Basara IIIT: మంత్రి కేటీఆర్‌ను మీట్ అవ్వాలంటే ఆపని చేయాల్సిందే.. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకి ఝలక్..

Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకి పాలకమండలి ఝలక్ ఇచ్చింది. డిమాండ్ల సాధన కోసం ఏర్పడిన స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్ రద్దు చేసుకుంటేనే..

Basara IIIT: మంత్రి కేటీఆర్‌ను మీట్ అవ్వాలంటే ఆపని చేయాల్సిందే.. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకి ఝలక్..
Basara Iiit
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 26, 2022 | 1:48 PM

Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకి పాలకమండలి ఝలక్ ఇచ్చింది. డిమాండ్ల సాధన కోసం ఏర్పడిన స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్ రద్దు చేసుకుంటేనే మంత్రి కేటీఆర్‌ను కలిసే అవకాశం కల్పిస్తామని మెలిక పెట్టింది. విద్యార్థులు మాత్రం అందుకు ససేమిరా అంటున్నారు. మంత్రిని కలిసే ఛాన్స్ ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. మరోవైపు పోలీసులు మాత్రం క్యాంపస్ ప్రాంగణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

12 డిమాండ్లు పరిష్కారించాలంటూ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు జూన్‌లో వారం రోజుల పాటు ఆందోళనకు దిగారు. క్యాంపస్‌లో జరిగిన నిరసన కార్యక్రమాలన్నింటిని స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్‌ లీడ్ చేసింది. ఇప్పుడా ఎస్జీసీ సభ్యులను మంత్రి కేటీఆర్‌తో కలవనీయబోమంటోంది పాలకవర్గం. విద్యార్థులు మాత్రం కచ్చితంగా కలిసే తీరుతామంటున్నారు. దీంతో మంత్రి టూర్‌లో ఎలాంటి మార్పులు చేర్పులు జరుగుతాయన్న టెన్షన్ నెలకొంది.

ఇదిలాఉంటే.. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు పిలుస్తున్నారు.. మంత్రి కేటీఆర్‌ వెళ్తున్నారు. ఇక తమ డిమాండ్లు పరిష్కారం అవుతాయని విద్యార్థులు చాలా కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. ఇకపై క్యాంపస్‌లో హ్యాపీడేసేనన్న ధీమాతో ఉన్నారు. ట్రిపుల్ ఐటీని సందర్శించనున్న కేటీఆర్‌.. వాళ్లతో ప్రత్యేకంగా సమావేశమై సమస్యల్ని అడిగి తెలుసుకోనున్నారు. ఆ తర్వాత వాళ్లతో కలిసి భోజనం చేస్తారు. 12 డిమాండ్ల సాధనే లక్ష్యంగా జూన్ 14 నుంచి వారం రోజుల పాటు ఆందోళనకు దిగారు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు.

ఇవి కూడా చదవండి

విద్యార్థుల డిమాండ్లివే..

1. ట్రిపుల్ ఐటీకి సీఎం రావాలి లేదంటే మంత్రి కేటీఆర్‌ ఐనా రావాలని ప్రధానంగా డిమాండ్‌ చేశారు.

2. వీసీ నియామకం అలాగే ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

3. ICT బేస్డ్‌ స్టడీ.

4. ఫ్యాకల్టీ నిష్పత్తిలో ప్రొఫెసర్ల కేటాయింపు.

5. PUC బ్లాక్‌, హాస్టళ్ల రీ ఇన్నోవేషన్.

6. లైబ్రరీలో కనీస మౌలిక సదుపాయాలు.

7. యూనిఫామ్స్‌, బెడ్స్‌, బ్లాంకెట్స్‌.

8. హాస్టల్‌లో వసతి సౌకర్యాలు.

9. మెస్ మెరుగవ్వాలి.

10. క్యాంటిన్ల నిర్వహణ మారాలి.

11. స్పోర్ట్స్ PET, PED భర్తీ.

12. విద్యా, ఉద్యోగ అవకాశాల్లో సహకారం.

ఈ సమస్యలు పరిష్కరించాలంటూ జూన్ 14 న ఆందోళనకు దిగారు విద్యార్థులు. ఎండనక, వాననక వారం రోజుల పాటు క్యాంపస్‌లో కాక పుట్టించారు. ఆ క్రమంలోనే మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యార్థులతో చర్చలు జరిపారు. సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మరుసటి రోజు క్లాస్‌లకు హాజరయ్యారు. మంత్రి సబితా హామీలు మాత్రం పరిష్కారం కాలేదు. ఇప్పుడు మంత్రి కేటీఆర్‌ క్యాంపస్‌కి వస్తుండటంతో విద్యార్థుల్లో ఆశలు చిగురించాయి. తమ డిమాండ్ల పరిష్కారంపై కేటీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరిస్తారని ఆశాభావంతో ఉన్నారు. ఇక మంత్రి కేటీఆర్‌ రాకతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. క్యాంపస్ పరిసరాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అలాగే ట్రిపుల్ ఐటీ ఎదురుగా బారికేడ్లను ఏర్పాటు చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..