AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NEET PG 2025 Exam: ఆగస్టు 3న ఒకే షిఫ్టులో నీట్‌ పీజీ ఎంట్రన్స్‌ పరీక్ష.. మరో 3 రోజుల్లోనే అడ్మిట్‌ కార్డులు విడుదల

మెడికల్ కాలేజీల్లో పోస్టు గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నీట్‌ పీజీ 2025 పరీక్ష మరో వారంలో నిర్వహించనున్నారు. ఈ క్రమంలో నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎన్‌బీఈఎంఎస్‌) చకచకా ఏర్పాట్లు చేస్తుంది. దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆగస్టు 3న నీట్‌ పీజీ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు..

NEET PG 2025 Exam: ఆగస్టు 3న ఒకే షిఫ్టులో నీట్‌ పీజీ ఎంట్రన్స్‌ పరీక్ష.. మరో 3 రోజుల్లోనే అడ్మిట్‌ కార్డులు విడుదల
NEET PG 2025 Entrance Exam
Srilakshmi C
|

Updated on: Jul 28, 2025 | 7:18 PM

Share

హైదరాబాద్‌, జులై 28: దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో పోస్టు గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నీట్‌ పీజీ 2025 పరీక్ష మరో వారంలో నిర్వహించనున్నారు. ఈ క్రమంలో నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎన్‌బీఈఎంఎస్‌) చకచకా ఏర్పాట్లు చేస్తుంది. దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆగస్టు 3న నీట్‌ పీజీ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ రోజున ఉదయం 9 గంటల నుంచి 12.30 గంటల వరకు జరిగే ఈ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షకు 4 రోజుల ముందు అంటే జులై 31వ తేదీన అడ్మిట్‌ కార్డులను వెబ్‌సైట్‌లోకి అందుబాటులోకి తీసుకువస్తారు.

పరీక్ష రోజున విద్యార్థులను 45 నిమిషాలకు ముందే ఎగ్జామ్‌ సెంటర్లలోకి అనుమతిస్తారు. దేశవ్యాప్తంగా దాదాపు 2 లక్షల మందికిపైగా విద్యార్థులు నీట్‌ పీజీ రాయనున్నారు. తెలంగాణ నుంచి సుమారు 10 వేల మంది రాసే అవకాశం ఉన్నట్లు అంచనా. ఇందుకోసం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌ సహా మొత్తం 10 పరీక్ష కేంద్రాలను ఎంపిక చేశారు. పరీక్షల అనంతరం సెప్టెంబర్‌ 3 నాటికి ఫలితాలను విడుదల చేయనున్నట్లు మెడికల్‌ బోర్డు తెలిపింది. వాస్తవానికి జూన్‌ 15న రెండు షిఫ్టుల్లో ఈ పరీక్ష జరగాల్సి ఉండగా.. ఒకే షిఫ్టులో నిర్వహించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ఎన్‌బీఈఎంఎస్‌ ఆగస్టు 3కు పరీక్షను వాయిదా వేసింది. గతేడాది దేశంలోని అన్ని మెడికల్‌ కాలేజీల్లో మొత్తం 25,791 సీట్లను కేటాయించారు.

నీట్‌ పీజీ 2025 అడ్మిట్ కార్డుల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
9వ తరగతి విద్యార్థులకు ఇస్రో యువికా 2026 ఆహ్వానం.. డైరెక్ట్ లింక్
9వ తరగతి విద్యార్థులకు ఇస్రో యువికా 2026 ఆహ్వానం.. డైరెక్ట్ లింక్
మ‌హావ‌తార్ నరసింహను బీట్ చేసే రేంజ్‌లో మరో యానిమేషన్ సినిమా
మ‌హావ‌తార్ నరసింహను బీట్ చేసే రేంజ్‌లో మరో యానిమేషన్ సినిమా
సకల శుభాలను తెచ్చే.. స్కంద షష్టి వ్రతం ఎలా చేయాలో తెలుసా..?
సకల శుభాలను తెచ్చే.. స్కంద షష్టి వ్రతం ఎలా చేయాలో తెలుసా..?
భారత్- దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా? వెదర్ రిపోర్ట్
భారత్- దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా? వెదర్ రిపోర్ట్
మీ డబ్బును ఒకే బ్యాంక్‌లో పెడుతున్నారా?
మీ డబ్బును ఒకే బ్యాంక్‌లో పెడుతున్నారా?
మీరు SBIలో రూ.50 లక్షల హోమ్‌ లోన్‌ తీసుకుంటే EMI ఎంత కట్టాలి?
మీరు SBIలో రూ.50 లక్షల హోమ్‌ లోన్‌ తీసుకుంటే EMI ఎంత కట్టాలి?
కూతురిని పరిచయం చేసిన బిగ్ బాస్ అర్జున్ అంబటి.. ఎమోషనల్ పోస్ట్
కూతురిని పరిచయం చేసిన బిగ్ బాస్ అర్జున్ అంబటి.. ఎమోషనల్ పోస్ట్
పెట్రోల్‌ vs ఎలక్ట్రిక్‌.. ఏ కారు కొంటే మంచిది?
పెట్రోల్‌ vs ఎలక్ట్రిక్‌.. ఏ కారు కొంటే మంచిది?
వైట్ లేదా బ్రౌన్ రైస్.. తర్వగా బరువు తగ్గేందుకు ఏది బెస్ట్!
వైట్ లేదా బ్రౌన్ రైస్.. తర్వగా బరువు తగ్గేందుకు ఏది బెస్ట్!
నెలకు రూ.2 లక్షల జీతంతో కేంద్ర ప్రభుత్వ శాఖలో ఉద్యోగాలు.. లింక్‌
నెలకు రూ.2 లక్షల జీతంతో కేంద్ర ప్రభుత్వ శాఖలో ఉద్యోగాలు.. లింక్‌