ACB Enquiry: అమ్మ బాబాయ్..! వీడు మామూలోడు కాదు.. కూపీలాగిన కొద్దీ క్యూ కడుతున్న బినామీలు..!

ఏసీబీ దర్యాప్తులో HMDA మాజీ డైరెక్టర్‌ శివబాలకృష్ణ అక్రమాస్తుల డొంక అంతకంతకూ పెరుగుతూపోతుంది. బినామీలు భరత్‌, భరణి, సత్యనారాయణ, శ్రీకర్‌లపై అల్రెడీ ఎంక్వయిరీ ఫ్రేమ్‌ పిక్సయింది. విచారణలో మరికొందరు బినామీల వ్యవహారం తెరపైకి వచ్చింది. సబ్‌ స్టాఫ్‌ను పావులుగా వాడుకున్నాడు శివబాలకృష్ణ. అటెండర్‌ హబీబ్‌, డ్రైవర్‌ గోపీల పేరిట భారీగా ఆస్తులు రిజిష్టర్‌ చేయించినట్టు గుర్తించారు ఏసీబీ అధికారులు.

ACB Enquiry: అమ్మ బాబాయ్..! వీడు మామూలోడు కాదు.. కూపీలాగిన కొద్దీ క్యూ కడుతున్న బినామీలు..!
Shiva Balakrishna
Follow us
Ranjith Muppidi

| Edited By: Balaraju Goud

Updated on: Feb 14, 2024 | 8:00 PM

ఏసీబీ దర్యాప్తులో HMDA మాజీ డైరెక్టర్‌ శివబాలకృష్ణ అక్రమాస్తుల డొంక అంతకంతకూ పెరుగుతూపోతుంది. బినామీలు భరత్‌, భరణి, సత్యనారాయణ, శ్రీకర్‌లపై అల్రెడీ ఎంక్వయిరీ ఫ్రేమ్‌ పిక్సయింది. విచారణలో మరికొందరు బినామీల వ్యవహారం తెరపైకి వచ్చింది. సబ్‌ స్టాఫ్‌ను పావులుగా వాడుకున్నాడు శివబాలకృష్ణ. అటెండర్‌ హబీబ్‌, డ్రైవర్‌ గోపీల పేరిట భారీగా ఆస్తులు రిజిష్టర్‌ చేయించినట్టు గుర్తించారు ఏసీబీ అధికారులు. డ్రైవర్‌ గోపికి శివబాలకృష్ణ గిఫ్ట్‌గా ఏకంగా హోండా సిటీ కారు కొనిచ్చినట్టు దర్యాప్తులో తేలింది

HMDA మాజీ డైరెక్టర్‌ శివబాలకృష్ణ అక్రమాస్తుల డొంక అంతకంతకూ పెరుగుతోంది. ఏసీబీ తనిఖీల్లో నోట్ల కట్టలు.. మినీ సైజ్‌ జువెల్లరీ షాప్‌ను తలపించేలా నగలు.. ఖరీదైన బ్రాండెడ్‌ వాచెస్‌.. స్మార్ట్‌ఫోన్‌లు తళుక్కుమన్నాయి. ఆయన ఆస్తులు ఆదాయానికి మించి వున్నట్టు ఆరంభంలోనే తేలింది. ఇక కూపీలాగిన కొద్దీ బినామీ బాగోతాలు క్యూ కడుతున్నాయి. బంధుమిత్రులు మాత్రమే కాదు శివబాలకృష్ణ బినామీల జాబితాలో బంట్రోతు ,కారు డ్రైవర్‌ పేర్లు తెరపైకి వచ్చాయి. అటెండర్‌ హబీబ్‌, కారు డ్రైవర్‌ గోపీల పేరిట భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు గుర్తించారు ఏసీబీ అధికారులు. లంచం వ్యవహారాల్లో హబీబ్‌, గోపిలది కీలక పాత్ర అని దర్యాప్తులో తేలింది. డ్రైవర్‌ గోపికి శివ బాలకృష్ణ హోండా సిటీ కారు గిఫ్ట్‌ ఇచ్చారనే ముచ్చట కూడా తెరపైకి వచ్చింది. యాదాద్రి జిల్లాలో 57 ఎకరాల భూమి శివబాలకృష్ణ బినామీల పేరుతో కొనుగోలు చేసినట్టు గుర్తించారు. ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేయొద్దంటూ ఇప్పటికే యాదాద్రి జిల్లా కలెక్టర్‌కు లేఖ కూడా రాశారు ఏసీబీ అధికారులు.

ఏసీబీ దర్యాప్తులో HMDA మాజీ డైరెక్టర్‌ శివబాలకృష్ణ బినామీలు భరత్‌, భరణి, సత్యనారాయణ, శ్రీకర్‌లను విచారించేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమయ్యారు. భరత్, భరణి ఇద్దరూ శివరామకృష్ణకు మేన అల్లుళ్లు. చాలా వరకు డీల్స్‌లో కీలకంగా వ్యవహరించారు. ఎన్విస్ డిజైన్ స్టూడియో పేరుతో భరత్‌ ఓ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడు. ఆ కన్సల్టెన్సీ ద్వారానే రియల్ ఎస్టేట్ వ్యాపారులతో డీల్స్‌ చేసేవాడు.

మరో బినామీ ప్రమోద్ కుమార్‌కు మీనాక్షి కన్‌స్ట్రక్షన్‌లో ఉద్యోగం ఉంది. అక్కడి నుంచి లే అవుట్లకు సంబంధించిన పనులు చేయించాడు. ఇక, శివ బాలకృష్ణ ఆర్థిక లావాదేవీలన్నింటినీ సొదరుడు నవీన్ కుమార్ చూసుకునేవాడు. సకుటుంబ సమేతమన్నట్టు అవినీతి కుటీర పరిశ్రమతో పాటు ఆఫీస్‌ స్టాఫ్‌కూ తన అక్రమార్జనలో చోటు కల్పించాడు శివబాలకృష్ణ. ఏసీబీ విచారణలో మున్ముందు మరిన్ని బిగ్‌ బ్రేకింగ్స్‌ ఖాయమని తెలుస్తోంది. గాఢత ఆ రేంజ్‌లో ఉంది మరి. బినామీలపై ఫుల్‌గా ఫోకస్‌ పెట్టారు ఏసీబీ అధికారులు. ఆ ఔట్‌ కమ్‌తో బిగ్‌ షాట్స్‌ను రేపోమాపో ఫ్రేమ్‌లోకి తానూ వచ్చనే చర్చ జరుగుతోంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…