సరోగసి సెంటర్లపై ఇక నమ్మకం ఎలా ఉంటుంది? ఐవీఎఫ్, సరోగసి పేరు మీద ఇంత దందా జరుగుతుంటే ప్రభుత్వ ఫోకస్‌ ఎటుపోయింది? కంప్లీట్ డిటైల్స్‌....

Fertility Fraud: సృష్టి ఫైల్స్.. తవ్వేకొద్దీ వెలుగులోకి సృష్టి అరాచకాలు.
Fertility Fraud
Ram Naramaneni
|

Updated on: Jul 28, 2025 | 9:55 PM

Share

అమ్మ అనే పిలుపు కోసం ఎంతమంది ఆరాటపడుతున్నారో ఈ రోజుల్లో. ఏ దారీ లేనప్పుడు IVF సెంటర్లకే వెళ్తారు దంపతులు. అక్కడ ఒక్కో టెస్ట్‌ చేస్తుంటేనే ఆశలు పుట్టుకొచ్చేస్తాయి. ఎందుకీ టెస్టులు, దానికయ్యే వేలకు వేల ఖర్చును పట్టించుకోరసలు. త్వరలో అమ్మనాన్న అయిపోతున్నాం అనే ఆనందం మాత్రమే కనిపిస్తుంది వారిలో. కాని, ఆ టెస్టులన్నీ ఒట్టి హంబక్‌ మాత్రమే. కేవలం దంపతులను ఏమార్చడానికి చేసే ఉత్తుత్తి పరీక్షలంతే. టెస్టుల పేరుతో వేలకు వేలు గుంజి.. వేరే వాళ్ల కడుపులో పెరిగేది వాళ్ల బిడ్డే అని నమ్మించి.. ఎంత మందిని మోసం చేసిందో డాక్టర్‌ నమ్రత. బెస్ట్‌ ఐవీఎఫ్‌ సెంటర్‌ ఇన్‌ ఇండియా. సృష్టి టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌కు ఆన్‌లైన్‌లో కనిపించే ట్యాగ్‌లైన్‌ ఇది. అసలు ఎవరిచ్చారు బెస్ట్‌ అనే బిరుదు. వాళ్లకు వాళ్లే బెస్ట్‌ అనే ముద్ర వేసుకుని, ఆన్‌లైన్‌లో ప్రచారం చేయించుకుని, పిల్లలు కలగాలని ఆరాటపడుతున్న వాళ్లను రప్పించుకుంటున్నారు. రాజస్తాన్‌ దంపతులు అలా వచ్చిన వాళ్లే. ఆన్‌లైన్‌లో డాక్టర్‌ నమ్రత బిల్డప్‌ చూసి సృష్టి టెస్ట్‌ ట్యూబ్ బేబీ సెంటర్‌కు వచ్చినవాళ్లే. బట్… నమ్రత హిస్టరీకి మరో షేడ్‌ కూడా ఉంది. ఎన్నెన్ని కంప్లైంట్లు, కేసులు, అరాచకాలో గతంలో. దాదాపు 15 ఏళ్లుగా చేస్తున్న మోసాలు ఎప్పటికప్పుడు వెలుగు చూస్తూనే ఉన్నాయి. మోసపోయిన దంపతులు కంప్లైంట్‌ చేయడం, అవి అరెస్టుల వరకు వెళ్లడం, జైలుకెళ్లి రావడం. షరా మామూలే నమ్రతకి. తన పలుకుబడిని...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి