AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుషాయిగూడలో మిస్సింగ్‌.. దుర్గం చెరువులో తేలిన డెడ్‌బాడీ! ఏం జరిగిందో..

మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గం చెరువులో మృతదేహం కలకలం రేపింది. ఈ రోజు ఉదయం దుర్గం చెరువులో మృతుదేహం తేలడంతో మాదాపూర్ పోలీసులకు సమాచారం ఇచ్చిన లేక్ పోలీసులు. మృతుడిని కుషాయిగూడ సైనిక్ పూరికి చేందిన దుర్గా ప్రసాద్ (36)గా పోలీసులు గుర్తించారు..

కుషాయిగూడలో మిస్సింగ్‌.. దుర్గం చెరువులో తేలిన డెడ్‌బాడీ! ఏం జరిగిందో..
Dead Body In Durgam Lake
Srilakshmi C
|

Updated on: Jul 28, 2025 | 8:03 PM

Share

హైదరాబాద్, జులై 28: హైదరాబాద్ కుషాయిగూడలో అదృశ్యమైన వ్యక్తి అనూహ్యంగా దుర్గం చెరువులో శవమై తేలడం కలకలం రేపింది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గం చెరువులో ఆదివారం (జులై 27) ఉదయం మృతుదేహం లభ్యమైంది. దుర్గం చెరువులో మృతుదేహం తేలడంతో మాదాపూర్ పోలీసులకు.. లేక్ పోలీసులు సమాచారం ఇచ్చారు. దీంతో చెరువు దగ్గరికి వెళ్లిన పోలీసులు డెడ్ బాడీని బయటకు తీశారు. మృతుడిని కుషాయిగూడ సైనిక్ పూరికి చేందిన దుర్గా ప్రసాద్ (36)గా పోలీసులు గుర్తించారు.

జులై 25న ఇంటి నుంచి వెళ్లిన దుర్గా ప్రసాద్.. రెండు రోజులు గడుస్తున్నా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు జులై 26వ తేదీన కుషాయిగూడలో మిస్సింగ్ కేసు నమోదైంది. సైనిక్ పూరిలో RD Pro ఈవేంట్స్ నిర్వహిస్తున్న దుర్గ ప్రసాద్.. వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకి తరలించారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

మరోవైపు కనిపించకుండా పోయిన దుర్గా ప్రసాద్ చెరువులో శవమై తేలడంతో మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అతడిది ఆత్మహత్య కాదని ఎవరో చంపి ఉంటారని పోలీసులకు విన్నవించారు. దీంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..