AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షుగర్ ఉన్నవారు అరటిపండు తింటే ఏమవుతుంది..? తినే ముందు ఈ విషయాలు పక్కా తెలుసుకోండి..

షుగర్ ఉన్నవాళ్లు పండ్లు తినొచ్చా లేదా అనే విషయంలో ఎప్పుడూ భయాందోళనలు ఉంటాయి. ముఖ్యంగా అరటిపండు ఆరోగ్యానికి మంచిదని కొందరు, షుగర్ పెరుగుతుందని మరికొందరు వాదిస్తుంటారు. ఈ గందరగోళంపై ప్రముఖ వైద్యులు డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా స్పందిస్తూ.. మధుమేహులు తాము తినే పండ్ల విషయంలో ఎందుకు జాగ్రత్తగా ఉండాలో శాస్త్రీయంగా వివరించారు.

Krishna S
|

Updated on: Feb 08, 2026 | 3:15 PM

Share
Diabetic patients

Diabetic patients

1 / 5
గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఒక ఆహారం తిన్న తర్వాత రక్తంలో చక్కెరను ఎంత వేగంగా పెంచుతుందో తెలిపే కొలత. పండిన అరటిపండు గ్లైసెమిక్ ఇండెక్స్ 62 కాగా, మనం వాడే సహజ చక్కెర GI 63. అంటే అరటిపండు తినడం దాదాపు నేరుగా చక్కెర తినడంతో సమానమని మనం అర్థం చేసుకోవాలి. కేవలం GI మాత్రమే కాకుండా గ్లైసెమిక్ లోడ్ కూడా ముఖ్యమే. అరటిపండు GL 13 గా ఉంటుంది కానీ మధుమేహులు GL 10 కంటే తక్కువ ఉన్న ఆహారం తీసుకోవడం సురక్షితం.

2 / 5
ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాల విషయానికి వస్తే.. 25 కంటే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు మధుమేహులకు మేలు చేస్తాయి. ఉదాహరణకు జామకాయ, దోసకాయ, ఆకుకూరలు, వేరుశెనగ వంటివి రక్తంలో చక్కెరను త్వరగా పెంచవు. వీటిలో ఫైబర్, విటమిన్లు పుష్కలంగా ఉండటం వల్ల ఇవి సురక్షితమైన ఎంపికలుగా నిలుస్తాయి.

3 / 5
తీపి పండ్ల పట్ల మనకు ఉండే కోరిక వెనుక పెద్ద ప్రమాదం దాగి ఉందని డాక్టర్ హెచ్చరించారు. తీపి పండ్లలో ఉండే ఫ్రక్టోజ్ కాలేయంలో కొవ్వుగా మారి నిల్వ చేయబడుతుంది. దీనివల్ల ఫ్యాటీ లివర్ సమస్యలు, ఊబకాయం, రక్తంలో ట్రైగ్లిజరైడ్లు పెరిగే అవకాశం ఉంది. కేవలం షుగర్ పెరగడమే కాకుండా శరీరంలోని ఇతర అవయవాలపై కూడా ఇది ప్రభావం చూపుతుంది.

4 / 5

5 / 5
Follow Us