Telangana: బతుకమ్మ వేడుకల్లో డీజే టిల్లు సాంగ్‌కి డీహెచ్ స్టెప్పులు.. మరోసారి బ్యానర్ ఐటమ్
వేడుకల్లో బతుకమ్మ పాటలకు బదులు డీజే టిల్లు మూవీలో సాంగ్స్ వేశారు. దానికి డీహెచ్ హుషారుగా స్టెప్పులేశారు. ఇదే ఇప్పుడు వివాదంగా మారింది.
తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ మరోసారి బ్యానర్ ఐటమ్‌గా మారిపోయారు. ఈసారి డీజే టిల్లు(DJ Tillu) సాంగ్‌తో డీహెచ్ హోరెత్తించారు. తీన్మార్ స్టెప్పులతో ఇరగదీశారు. సాదాసీదా ప్రైవేట్ ఫంక్షన్ అయితే ఫర్వాలేదు. కానీ ఆయన చేసింది బతుకమ్మ వేడుకల్లో. అక్కడ అందుకోవాల్సిన రాగమేంటి.. చేయాల్సిన నృత్యమేంటంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem district)లోని శ్రీనగర్ కాలనీలో డీఎస్‌ఆర్ క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలో పాల్గొన్నారు డీహెచ్( Director of Public Health) శ్రీనివాస్. సాధారణంగా ఇలాంటి ఈవెంట్లలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో లాంటి పాటలు వినిపిస్తాయి. మహిళలంతా బతుకమ్మల చుట్టూ చేరి చప్పట్లు కొడుతూ పాటలు పాడుతుంటారు. కానీ ఇక్కడ సీన్ రివర్సయింది. బతుకమ్మ పాటలకు బదులు డీజే టిల్లు మూవీలో సాంగ్స్ వేశారు. దానికి డీహెచ్ హుషారుగా స్టెప్పులేశారు. ఇదే ఇప్పుడు వివాదంగా మారింది.
గతంలో డీహెచ్ శ్రీనివాస్ తాంత్రిక పూజల్లో పాల్గొనడంపై కూడా విమర్శలొచ్చాయి. తనకు తాను దేవతగా ప్రకటించుకున్న ఎంపీపీ విజయలక్ష్మి ఓ హోమాన్ని ఏర్పాటు చేశారు. అక్కడికి వెళ్లిన డీహెచ్ ఆమె చుట్టూ.. హోమం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. పూజలపై అప్పడే స్పందించిన డీహెచ్… తాను క్షుద్రపూజల్లో పాల్గొనలేదని మాత్రం వివరణ ఇచ్చారు. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ అంటే బాధ్యతాయుతమైన పదవి. ప్రజలకు వైద్య విజ్ఞానాన్ని పంచాల్సిన వ్యక్తి. అలాంటి ఉన్నతాధికారి పూజల వ్యవహారం ప్రజలను ఆశ్చర్యంలో పడేసింది. ఈ వ్యవహారంపై కూడా డీహెచ్‌ను ఇరకాటంలోకి నెట్టివేసింది. మొత్తానికి డీహెచ్ ఏం చేసినా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..