Weight Loss Tips: జామ ఆకులతో నిజంగా బరువు తగ్గుతామా?.. జరుగుతున్న ప్రచారంలో నిజమెంతా..
జామపండు రుచిని ఎవరు ఇష్టపడనివారు ఉండరు. అదే జామ ఆకులను తినడం లేదా ఈ ఆకులతో చేసిన టీ తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని ఎవరైనా అంటే అందరికి ఆశ్చర్యం కలుగుతుంది. వారు చెప్పింది ఎంతవరకు నిజమో...

జామకాయను శాస్త్రీయ భాషలో పిసిడియం గుజావా అంటారు. దీనిని మనం దేశీ ఆపీల్ అని కూడా అంటాం. దీని పండ్లు ఓవల్, పసుపు-ఆకుపచ్చ రంగులో ఉంటాయి. దాని లోపలి భాగం అంటే గుజ్జు ఎరుపు లేదా తెలుపు రంగులో ఉంటుంది. అయితే దాని ఆకులు పొడవుగా, ప్రకాశవంతమైన ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఈ పండు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినప్పటికీ.. దీని ఆకులలో పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉన్నాయి. జామ ఆకులను అనేక వ్యాధులకు సాంప్రదాయ ఔషధంగా ఉపయోగిస్తారు.
జామ ఆకులు బరువు తగ్గుతాయా?
జామ ఆకులు బరువు తగ్గడానికి ఉపయోగపడతాయని మీరు చాలాసార్లు వినే ఉంటారు. అయితే దీనికి ఏదైనా శాస్త్రీయ ఆధారం ఉందా… అంటే కొందరు ఉపయోగించిన తర్వాత చెప్పినదాని ప్రకారం మాత్రమే అని వైద్య నిపులు అంటున్నారు. అయితే జామ ఆకులు బరువు తగ్గడంలో సహాయపడతాయో లేదో తెలుసుకుందాం.
పరిశోధనలు ఏం చెబుతున్నాయి..?
ఇప్పటివరకు, జామ ఆకు టీ తాగడం లేదా జామ ఆకులను తీసుకోవడం బరువు తగ్గడంలో సహాయపడుతుందని ప్రచురించిన ఏ అధ్యయనాలు సూచించలేదు. జామ ఆకులు రక్తంలో చక్కెర,కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయని కొన్ని ఎలుకలపై జరిగిన పరిశోధనలు సూచిస్తున్నప్పటికీ.. ఈ ఫలితాలు మానవులకు వర్తింప చేయలేదు.
బరువు తగ్గడం అనే వాదన ఎంతవరకు నిజం?
కాటెచిన్స్, క్వెర్సెటిన్, గల్లిక్ యాసిడ్‌లతో సహా జామ ఆకు యాంటీఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడితో పోరాడడం ద్వారా బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తాయి. అయితే బరువు పెరగడానికి ఇది ముడిపడి ఉందని కొందరు పేర్కొన్నారు. అయితే, జామ ఆకు టీ ఈ సమ్మేళనాలను చాలా తక్కువ మొత్తంలో అందిస్తుంది. అదనంగా, ఈ ఆకులలో ఉండే యాంటీఆక్సిడెంట్ల వినియోగం ద్వారా బరువు తగ్గడానికి ఏ పరిశోధన మద్దతు ఇవ్వదు.
జామ ఆకులతో బరువు తగ్గడానికి..
దోహదపడతాయని చెబుతారు. కానీ ఏ శాస్త్రీయ అధ్యయనమూ ఈ వాదనలకు మద్దతు ఇవ్వలేదు. అయితే, మీరు చక్కెర పానీయాలకు బదులుగా హెర్బల్ టీ తాగితే బరువు తగ్గవచ్చు. ఈ సందర్భంలో.. జామ ఆకు టీ కూడా మీకు పరోక్షంగా సహాయపడుతుంది. కానీ దానిని సమర్థవంతమైన నివారణగా పరిగణించవద్దు.