తెలంగాణలో తెరపైకి విగ్రహాల వివాదం.. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్దం..

తెలంగాణ సెక్రటేరియేట్ ముందు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటుకు సిద్ధమైంది రేవంత్ సర్కార్. అమరవీరుల స్మారకం ఎదురుగా ఉన్న ఖాళీ ప్లేస్‌లో శంకుస్థాపన కూడా చేశారు సీఎం రేవంత్, మంత్రులు. అయితే.. రాజీవ్‌కు తెలంగాణకు సంబంధం ఏంటని?.. ఇక్కడ ఆయన విగ్రహం ఎందుకని ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. తెలంగాణలో అధికార, విపక్షాల మధ్య ఇప్పటికే.. టగ్‌ ఆఫ్ వార్ నడుస్తోంది.

తెలంగాణలో తెరపైకి విగ్రహాల వివాదం.. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్దం..
Cm Revanth Reddy
Follow us
Srikar T

|

Updated on: Feb 15, 2024 | 8:30 AM

తెలంగాణ సెక్రటేరియేట్ ముందు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటుకు సిద్ధమైంది రేవంత్ సర్కార్. అమరవీరుల స్మారకం ఎదురుగా ఉన్న ఖాళీ ప్లేస్‌లో శంకుస్థాపన కూడా చేశారు సీఎం రేవంత్, మంత్రులు. అయితే.. రాజీవ్‌కు తెలంగాణకు సంబంధం ఏంటని?.. ఇక్కడ ఆయన విగ్రహం ఎందుకని ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. తెలంగాణలో అధికార, విపక్షాల మధ్య ఇప్పటికే.. టగ్‌ ఆఫ్ వార్ నడుస్తోంది. ఇప్పుడు రెండు పార్టీల మధ్య విగ్రహ వివాదం మొదలైంది. తెలంగాణ సెక్రటేరియేట్ ముందు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టేందుకు కాంగ్రెస్ సిద్ధం కాగా, దీనిని తెలంగాణ సమాజం ఒప్పుకోదని బీఆర్ఎస్ కౌంటర్ ఎటాక్‌కు దిగింది.

రాజీవ్ విగ్రహ ఏర్పాటు అనుకున్నదే తడవుగా.. సెక్రటేరియేట్ ముందు.. అమరుల స్మారకానికి ఎదురుగా ఉన్న ఖాళీ ప్లేసులో.. శంకుస్థాపన కూడా చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రులు, కాంగ్రెస్ ముఖ్య నాయకులంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంబేద్కర్, ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు, జైపాల్ రెడ్డి లాంటి వారి విగ్రహాలు ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఉన్నా.. రాజీవ్‌ విగ్రహం లేని లోటు స్పష్టంగా కనిపిస్తుందన్నారు సీఎం రేవంత్. టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన రాజీవ్ విగ్రహాన్ని.. అతి త్వరలోనే సోనియాను తీసుకొచ్చి ఆవిష్కరిస్తామన్నారు సీఎం. సీఎం పదవి ఇచ్చినందుకు రేవంత్.. స్వామిభక్తిని చాటుకుంటున్నారని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. రాజీవ్‌కి తెలంగాణతో ఏం సంబంధం అని, ఆయన విగ్రహం సెక్రటేరియేట్ ముందు పెట్టడం కాంగ్రెస్ దిగజారుడు తనానికి నిదర్శనం అన్నారు. అధికార, విపక్షాల మధ్య.. కొత్తగా విగ్రహ వివాదం రాజుకుంది. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని ప్రపోజ్ చేసిన చోట రాజీవ్ విగ్రహం ఏంటని బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంటే.. బరాబర్ విగ్రహం పెట్టి తీరుతామని కాంగ్రెస్ అంటోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..