Health Tips: టొమాటో జ్యూస్‌తో బోలెడన్ని ప్రయోజనాలు.. డైలీ ఉదయాన్నే తాగితే..

Benefits Of Tomato Juice: టమాటాల్లో ఎన్నో పోషకాలు ఉన్నాయి. వీటిని ప్రతిరోజూ తినడం ద్వారా పలు సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

Health Tips: టొమాటో జ్యూస్‌తో బోలెడన్ని ప్రయోజనాలు.. డైలీ ఉదయాన్నే తాగితే..
Tomato Juice
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 27, 2022 | 6:30 AM

Benefits Of Tomato Juice: టమాటాల్లో ఎన్నో పోషకాలు ఉన్నాయి. వీటిని ప్రతిరోజూ తినడం ద్వారా పలు సమస్యలకు చెక్ పెట్టవచ్చు. సాధారణంగా టమాటాలను శక్తినిచ్చే కూరగాయగా పరిగణిస్తారు. ఎప్పుడైనా అలసిపోయినట్లు అనిపించినప్పుడు చాలామంది ఎనర్జీ డ్రింక్ తీసుకోవాలని అనుకుంటారు. అయితే, ఎనర్జీ డ్రింక్స్ ఆరోగ్యానికి చాలా హానికరం. అటువంటి పరిస్థితిలో టమోటా జ్యూస్ మీ ఆరోగ్యానికి ఎనర్జీ డ్రింక్ కంటే ఏం తక్కువ కాదని తెలిపారు. అధిక వ్యాయామం తర్వాత కూడా శరీరంలో శక్తిని నిర్వహించడానికి టొమాటో రసం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. టొమాటో జ్యూస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్లు, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, పొటాషియం, ఫాస్పరస్ వంటి ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల, ఈ రసం శరీరానికి చాలా మంచిదని భావిస్తారు. టమోటా రసం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

గుండెకు ప్రయోజనకరం: టొమాటో జ్యూస్‌లో విటమిన్లు బి-3, ఇ, లైకోపీన్ ఉన్నాయి. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి. దీనిలోని పొటాషియం రక్తపోటును తగ్గిస్తుంది. ఇది గుండెపోటు వచ్చే అవకాశాలను కూడా నియంత్రిస్తుంది.

ఎముకలకు బలాన్ని ఇస్తుంది: టమోటా రసంలో విటమిన్ కె, కాల్షియం ఉంటాయి. ఇది ఎముకలను బలంగా మారుస్తుంది. టమాటా రసం తీసుకుంటే ఎముకలకు సంబంధించిన సమస్యలన్నీ తగ్గుతాయి.

ఇవి కూడా చదవండి

ధూమపానం ప్రభావాలను తిప్పికొడుతుంది: టొమాటో రసం ధూమపానం వల్ల శరీరానికి కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది. టొమాటోలో క్లోరోజెనిక్ యాసిడ్, కౌమారిక్ యాసిడ్ ఉంటాయి. ఇవి సిగరెట్ ద్వారా శరీరంలో ఉత్పత్తి అయ్యే క్యాన్సర్ కారకాలతో పోరాడుతాయి.

రోగనిరోధక వ్యవస్థను బలంగా మారుస్తుంది: టొమాటో జ్యూస్‌లో మంచి మొత్తంలో విటమిన్ సి ఉంటుంది. ఇది మీ రోగనిరోధక శక్తిపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. టొమాటో రసం జలుబు, ఫ్లూ నుంచి రక్షించడంలో కూడా సహాయపడుతుంది. దీని వల్ల శరీరానికి మరెన్నో ప్రయోజనాలు కలుగుతాయి.

టమోటాలు తినే ముందు ఈ విషయాలను గుర్తుంచుకోండి..

  • మీకు కిడ్నీ సమస్య ఉన్నట్లయితే, చాలా పరిమిత పరిమాణంలో టమోటా రసం తీసుకోవాలి.
  • అలర్జీ ఉన్నవారు టొమాటో జ్యూస్ తాగడం మానేయాలి.
  • గర్భవతి అయినా లేదా బాలింతలయితే.. టమోటా రసం తీసుకునే ముందు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..