Challenge: ఉద్యోగులకు కంపెనీ బంపర్ ఆఫర్.. అలా చేస్తే ‘బోనస్‌’తో పాటు రూ.10 లక్షల రివార్డు..

Fitness Challenge: చాలా కంపెనీలు తమ ఉద్యోగులను ప్రోత్సహించడానికి మంచి ప్రతిభను కనబరిచే వారికి వివిధ రకాల అదనపు ప్రోత్సాహకాలను అందిస్తుంటాయి.

Challenge: ఉద్యోగులకు కంపెనీ బంపర్ ఆఫర్.. అలా చేస్తే ‘బోనస్‌’తో పాటు రూ.10 లక్షల రివార్డు..
Fitness Challenge
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 25, 2022 | 9:07 PM

Fitness Challenge: చాలా కంపెనీలు తమ ఉద్యోగులను ప్రోత్సహించడానికి మంచి ప్రతిభను కనబరిచే వారికి వివిధ రకాల అదనపు ప్రోత్సాహకాలను అందిస్తుంటాయి. అయితే, ఓ కంపెనీ మాత్రం తమ ఉద్యోగులకు వినూత్నమైన ఛాలెంజ్ విసిరింది. ఆ ఛాలెంజ్‌ను బీట్ చేసిన వారికి బోనస్‌తో పాటు భారీ నజరానా కూడా ప్రకటించింది. Zerodha కంపెనీ తమ ఉద్యోగుల ఫిట్‌నెస్‌కు సంబంధించి ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఉద్యోగులకు ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు కంపెనీ ఫిట్‌నెస్ ఛాలెంజ్‌ విసిరింది. ఈ ఫిట్‌నెస్ ఛాలెంజ్‌ని పూర్తి చేసిన ఉద్యోగికి కంపెనీ 1 నెల జీతం బోనస్, రూ. 10 లక్షల రివార్డును అందజేస్తుందిన జెరోధా చీఫ్ ప్రకటించారు.

ఫిట్‌నెస్ ట్రాకర్‌తో లక్ష్య నిర్దేశం..

ఇవి కూడా చదవండి

ఫిట్‌సెన్ లక్ష్యాన్ని సాధించడానికి కంపెనీ ఫిట్‌నెస్ ట్రాకర్‌లో రోజువారీ కార్యాచరణ లక్ష్యాలను సెట్ చేసుకోవాలని ఉద్యోగులకు సూచించింది సంవత్సరంలో 90 శాతం రోజులు కంపెనీ నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేసిన ఉద్యోగికి ఒక నెల జీతం బోనస్, రూ. 10 లక్షల రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది.

ట్విట్టర్ ద్వారా ప్రకటన..

జెరోధా కంపెనీ తన ఉద్యోగులకు మళ్లీ హెల్త్ ఛాలెంజ్ ఇవ్వబోతోందని కంపెనీ హెడ్ నితిన్ కామత్ ట్వీట్ చేశారు. ఫిట్‌నెస్ ట్రాకర్‌లో మీ రోజువారీ లక్ష్యాలను సెట్ చేసుకుని, పూర్తి చేయడం ద్వారా కంపెనీ ప్రకటించిన రివార్డ్‌లను పొందవచ్చు. అయితే, ఈ ఛాలెంజ్ ఐచ్ఛికం అని కామత్ స్పష్టం చేశారు. ఛాలెంజ్‌లో భాగంగా ఉద్యోగులు రోజుకు కనీసం 350 కేలరీలు బర్న్ చేయాలి. ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు ఇంటి నుండి పని చేస్తున్నందున కంపెనీ ఈ ఛాలెంజ్ ఇచ్చింది. వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా ఇంట్లో కూర్చోవడం వల్ల చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. ఈ క్రమంలో ఉద్యోగులను యాక్టివ్‌గా ఉంచేందుకు ఈ రకమైన ఫిట్‌నెస్ ఛాలెంజ్ ప్రారంభించింది కంపెనీ.

మరిన్ని హ్యూమన్‌ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..