Telangana News: బిడ్డ పుట్టిందని ఆటో డ్రైవర్లకు ఊహించని గిఫ్ట్.. ఏంటా అని బాక్స్ ఓపెన్ చేసి చూడగా..
జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూరు గ్రామానికి చెందిన ఒగలపు అజయ్ అనే దంపతులకు ఇటీవల ఆడపిల్ల జన్మించింది. ఆడపిల్ల జన్మించడంతో ఈ కుటుంబం ఎంతో అనందంతో వేడుకలు నిర్వహించారు.
ఇప్పటికి అమ్మాయిల పట్ల వివక్ష కొనసాగుతుంది. అమ్మాయి జన్మిస్తే తల్లిదండ్రులు కాస్తా బాధగానే ఉంటున్నారు. ఇప్పటికీ అమ్మాయిలని భారంగానే భావిస్తున్నారు. ఓ యువకుడు మాత్రం అమ్మాయి జన్మిస్తే ఎగిరి గంతేసాడు. అంతేకాకుండా ఊరంతా వేడుకలు నిర్వహించాడు.
జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూరు గ్రామానికి చెందిన ఒగలపు అజయ్ అనే దంపతులకు ఇటీవల ఆడపిల్ల జన్మించింది. ఆడపిల్ల జన్మించడంతో ఈ కుటుంబం ఎంతో అనందంతో వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలను ఇంటికే పరిమితం చేయలేదు. గ్రామస్థులందరితో కూడా తమ అనందాన్ని పంచుకున్నారు. కేవలం స్వీట్లు పంపిణీ చేసి ఊరుకోలేదు. గ్రామంలో ఉన్న పదిహేను వందల మంది మహిళలకి చీరెలను అజయ్ దంపతులు పంపిణీ చేశారు. గ్రామంలో ఏ మహిళలని వదిలి పెట్టకుండా ప్రతి మహిళ దగ్గరికి వెళ్ళి ఈ చిరుకానుకను అందించారు. అమ్మాయిల పట్ల ఉన్న ప్రేమను ఈ విధంగా చాటారు. అంతేకాకుండా మహిళలందరు కూడా ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గోని మనస్ఫూర్తిగా ఆ చిన్నారిని దీవించారు. కేవలం మహిళలకే కాకుండా ఆ గ్రామంలో అటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నా అటోడ్రైవర్లకి రూ.14వేల విలువగల సెల్ ఫోన్ అందించారు. అడపిల్లల పట్ల వివక్ష ఉండకూడదని ప్రతిఒక్కరూ ఆడపిల్లల పట్ల గౌరవంగా ఉండేందుకే ఈ కార్యక్రమం నిర్వహించినంచినట్లు అజయ్ చెప్తున్నాడు. గ్రామస్థులు అందరూ కూడా అజయ్‌ని అభినందిస్తున్నారు. మారుమూల ప్రాంతాలలో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడంతో కొత్త చర్చకి దారి తీసింది. అధునికంగా అడుగులు వేస్తున్న భ్రూణహత్యలు జరగడం అత్యంత దారుణమైనా విషయం.మాత్రం ప్రజలని చైతన్య పరిచేందుకు అమ్మాయిల పట్ల విపక్ష లేకుండా ఈ కార్యక్రమం దోహదపడుతుందని అజయ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి