AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అనుమానమే పెను భూతం.. తాళి కట్టిన ఆలిని అత్యంత పాశవికంగా హతమార్చిన భర్త..!

అనుమానం పెను భూతంగా మారింది. తాళి కట్టిన ఆలిని అత్యంత పాశవికంగా కడతేర్చాడు ఓ మృగాడు. అనుమానంతో తరుచూ గొడవ చేస్తూ.. చివరకు ఆమెను కాటికి పంపించేశాడు. ఈ విషాద ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ఈ దారుణానికి సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో జరిగిన ఈ ఘటన స్థానికులను ఆందోళనకు గురి చేసింది.

అనుమానమే పెను భూతం.. తాళి కట్టిన ఆలిని అత్యంత పాశవికంగా హతమార్చిన భర్త..!
Jagtial Distric Crime News
G Sampath Kumar
| Edited By: |

Updated on: Feb 08, 2026 | 10:00 AM

Share

అనుమానం పెను భూతంగా మారింది. తాళి కట్టిన ఆలిని అత్యంత పాశవికంగా కడతేర్చాడు ఓ మృగాడు. అనుమానంతో తరుచూ గొడవ చేస్తూ.. చివరకు ఆమెను కాటికి పంపించేశాడు. ఈ విషాద ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ఈ దారుణానికి సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో జరిగిన ఈ ఘటన స్థానికులను ఆందోళన కీ గురి చేసింది.

లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన మల్లయ్యకు కొంతకాలంగా తన భార్యపై అనుమానం మొదలైంది. ఈ విషయంపై తరుచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవని స్థానికులు చెప్తున్నారు. చివరకు శనివారం (ఫిబ్రవరి 07) తెల్లవారు జామున 2 గంటల సమయంలో భార్య సత్తవ్వను దారుణంగా హత్య చేశాడు మల్లయ్య.

అనుమానంతో భార్య సత్తవ్వపై కసి పెంచుకున్న మల్లయ్య శనివారం తెల్లవారు జామున 2 గంటల సమయంలో గొంతు కోసి, గొడ్డలితో దారుణంగా నరికి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఆమె ప్రైవేట్ పార్టులో కర్ర పెట్టి చిత్రహింసలకు గురి చేసిన నిందితుడు, ఆమె చనిపోయిందని నిర్దారించుకున్న తరువాత పరార్ అయ్యాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సత్తవ్వ హత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుని కోసం గాలింపు చేపట్టారు. అనుమానంతో భార్యను చంపిన విషయం తెలిసిన గ్రామస్తులు దిగ్భ్రాంతికి గురయ్యారు. భార్యాభర్తల మధ్య వచ్చిన విభేదాలు సద్దుమణిగకపోవడం వల్లే హత్య చేసే వరకూ చేరుకుందని తెలుస్తోంది. నిందితుడు కోసం పోలీసులు వేట మొదలు పెట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..