AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఖమ్మం ఎంపీ టికెట్‎పై వారసుల కన్ను.. రేసులో ఉన్నది వీరే..

సోనియా ఖమ్మం నుంచి పోటీ చేయట్లే. కాంగ్రెస్‌ ఫైర్ బ్రాండ్‌గా పిలిచే రేణుకా చౌదరి పెద్దల సభకు వెళ్లేందుకు ఫిక్సయ్యారు. ముగ్గురు మంత్రుల కుటుంబ సభ్యులే ఖమ్మం ఎంపీ టికెట్ రేసులో ఉండటంతో.. పార్లమెంట్ ఛాన్స్ ఎవరికి దక్కుతుందోనని ఉత్కంఠగా మారింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో ఖమ్మం కీ రోల్ పోషించింది. జిల్లాలో 9 స్థానాలు గెలుచుకొని అదే ఉత్సాహం తో పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని ఉవ్విళ్ళూరుతోంది.

Telangana: ఖమ్మం ఎంపీ టికెట్‎పై వారసుల కన్ను.. రేసులో ఉన్నది వీరే..
Congress
Srikar T
|

Updated on: Feb 15, 2024 | 11:51 AM

Share

సోనియా ఖమ్మం నుంచి పోటీ చేయట్లే. కాంగ్రెస్‌ ఫైర్ బ్రాండ్‌గా పిలిచే రేణుకా చౌదరి పెద్దల సభకు వెళ్లేందుకు ఫిక్సయ్యారు. ముగ్గురు మంత్రుల కుటుంబ సభ్యులే ఖమ్మం ఎంపీ టికెట్ రేసులో ఉండటంతో.. పార్లమెంట్ ఛాన్స్ ఎవరికి దక్కుతుందోనని ఉత్కంఠగా మారింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో ఖమ్మం కీ రోల్ పోషించింది. జిల్లాలో 9 స్థానాలు గెలుచుకొని అదే ఉత్సాహం తో పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని ఉవ్విళ్ళూరుతోంది. ఖమ్మం పార్లమెంటు పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాలను క్లీన్ స్వీప్ చేసింది. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఖమ్మం ఎంపి సీటు కోసం కాంగ్రెస్ ప్రముఖులు పోటీ పడుతున్నారు. ఎవరికి వారే అధిష్ఠానం పెద్దల దగ్గర తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఖమ్మం నుంచి పోటీ చేయాలని పీసీసీ ఏకగ్రీవ తీర్మానం చేసి పంపింది. సోనియా పోటీలో లేకుంటే తనదే టికెట్ అంటూ ధీమా వ్యక్తం చేసిన రేణుకా, సోనియా ఇద్దరూ రాజ్యసభకి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్కంఠ తొలగి ఆశావాహులకు లైన్ క్లియర్ అయింది. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల కుటుంబ సభ్యులు టికెట్ రేసులో ఉండటం ఆసక్తి రేపుతోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని ఎంపీగా పోటీ చేయడానికి దరఖాస్తు చేసుకున్నారు. ఖమ్మం నుంచి గాంధీభవన్‌ వరకు తన అనుచరులతో కలిసి భారీ కార్ల ర్యాలీ తీశారు.

జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి తనకి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ దీపాదాస్ మున్షీని మంత్రి పొంగులేటి కలిసి చర్చించారు. మరోవైపు ఈ నెల 18న ప్రసాదరెడ్డి కుమారుడి రిసెప్షన్‌ పేరుతో బలప్రదర్శనకు సిద్ధమైనట్లు టాక్ నడుస్తోంది. ప్రసాదరెడ్డి కుమారుడి రిసెప్షన్‌ ప్రస్టేజ్‌గా తీసుకున్న.. పొంగులేటి తన స్వగ్రామం ఖమ్మం జిల్లా కల్లూరులో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంతో తాము ఏంటో నిరూపించుకోవడానికి చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే మంత్రి పొంగులేటి గతంలో తన కుమారుడు, కుమార్తె వివాహాల సందర్భంగా ఖమ్మంలో గ్రాండ్‌గా ఇలాంటి రిసెప్షన్‌లు ఏర్పాటు చేసి బల ప్రదర్శన చేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు తుమ్మల యుగంధర్ కూడా ఎంపి టికెట్ ఆశిస్తున్నారు. ఇప్పటివరకూ తండ్రి గెలుపులో వెనకుండి క్రియాశీల పాత్ర పోషించారు యుగంధర్. ఇపుడు ఎంపి టికెట్‌తో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఆయన భావిస్తున్నారు. ఖమ్మంకు చెందిన పారిశ్రామిక వంకాయల పాటి రాజేంద్రప్రసాద్ సైతం.. టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రముఖులు రేసులో ఉండటంతో హాట్ సీట్‌గా మారింది ఖమ్మం ఎంపీ టికెట్.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..