AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2026 : క్రికెట్ పోరులో నేడు నిప్పుల వర్షమే..మూడు మ్యాచ్‌లు..ఆరు జట్లు..గెలిచేదెవరు?

T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026 రెండో రోజు (ఫిబ్రవరి 8) క్రికెట్ అభిమానులకు అసలైన వినోదం పంచేందుకు సిద్ధమైంది. నేడు ఏకంగా మూడు ఉత్కంఠభరిత పోరులు జరగనున్నాయి. న్యూజిలాండ్, ఇంగ్లాండ్, శ్రీలంక వంటి దిగ్గజ జట్లతో పాటు అఫ్గానిస్థాన్, నేపాల్, ఐర్లాండ్ వంటి జట్లు తలపడనున్నాయి.

T20 World Cup 2026 : క్రికెట్ పోరులో నేడు నిప్పుల వర్షమే..మూడు మ్యాచ్‌లు..ఆరు జట్లు..గెలిచేదెవరు?
T20 World Cup 2026
Rakesh
|

Updated on: Feb 08, 2026 | 10:50 AM

Share

T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026 రెండో రోజు (ఫిబ్రవరి 8) క్రికెట్ అభిమానులకు అసలైన వినోదం పంచేందుకు సిద్ధమైంది. నేడు ఏకంగా మూడు ఉత్కంఠభరిత పోరులు జరగనున్నాయి. న్యూజిలాండ్, ఇంగ్లాండ్, శ్రీలంక వంటి దిగ్గజ జట్లతో పాటు అఫ్గానిస్థాన్, నేపాల్, ఐర్లాండ్ వంటి జట్లు తలపడనున్నాయి. ముఖ్యంగా సహ ఆతిథ్య దేశం శ్రీలంక తన హోమ్ గ్రౌండ్‌లో నేడు ప్రయాణాన్ని మొదలుపెట్టబోతోంది. ఈ మూడు మ్యాచ్‌లు ఎక్కడ, ఎప్పుడు జరుగుతాయి? లైవ్ స్ట్రీమింగ్ వివరాలేంటో తెలుసుకుందాం.

1. న్యూజిలాండ్ వర్సెస్ అఫ్గానిస్థాన్

ఈరోజు తొలి పోరు గ్రూప్-డి లోని బలమైన జట్లు న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్ మధ్య జరగనుంది. గతేడాది 2024 వరల్డ్ కప్‌లో అఫ్గాన్ చేతిలో 84 పరుగుల తేడాతో కివీస్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆ మ్యాచ్‌లో గుర్బాజ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. నేడు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా ఉదయం 11 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. స్పిన్‌కు అనుకూలించే చెన్నై పిచ్‌పై రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ వంటి అఫ్గాన్ స్పిన్నర్లను కివీస్ బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారో చూడాలి. 10:30 గంటలకు టాస్ పడుతుంది.

2. ఇంగ్లాండ్ వర్సెస్ నేపాల్

మధ్యాహ్నం 3 గంటలకు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్ జట్టు నేపాల్‌తో తలపడనుంది. రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఇంగ్లాండ్‌కు నేపాల్ గట్టి పోటీ ఇవ్వగలదా అనేది ఆసక్తికరం. నేపాల్ జట్టు గత కొన్ని ఏళ్లుగా అద్భుతమైన ప్రతిభను కనబరుస్తోంది. బ్యాటింగ్‌కు స్వర్గధామం లాంటి వాంఖడే పిచ్‌పై జోస్ బట్లర్, లియామ్ లివింగ్‌స్టోన్ వంటి హిట్టర్లు విరుచుకుపడే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2:30 గంటలకు టాస్ పడుతుంది.

3. శ్రీలంక వర్సెస్ ఐర్లాండ్

నేటి మూడవ, చివరి మ్యాచ్ రాత్రి 7 గంటలకు కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరుగుతుంది. సహ ఆతిథ్య దేశం శ్రీలంక తన తొలి మ్యాచ్‌ను ఐర్లాండ్‌తో ఆడుతుంది. ఇప్పటి వరకు ఈ రెండు జట్ల మధ్య జరిగిన మూడు టీ20ల్లోనూ లంకదే విజయం. అయితే ఐర్లాండ్ జట్టు ఎప్పుడైనా షాక్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ గ్రూప్-బి పోరు రాత్రి 6:30 గంటలకు టాస్ వేయడంతో ప్రారంభమవుతుంది. శ్రీలంక స్పిన్నర్లు వనిందు హసరంగ, మహీష్ తీక్షణ ఐర్లాండ్ బ్యాటర్లను ఎలా కట్టడి చేస్తారో వేచి చూడాలి.

లైవ్ ఎక్కడ చూడాలి?

ఈ మూడు మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం టీవీలో అయితే స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెళ్లలో చూడవచ్చు. మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌లో ఆన్‌లైన్ ద్వారా చూడాలనుకునే వారు జియో హాట్‌స్టార్ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్‌ను వీక్షించవచ్చు. వీకెండ్ ముగుస్తున్న వేళ ఈ ఆదివారం క్రికెట్ ప్రియులకు పండగలా మారడం ఖాయం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సినిమా విడుదలై 13 ఏళ్లైనా డైలాగ్స్‌కు ఇంకా పూనకాలే
సినిమా విడుదలై 13 ఏళ్లైనా డైలాగ్స్‌కు ఇంకా పూనకాలే
పారతో వృద్దురాలిపై విచక్షణారహితంగా దాడి చేసిన వ్యక్తి!
పారతో వృద్దురాలిపై విచక్షణారహితంగా దాడి చేసిన వ్యక్తి!
వామ్మో.. ఇదెక్కడి క్రేజ్ రా బాబూ.. ఓటీటీనే క్రాష్ చేసిన ఫ్యాన్స్.
వామ్మో.. ఇదెక్కడి క్రేజ్ రా బాబూ.. ఓటీటీనే క్రాష్ చేసిన ఫ్యాన్స్.
ఆరోగ్యానిచ్చే..టేస్టీ టేస్టీ కుల్ఫీ.. కొర్రలతో ఇలా చేయండి!
ఆరోగ్యానిచ్చే..టేస్టీ టేస్టీ కుల్ఫీ.. కొర్రలతో ఇలా చేయండి!
సండే స్పెషల్ : ఉల్లిపాయలతో ఎండు చేపల పులుసు.. తింటే వదిలిపెట్టరు!
సండే స్పెషల్ : ఉల్లిపాయలతో ఎండు చేపల పులుసు.. తింటే వదిలిపెట్టరు!
ఆ గ్రామంలో కుప్పలు తెప్పులుగా కోతుల గుంపులు.. బయటకెళ్లేందుకు..
ఆ గ్రామంలో కుప్పలు తెప్పులుగా కోతుల గుంపులు.. బయటకెళ్లేందుకు..
మంచు విష్ణుకు తిరుచానూరు పోలీసుల నోటీసులు
మంచు విష్ణుకు తిరుచానూరు పోలీసుల నోటీసులు
మహాశివరాత్రి.. ఈరోజు శివుడికి ఆగ్రహం తెప్పించే ఈ తప్పులు చేయొద్దు
మహాశివరాత్రి.. ఈరోజు శివుడికి ఆగ్రహం తెప్పించే ఈ తప్పులు చేయొద్దు
స్టార్ హీరోతో పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్‌‌
స్టార్ హీరోతో పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్‌‌
UPSC సివిల్​ సర్వీసెస్ పరీక్ష​ రూల్స్ మారాయ్‌! కొత్త పద్ధతులు ఇవే
UPSC సివిల్​ సర్వీసెస్ పరీక్ష​ రూల్స్ మారాయ్‌! కొత్త పద్ధతులు ఇవే