Telangana: తెలంగాణ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్… TRSకు కటిఫ్ చెప్పిన ప్రశాంత్ కిశోర్..!

తెలంగాణ రాజకియాల్లో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. టీఆర్‌ఎస్‌తో దోస్తీకి ప్రశాంత్ కిశోర్ కటీఫ్ చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Telangana: తెలంగాణ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్... TRSకు కటిఫ్ చెప్పిన ప్రశాంత్ కిశోర్..!
Telangana CM KCR, Political Strategist Prashant Kishor
Follow us

|

Updated on: Sep 26, 2022 | 3:18 PM

తెలంగాణ రాజకీయాల్లో రోజురోజుకు వేడి పెరుగుతుంది. జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్(CM KCR) ఫోకస్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు మునుగోడు ఉపఎన్నికను సెమీ ఫైనల్ కింద భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఊహించని పొలిటికల్ అప్‌డేట్ ఒకటి వచ్చింది. టీఆర్‌ఎస్‌(TRS)తో దోస్తీకి ప్రశాంత్‌ కిశోర్‌ కటీఫ్ చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. గతంలో కేసీఆర్‌తో వరుసగా భేటీ అయిన ప్రశాంత్ కిషోర్(Prashant Kishor ).. కొద్ది రోజులుగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు.  జాతీయ స్థాయిలో టీఆర్‌ఎస్‌తో కలిసి పని చేసేందుకు ఆయన విముఖత చూపినట్లు తెలుస్తుంది.  రాష్ట్రం వరకే పనిచేస్తామని ఐప్యాక్‌ చెప్పినట్లు సమాచారం. కానీ రాష్ట్ర స్థాయిలో సేవలపై  టీఆర్‌ఎస్ ఆసక్తి కనబరచడం లేదు.  కాంగ్రెస్‌తో కలిసిన బీజేపీ వ్యతిరేక కూటమి కోసం ప్రశాంత్ కిషోర్ జాతీయ స్థాయిలో పనిచేయనున్నారు.

పొలిటికల్‌ స్పీడ్‌ పెంచిన కేసీఆర్

మెయిన్ ఎలక్షన్స్ టార్గెట్ గా టీఎర్ఎస్ చీఫ్ కేసీఆర్.. పొలిటికల్ స్పీడ్ పెంచారు. మైండ్ గేమ్ తో ప్రత్యర్ది పార్టీలను ఉక్కిరి బిక్కిరిచేసే వ్యూహాలకు పదును పెట్టారు. రాష్ట్రంలో మూడో సారి గెలుపే లక్ష్యంగా వరాల జల్లులు కురిపిస్తున్నారు. ఇప్పటి నుంచే హామీల వరద పారిస్తున్నారు. గత ఎన్నికల్లో రైతు బంధు పథకంతో బంపర్ విక్టరీ కొట్టిన కేసీఆర్..ఈ దఫా దళిత, గిరిజన వర్గాల పై ఫోకస్ పెట్టారు. ఆ వర్గాల ప్రజలను మచ్చిక చేసుకునే వ్యూహాలకు పదును పెట్టారు. అందులో భాగంగా ఇన్నాళ్లు కేంద్రం కోర్టులో పెట్టిన.. గిరిజనులకు పది శాతం రిజర్వేషన్ల పథకాన్ని..ఇకపై తామే అమలు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. అంతేకాదు దళిత బంధు తరహాలోనే భూమిలేని గిరిజనులకు గిరిజన బంధు సైతం ఇస్తామంటున్నారు.. పదిశాతం రిజర్వేషన్ల అమలుకు సంబంధించి వారం రోజుల్లో జీఓ తీసుకువస్తామని కూడా చెప్పారు. దీంతో ఆదివాసి బంజారాలు తనకు జై కొట్టేలా ప్లాన్ చేశారు. తన ప్రణాళిక కచ్చితంగా సక్సెస్ అవుతుందని అంచనా వేస్తున్నారు కేసీఆర్

గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఏడేళ్ల క్రితం అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. అప్పటి నుంచి రిజర్వేషన్‌ బాల్‌ కేంద్రం కోర్టులోనే ఉంది..కానీ ప్రస్తుతం ప్రతిపక్షాలు గిరిజన రిజర్వేషన్లపై కేసీఆర్ ను నిలదీస్తున్నాయి. ఇక దళిత బంధు పై కూడా విమర్శలకు పదును పెట్టాయి. దీంతో..కేసీఆర్‌ అలెర్ట్‌ అయ్యారు. ఇప్పటికే దళితుల కోసం దళిత బంధు ప్రవేశ పెట్టినా అందరికీ ఏక కాలంలో ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతోంది. దాంతో ఇప్పటికే ఒక్కో నియోజక వర్గంలో ఐదు వందల మందికి దళిత బందు అందజేసిన ప్రభుత్వం వచ్చే డిసెంబర్ నాటికి మరో ఐదు వందల మందికి ప్రతీ నియోజక వర్గంలో ఇస్తామని చెబు తున్నారు. అదేవిధంగా..జనవరి నుంచి మార్చి వరకు ఇంకో ఐదు వందల మందికి ఇచ్చేలా నిర్ణయించారట. దీంతో..కేసీఆర్‌ నిర్ణయాలు..పథకాల అమలుపై హాట్‌హాట్‌ చర్చలు జరుగుతున్నాయి.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత నుంచి గట్టెక్కించే ప్రయత్నాలు గులాబీ బాస్ మొదలు పెట్టారని ప్రగతి భవన్‌ టాక్.. ఓ వైపు రాష్ట్రంలో దూసుకొస్తున్న బిజెపి దళిత, గిరిజన, ఆదివాసీలను అక్కున చేర్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే కొన్ని నియోజక వర్గాల్లో ఆ వర్గాలపై పోకస్ పెట్టింది. కాంగ్రెస్‌ సైతం.. గత ఎన్నికల్లో రిజర్వు సీట్లలో మంచి రిజల్టే సాధించింది. హస్తం పార్టీ మొత్తం 19స్థానాలు గెలిస్తే అందులో ఐదు ఎస్టీ, రెండు ఎస్సీ స్థానాలే..ఇవన్నీ లెక్కలేసుకున్న తర్వాతే..పెద్దబాస్‌ ఫోకస్‌ ఆ రెండింటిపై పడిందంటున్నారు.. అందుకే ఏడేళ్ల నుంచీ పెండింగ్ లో ఉన్న రిజర్వేషన్ల అంశాన్ని తెరమీదికి తెచ్చి వాటిని తమ ప్రభుత్వమే అమలు చేస్తుందని ప్రకటించారని అనుమానిస్తున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్లు కేంద్రంలోని బిజెపిని ఇరికించడంతో పాటు రిజర్వ్ స్థానాల్లో ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతను పోగొట్టేలా కేసీఆర్ సరికొత్త రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నారట. మొత్తానికి వచ్చే ఎన్నికల్లోగా కేసీఆర్ ఇంకా ఎన్ని అస్త్రాలు సంధిస్తారోనన్న చర్చ.. ఇటు స్వపక్షంలో..అటు ప్రతిపక్షాల్లో సీరియస్‌గా డిస్కషన్‌ జరుగుతోంది. ఓట్లను వేటాడాలంటే ఆమాత్రం వ్యూహాలు తప్పవు కదా అని మరికొందరి అభిప్రాయం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..